వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఫిబ్రవరి 11

ఫిబ్రవరి 11, 2008 (2008-02-11)!(సోమవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • ముంబయిలో చెలరేగిన అలర్లకు చర్యగా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్‌థాకరేపై, సమాజ్‌వాదీ పార్టీ ముంబయి అధ్యక్షుడు అబూఅజ్మీలపై పోలీసులు కేసులు నమోదు.
  • తొలిగించిన న్యాయమూర్తులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తే పాకిస్తాన్ లో న్యాయవాదులు న్యాయస్థానాలను బహిష్కరించారు.
  • భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయని భారత్‌లోని అమెరికా రాయబారి డేవిడ్ ముల్‌ఫోర్డ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
  • అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున పోటీలో ఉన్న బరాక్ ఒబామా , హిల్లరీ క్లింటన్‌పై ఆధిక్యం.
  • కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖపట్నం స్టీల్ ప్లాంట్)కు ఇ-గవర్నెన్స్ అవార్డు.
  • పారిస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ను రష్యా అగ్రశ్రేణి క్రీడాకారిణి అన్నా చక్వతడ్జే కైవసం.
  • బాంబే స్టాక్ ఎక్ఛేంజి సూచీ సెన్సెక్స్‌లో మళ్ళీ భారీ పతనం. 834 పాయింట్లు తగ్గి 16631 పాయింట్లకు దిగజారింది. ఇది మొత్తం సుచీలో 4.8% తగ్గుదల.
  • చైనా లో 92% గ్రామాలకు విస్తరించిన బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం.