వేమూరి వెంకట సూర్యనారాయణ
వేమూరి వెంకటసూర్యనారాయణ తెలుగు కథా రచయిత. అతను తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందిన వేమూరి వేంకటేశ్వరరావు సోదరుడు. [1]
జీవిత విశేషాలు
మార్చువేమూరి వేంకట సూర్యనారాయణ విశాఖపట్నం జిల్లా, వడ్డాది గ్రామంలో, 1924 మే 14 రాత్రి 4 గం. 45 ని. లకు వేమూరి సోమేశ్వరరావు, (తెన్నేటి) సీతారామమ్మ దంపతులకి పుట్టిన ప్రథమ సంతానం. చోడవరంలో స్కూల్ ఫైనల్ వరకు చదివి మద్రాసులో, కీల్పాక్కంలో స్కూల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ లో 1940-41 గడిపి, నచ్చక, తిరిగి వచ్చి, కాకినాడ పి.ఆర్.కళాశాలలో 1941-43 మధ్య ఇంటరు పూర్తి చేసి, తరువాత విజయనగరం మహరాజ కళాశాలలో బి.ఎ (రసాయన శాస్త్రం) పట్టా పుచ్చుకుని, కాకినాడ, బెజవాడ, మచిలీపట్నంలలో ఉద్యోగం చేసి, శ్రీకాకుళంలో కోఆపరేటివ్ సబ్ రిజిస్టారుగా ఉద్యోగ విరమణ చేసి, 1988 జాన్ 18 న స్వర్గధామం చేరుకున్నాడు.
సా. శ. 1940-60 దశకాలలో "సూర్యం" అన్న కలం పేరుతోనూ, తర్వాత "వి.వి.సూర్యనారాయణ" పేరుతోనూ 70 కథలకి పైబడే రాసి, అప్పుడు ప్రచారంలో ఉన్న ఆనందవాణి, వినోదిని, చిత్రగుప్త, స్వతంత్ర, సుభాషిణి, హారతి, ఆంధ్రపత్రిక, జ్యోతి మొదలైన పత్రికలలో ప్రచురించేడు.[2]
అతను "మానవులు, దానవులు" అనే 200 పేజీలు పైచిలుకు పొడుగున్న ఒక నవల కూడా రాసేడు. అతను కథలు, జోకులు, సినిమాల మీద రాసిన రివ్యూలు కూడా రాసేడు. అతను మరణించిన తరువాత అతని సోదరుడు వేమూరి వేంకటేశ్వరరావు అతను స్వదస్తూరితో రాసి భద్రపరచిన పుస్తకాలను ప్రచురించాలని సంకల్పించాడు. అందులో "ఏకోదరులు" అనే పేరుతో ఒక ఇ-పుస్తకాన్ని 2023 లో విడుదల చేసేడు. అందులో 23 కథలు ఉన్నాయి. రెండవ విడత "నేతిదీపాలు" పేరుతో ప్రచురించేరు.
"ఏకోదరులు" పుస్తకంలోని కథలు
మార్చు- ఎవరిది? (ఆనందవాణి, 1945)
- స్వయంవరం (ఆనందవాణి, 1946)
- మరుపు (ఆనందవాణి, 1946)
- వర్షంలో (ఆనందవాణి, 9 మార్చి 1947)
- లోకంతో నాకేం పని? (ఆనందవాణి, 27 ఏప్రిల్ 1947)
- రేషన్ పెళ్ళికొడుకు (ఆనందవాణి, జూన్ 1947)
- నా గుండె నన్నే ద్రోహం చేసింది (ఆనందవాణి, 13 జూలై 1947)
- రాలే ఆకులు (ఆనందవాణి, 30 నవంబర్ 1947)
- ఒక్క చేప చాలదూ? (ఆనందవాణి, 28 డిసెంబర్ 1947)
- విందు (ఆనందవాణి, 1 ఫిబ్రవరి 1948)
- ఏర్చి కూర్చిన పూలు (ఆనందవాణి, 4 ఏప్రిల్ 1948)
- పరీక్ష (ఆంధ్రపత్రిక, సెప్టెంబర్ 1948)
- ఉరిత్రాడు (ఆంధ్రపత్రిక, అక్టోబర్ 1948)
- పతివ్రత (సూర్యప్రభ, నవంబర్ 1948)
- (అ)ప్రయోజకుడు, (స్వతంత్ర, నవంబర్ 1949)
- తక్షశిల (ఆంధ్రపత్రిక, నవంబర్ 1949)
- పిల్లనగ్రోవి (ఆంధ్రపత్రిక, నవంబర్ 1949)
- పరధ్యానం (వినోదిని, జనవరి 1950)
- పిచ్చినమ్మకాలు (వినోదిని, జూన్ 1950)
- అన్యాపదేశం (వినోదిని, జనవరి 1951)
- అంతరార్థం (చిత్రగుప్త, ??)
- డబ్బు! డబ్బు!! డబ్బు!!! (ఆంధ్రపత్రిక, ఆగస్ట్ 1951)
- క్లెప్టోమేనియా (చిత్రగుప్త, ? 1951)
- కపాలమోక్షం (ఆంధ్రపత్రిక, జూలై 1951)
- ఏకోదరులు (ఆంధ్రపత్రిక, 1958)
- కార్యశూరుడు (ఆంధ్రపత్రిక, మార్చి 1959)
"నేతిదీపాలు" పుస్తకంలోని కథలు
మార్చు- తీర్పు (ఆనందవాణి, ??)
- అతని చేతుల్లోనే చచ్చిపోయింది! (ఆనందవాణి, 20 జులై 1947)
- కలిసొచ్చిన కాలం (ఆనందవాణి, 3 ఆగస్టు 1947)
- సృష్టి లోపం (తెలుగు స్వతంత్ర, డిసెంబరు 10, 1948)
- గుణపాఠం (తెలుగు స్వతంత్ర, 7 ఏప్రిల్ 1950)
- అయాచితం (ఆనందవాణి, 16 ఏప్రిల్ 1950)
- లోకం తీరు: కట్టుకథ (స్వతంత్ర, 12 మే 1950)
- శాస్త్రి (వినోదిని, మే 1950)
- కారణం (జ్యోతి 5 జూలై 1950)
- న్యాయమంత్రి (హారతి, 15 ఆగస్టు 1950)
- ప్రతీకారం (హారతి, 15 అక్టోబరు 1950)
- పరిత్యక్త (హారతి, నవంబరు 1950)
- పరివర్తన (ఆనందవాణి, 10 డిసెంబరు 1950)
- కాంప్లిమెంటరీ (స్వతంత్ర, 5 జనవరి 1951)
- సలహా (ఆంధ్రపత్రిక, 25 మార్చి 1951)
- ప్రారబ్దం(జ్యోతి, 15 మే 1951)
- అలవాటు పడ్డ ప్రాణాలు (చిత్రగుప్త, 1 జూన్ 1951)
- కర్తవ్యం (ఆంధ్రపత్రిక,6 ఫిబ్రవరి 1952)
- అలవాటు (చిత్రగుప్త & కృష్ణాపత్రిక, ??)
- ఆషాఢభూతి (చిత్రగుప్త, సు. 1952)
- నేతిదీపాలు (డిటెక్టివ్, ఫిబ్రవరి 1958)
- నమ్మకస్తుడు (ఆంధ్రపత్రిక,16 ఏప్రిల్ 1958)
కథలు
మార్చుకథ | పత్రిక | పత్రిక అవధి | ప్రచురణ తేది |
---|---|---|---|
ఏకోదరులు[3] | ఆంధ్రపత్రిక | వారం | 1958-09-03 |
కార్యశూరులు[4] | ఆంధ్రపత్రిక | వారం | 1959-03-11 |
నమ్మకస్తుడు[5] | ఆంధ్రపత్రిక | వారం | 1958-04-16 |
మూలాలు
మార్చు- ↑ "వేమూరి వెంకటసూర్యనారాయణ - కథానిలయం". kathanilayam.com. Retrieved 2024-10-18.
- ↑ సుజనరంజని పాఠకుల ప్రత్యేక సంచిక - వేమూరి వెంకటేశ్వర రావు
- ↑ "ఏకోదరులు_వేమూరి వెంకటసూర్యనారాయణ_ఆంధ్రపత్రిక (వారం)_19580903_019235_కథానిలయం.pdf". Google Docs. Retrieved 2024-10-18.
- ↑ "కార్యశూరులు_వేమూరి వెంకటసూర్యనారాయణ_ఆంధ్రపత్రిక (వారం)_19590311_019375_కథానిలయం.pdf". Google Docs. Retrieved 2024-10-18.
- ↑ "నమ్మకస్తుడు_వేమూరి వెంకటసూర్యనారాయణ_ఆంధ్రపత్రిక (వారం)_19580416_019144_కథానిలయం.pdf". Google Docs. Retrieved 2024-10-18.