వెస్ట్ సైడ్ స్టోరీ
'వెస్ట్ సైడ్ స్టోరీ' 1961లో విడుదలైన అమెరికన్ సినిమా. ఈ సంగీత ప్రధానమైన రొమాంటిక్ డ్రామాను రాబర్ట్ వైస్, జెరోమ్ రాబిన్స్‌ల దర్శకత్వంలో నిర్మించారు.[4]
వెస్ట్ సైడ్ స్టోరీ | |
---|---|
దర్శకత్వం |
|
స్క్రీన్ ప్లే | ఎర్నెస్ట్ లేమాన్ |
దీనిపై ఆధారితం |
|
నిర్మాత | రాబర్ట్ వైస్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | డేనియల్ ఎల్.ఫాప్ |
కూర్పు | థామస్ స్టాన్‌ఫోర్డ్ |
సంగీతం | లియోనార్డ్ బెర్న్‌స్టీన్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | యునైటెడ్ ఆర్టిస్ట్స్ |
విడుదల తేదీ | అక్టోబరు 18, 1961 |
సినిమా నిడివి | 152 నిముషాలు[1] |
దేశం | అమెరికా |
భాష | ఇంగ్లీషు |
బడ్జెట్ | $6.75 మిలియన్లు[2] |
బాక్సాఫీసు | $44.1 మిలియన్లు[3] |
కథ
మార్చున్యూయార్క్లో కొంత భాగంపై తమ ఆధిపత్యం కోసం రెండు గాంగులు పోరాటాలు సాగిస్తుంటాయి. ఇందులో ఒక గ్యాంగ్ పేరు 'జెట్స్'. తమ ఆధిక్యత ఉన్న ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యూర్టోరికన్లను రానీయకూడదన్నది వీరి భావన. దీన్ని ఎదిరిస్తుంటారు 'షార్క్స్' గ్యాంగుకు చెందిన ప్యూర్టోరికన్లు. తమ గ్యాంగ్ల మధ్య జరిగే యుద్ధానికి ముందు వాళ్లు డాన్స్‌ల ద్వారా సిద్ధమవుతుంటారు. ఇలాంటి ఒక డాన్స్ సమయంలో షార్ప్ గ్యాంగ్ నాయకుడైన బెర్నార్డో చెల్లెలు మారియా, ప్రత్యర్థి గ్యాంగ్ 'జెట్స్'కు చెందిన టోనీ అనే యువకుడిని చూస్తుంది. వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు. అయితే ఇద్దరికీ తమ పెళ్లి జరగటం కష్టమని తెలుసు. అందుకే వాళ్లు మారియా పనిచేసే బట్టల షాపులో, పెళ్లి బట్టలు ధరించి, షాపులో ఉన్న బొమ్మలే అతిథులుగా ఉత్తుత్తి పెళ్లికూడా చేసుకుంటారు. సినిమాలో ఇదో అద్భుతమైన సన్నివేశం! అయితే తమ పోరాటాల్లో- టోనీ, మారియా అన్నను చంపేస్తాడు. అయినా టోనీతో పారిపోవడానికి ఆమె సిద్ధపడుతుంది. ఇది జరిగేలోపునే షార్క్ బృందంలో సభ్యుడొకరు టోనీని మారియా అన్నను చంపిన దానికి ప్రతీకారంగా – చంపేస్తాడు. మారియా టోనీల ప్రేమకథ ఇలా విషాదాంతమవుతుంది.[4]
నటీనటులు
మార్చు- నటాలీ వుడ్ - మారియా
- రిచర్డ్ బేమర్ - టోనీ
- రస్ టాంబ్లిన్ - రిఫ్
- రీటా మారినో - అనిటా
- జార్జ్ చకిరిస్ - బెర్నార్డో
- సైమన్ ఓక్‌లాండ్ - పోలీస్ లెఫ్ట్‌నెంట్ ష్రాంక్
- నెడ్ గ్లాస్ - డాక్టర్, టోనీ బాస్
- విలియమ్ బ్రామ్లే - పోలీస్ సార్జెంట్ క్రుప్కె
- జాన్ ఆస్టిన్ - గ్లాడ్ హ్యాండ్
- పెన్నీ శాంటన్ - మేడమ్ లూసియా
నిర్మాణం
