బాటా షూమార్ట్ కంపెనీ అధినేత థామస్ బాటా చెకొస్లోవేకియాలో మరణించాడు. ఈతని తండ్రి టోమస్ బాటా 1894లో బాటా షూ కంపెనీని స్థాపించాడు.
హైదరాబాదులోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇస్రో పరిధిలోకి తీసుకువచ్చారు. ఇదివరకు ఎన్.ఆర్.ఎస్.ఏ.అంతరిక్ష విభాగం అధీనంలో ఉండేది.
జపాన్ ప్రధానమంత్రి యసువొ ఫుకుడా పదవికి రాజీనామా చేశాడు. లిబరల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఇతను ఎగువసభలో తన పార్టీకి మెజారిటీ లేకపోవడంతో చట్టాలు అమలుచేయడంలో ఇబ్బందులకు గురై రాజీనామా సమర్పించాడు.
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని 4 విశ్వవిద్యాలయాలుగా విభజించే బిల్లును ఆంధ్రప్రదేశ్ విధానమండలి ఆమోదించింది.