- ప్రముఖ పారిశ్రామిక వేత్త కృష్ణకుమార్ బిర్లా కోల్‌కతలో మరణించాడు. బిర్లా గ్రూపు పరిశ్రమలకు అధిపతి అయిన అతడు 18 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగినాడు.
- తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి రాష్ట్ర ప్రజలకు రూపాయికే కిలో బియ్యం ఇవ్వనున్నట్లు ప్రకతించాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15 నుంచి ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు.
- ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగు ఓడరేవులను అభివృద్ధి పర్చనున్నట్లు ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రకటించాడు.
- ఝార్ఖండ్ లో నక్సలైట్ల మందుపాతర పేలి 12 మంది పోలీసులు మరణించారు.
- కేంద్ర ప్రభుత్వంలో చేరేది లేదని సమాజ్ వాది పార్టీ స్పష్తం చేసింది.
- పాకిస్తాన్ లో వైమానిక దాడుల్లో 40 మంది తాలిబాన్ ఉగ్రవాదులు మృతిచెందారు.
- రష్యాతో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్లు జార్జియా ప్రకటించింది.
- అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ర్యాంకింగ్‌లో భారత వన్డే జట్టు ఐదవ స్థానానికి దిగజారింది. ఇంగ్లాండు జట్టు నాల్గవ స్థానానికి ఎగబాకింది.
- ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ అమెరికన్ ఓపెన్ టెన్నిస్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
|