మార్చున్యూయార్క్ నగరం బ్రాడ్వేలో ఇది అద్భుతమైన సంగీత నృత్య ప్రధానమైన నాటకంగా మొదట అవతారమెత్తింది. ఆ తర్వాత ఇజ్రాయెల్, ఆఫ్రికా, ప్రాచ్య దేశాల్లో కూడా విజయవంతంగా ప్రదర్శితమైన ఈ నాటకాన్ని సినిమాగా తీసేందుకు మొత్తం 3,75,000 డాలర్లను చిత్రీకరణ హక్కులకోసం మిరిష్ పిక్చర్స్ చెల్లించింది. నాటకంలో నృత్య ప్రధానమైన సన్నివేశాలను అలాగే చిత్రీకరించేందుకు, నాటకంలో ఆ సన్నివేశాలకు దర్శకత్వం వహించిన జెరోమీ రాబిన్స్‌ను, మిగిలిన సన్నివేశాల చిత్రీకరణకు రాబర్ట్ వైస్‌ను- ఇద్దర్నీ దర్శకులుగా ఎంచుకున్నారు. అయితే నిర్మాణం ఆరంభమైన తర్వాత దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయ్యాక జెరోమీ రాబిన్స్‌ను తొలగించారు. 'వెస్ట్ సైడ్ స్టోరీ' చిత్రీకరణకోసం దర్శకుడు రాబర్ట్ వైస్, ఏకంగా న్యూయార్క్ లోని మాన్ హట్టన్ వెస్ట్ సైడ్ ప్రాంతంలో ఉన్న భవనాల మధ్య షూటింగ్ చేశారు. అసలు ఆ భవనాలను కూల్చి, అక్కడ లింకన్ సెంటర్‌ను కట్టాలని న్యూయార్క్ అధికారుల ప్లాన్. కానీ, ఈ షూటింగ్ కోసం ఆ కూల్చివేతను కొంతకాలం వాయిదావేశారు. ఇప్పుడు అక్కడ ఆ భవనాలు లేవు గానీ లింకన్ సెంటర్ ఏర్పడింది![4]
పురస్కారాలు
మార్చుపురస్కారం | విభాగము | ప్రతిపాదితుడు (లు) | ఫలితం |
---|---|---|---|
అకాడమీ పురస్కారాలు[5] | ఉత్తమ చిత్రం | రాబర్ట్ వైస్ | గెలుపు |
ఉత్తమ దర్శకుడు | రాబర్ట్ వైస్, జెరోమ్ రాబిన్స్ | గెలుపు | |
ఉత్తమ సహాయ నటుడు | జార్జ్ చకిరిస్ | గెలుపు | |
ఉత్తమ సహాయనటి | రీటా మొరెనో | గెలుపు | |
ఉత్తమ స్క్రీన్ ప్లే | ఎర్నెస్ట్ లేమాన్ | ప్రతిపాదన | |
ఉత్తమ కళా దర్శకత్వం - కలర్ | బోరిస్ లెవెన్, విక్టర్ ఎ.గంగెలిన్ | గెలుపు | |
ఉత్తమ ఛాయాగ్రహణం - కలర్ | డేనియల్ ఎల్.ఫాప్ | గెలుపు | |
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - కలర్ | ఐరేన్ షరాఫ్ | గెలుపు | |
ఉత్తమ ఎడిటింగ్ | థామస్ స్టాన్‌ఫోర్డ్ | గెలుపు | |
ఉత్తమ సంగీతం | సాల్ చాప్లిన్, జానీ గ్రీన్, ఇర్విన్ కోస్టా, సిద్ రమిన్ | గెలుపు | |
ఉత్తమ శబ్దగ్రహణం | ఫ్రెడ్ హేన్స్, గార్డన్ ఇ.సాయర్ | గెలుపు | |
అకాడమీ గౌరవ పురస్కారం [6] | జెరోమ్ రాబిన్స్ | గెలుపు | |
బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డులు | ఉత్తమ సినిమా | ప్రతిపాదన | |
డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డులు | ఉత్తమ దర్శకుడు | రాబర్ట్ వైస్, జెరోమ్ రాబిన్స్ | గెలుపు |
గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు | ఉత్తమ సినిమా - మ్యూజికల్ | గెలుపు | |
ఉత్తమ నటుడు – మ్యూజికల్ | రిచర్డ్ బేమర్ | ప్రతిపాదన | |
ఉత్తమ సహాయ నటుడు | జార్జ్ చకిరిస్ | గెలుపు | |
ఉత్తమ సహాయ నటి | రీటా మొరెనో | గెలుపు | |
ఉత్తమ దర్శకుడు | రాబర్ట్ వైస్, జెరోమ్ రాబిన్స్ | ప్రతిపాదన | |
ఉత్తమ నూతననటుడు | రిచర్డ్ బేమర్ | ప్రతిపాదన | |
జార్జ్ చకిరిస్ | ప్రతిపాదన | ||
గ్రామీ పురస్కారాలు | ఉత్తమ సంగీతం | సాల్ చాప్లిన్, జానీ గ్రీన్, ఇర్విన్ కోస్టా, సిద్ రమిన్ | గెలుపు |
లారెల్ అవార్డులు | టాప్ మ్యూజికల్ | గెలుపు | |
ఉత్తమ సహాయ నటుడు | జార్జ్ చకిరిస్ | ప్రతిపాదన | |
ఉత్తమ సహాయ నటి | రీటా మొరెనో | గెలుపు | |
ఉత్తమ ఛాయాగ్రహణం - కలర్ | డేనియల్ ఎల్.ఫాప్ | గెలుపు | |
ఉత్తమ సంగీతం | సాల్ చాప్లిన్, జానీ గ్రీన్, ఇర్విన్ కోస్టా, సిద్ రమిన్ | ప్రతిపాదన | |
నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డులు | టాప్ టెన్ సినిమాలు | మూడవ స్థానం | |
నేషనల్ ఫిల్మ్ ప్రిజర్వేషన్ బోర్డు | నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీ | చేర్చబడింది | |
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు | ఉత్తమ సినిమా | గెలుపు | |
ఉత్తమ దర్శకుడు | రాబర్ట్ వైస్, జెరోమ్ రాబిన్స్ | ప్రతిపాదన | |
ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డులు | హాల్ ఆఫ్ ఫేమ్ - చలనచిత్రం | గెలుపు | |
శాంట్ జోర్డీ అవార్డులు | ఉత్తమ విదేశీ సినిమా | రాబర్ట్ వైస్, జెరోమ్ రాబిన్స్ | గెలుపు |
శాటర్న్ అవార్డులు | ఉత్తమ క్లాసిక్ డివిడి | గెలుపు | |
రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డులు | ఉత్తమ అమెరికన్ స్క్రీన్ ప్లే | ఎర్నెస్ట్ లేమాన్ | గెలుపు |
మూలాలు
మార్చు- ↑ "వెస్ట్ సైడ్ స్టోరీ (AA)". బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్స్. January 12, 1962. Archived from the original on November 13, 2013. Retrieved June 19, 2013.
- ↑ Mirisch, Walter (2008). I Thought We Were Making Movies, Not History. Madison, Wisconsin: The University of Wisconsin Press. p. 127. ISBN 978-0-299-22640-4. Archived from the original on December 27, 2017. Retrieved August 27, 2020.
- ↑ "వెస్ట్ సైడ్ స్టోరీ(1961)". బాక్సాఫీస్ మోజో. Archived from the original on October 15, 2021. Retrieved 2021-10-15.
- ↑ 4.0 4.1 4.2 పాలకోడేటి సత్యనారాయణరావు (1 April 2007). హాలీవుడ్ క్లాసిక్స్ మొదటి భాగం (1 ed.). హైదరాబాదు: శ్రీ అనుపమ సాహితి. pp. 140–141.
- ↑ "The 34th Academy Awards (1962) Nominees and Winners". oscars.org. Archived from the original on April 2, 2015. Retrieved 2011-08-22.
- ↑ "Jerome Robbins". jeromerobbins.org. Archived from the original on July 27, 2019. Retrieved August 11, 2019.