వై.యస్.రాజారెడ్డి
యెడుగూరి సందింటి రాజారెడ్డి (1925 - 1998 మే 23) కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త. బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండేవాడు. అతని కుమారుడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగానూ[1], అతని మనుమడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ కు రెండవ ముఖ్యమంత్రిగాను పనిచేస్తున్నారు.
వై.యస్.రాజారెడ్డి | |
---|---|
జననం | 1925 |
మరణం | 23 May 1998 పులివెందుల | (aged 72)
మరణ కారణం | పత్యర్థుల బాంబు దాడి |
పిల్లలు | |
బంధువులు |
|
జీవిత విశేషాలు
మార్చువై.ఎస్.రాజారెడ్డి 1925 లో వై.యస్.వెంకటరెడ్డి (1885-1957), మంగమ్మ దంపతులకు వై.ఎస్.ఆర్ కడప జిల్లాకు చెందిన పులివెందులలో జన్మించాడు. అతని భార్య జయమ్మ. అతను స్థానిక వివాదాలను పరిష్కరించడంలో నాయకత్వ బాధ్యతలు వహించటం ద్వారా పేరుగాంచాడు. కొన్ని వివాదాలను పరిష్కరించిన తీరును బట్టి ఈయన కఠినంగా వ్యవహరిస్తారనే ఊహతో వివాదకులలో భయముండేది.
1933 లో అతని తండ్రి వెంకటరెడ్డి హయాంలోనే బలపనూరు నుండి పులివెందుల వచ్చి 120 ఎకరాలు కొనుక్కున్నారు. ఆ తరువాత అక్కడ ఎన్నొ వ్యాపారాలు చేశారు. వాళ్ళ కుటుంబం ఆ కాలం లొనే బర్మా లాంటి దేశాలకి వెళ్ళి వ్యాపారాలు చెసి డబ్బు సంపాదించి ఇక్కడ ఆస్తులు కొనుక్కున్న కుటుంబం. రాజారెడ్డి హయాము లొనే వీళ్ళకి మంగంపేట బైరెటీస్ , కొడూరు మైన్స్ లాంటి గనుల వ్యాపారాలు చేసే వాళ్ళు. రాజంపేట మాజీ పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ గారు "మా తాత గారి దగ్గర రాజా రెడ్డి గారు గనుల పార్టనర్ షిప్ తీసుకున్నారు" అని ఒక ఇంటర్వ్యూ లొ అన్నాడు.
అతని కుమారుడు వె.ఎస్.రాజశేఖరరెడ్డి వైద్యవిద్యను అభ్యసించిన తరువాత రాజారెడ్డి గారు సొంత డబ్బు తొ 70 పడకల ఆసుపత్రి పులివెందులలొ కట్టించి వై.యస్ కి ఇచ్చాడు. అందులొ వై.యస్ వచ్చిన వారు అందరికి ఒక్క రూపాయి కే వైద్యం అందించాడు. అంతేకాకుండా రాజారెడ్డి తన పేరుతో డిగ్రీ కళాశాలను కట్టించి చుట్టు ప్రక్కల గ్రామాల్లోని విద్యార్థులకు విద్యా సదుపాయం కల్పించాడు. అతను పులివెందుల ప్రెసిడెంటుగా ఉన్నప్పుడు చెరువులు త్రవ్వించి చుట్టుప్రక్కల ప్రజలకు దాహార్తిని తీర్చాడు.[2]
హత్య
మార్చుఅతను 1998 మే 23, 1998న తన ఫార్మ్ హౌస్ నుండి పులివెందులకు తిరిగి వెళ్తున్న సమయంలో ప్రత్యర్థి ముఠా జరిపిన బాంబు దాడిలో మరణించాడు. అతను వేముల సమీపంలోని ఎం.పి.డి.ఓ కార్యాలయం వద్ద హత్యకు గురయ్యాడు.[3] ఈ ఘటనలో 11 మందిని నిందితులుగా పేర్కొంటూ అప్పట్లో సి.బి.సి.ఐ.డి కేసు నమోదు చేసింది. చింతలజూటూరుకు చెందిన అన్నారెడ్డి సాంబశివారెడ్డి, అన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, పల్లె వెంకటరామిరెడ్డి, అన్నారెడ్డి లక్ష్మిరెడ్ది, అప్పటి వేముల ఎంపీపీపీ వడ్డారపు ఓబయ్య, వేములకు చెందిన పేర్ల శేషారెడ్డి, పి.రామకృష్ణారెడ్డి, పేర్ల సోమశేఖరరెడ్డి, అమ్మయ్యగారిపల్లెకు చెందిన పోరెడ్డి విశ్వనాథరెడ్డి, వేల్పుల నివాసి రాగిపిండి సుధాకరరెడ్డి, గిందిపల్లె నివాసి పేరం బ్రహ్మానందరెడ్డి;లపై కేసు నమోదు చేసారు. అయితే కేసులో వ్యాజ్యం జరుగుతుండగా పేరం బ్రహ్మానందరెడ్డి మృతి చెందాడు. మిగిలిన 10 మంది జీవిత ఖైదు అనుభవించారు. వీరిలో ఒకరు మినహా మిగిలిన వారందరినీ పోలీసు అధికారులు విడుదల చేసారు. [4] After Raja Reddy’s death, the political party that was in power (TDP) ran a negative campaign on him to tarnish his legacy, as his Son Dr.YSR was the opposition leader at that time who later defeated the same government in 2004.
మూలాలు
మార్చు- ↑ "ప్రజల గుండెల్లో పదిలంగా..!". Sakshi. 2018-07-07. Retrieved 2020-06-18.
- ↑ "అడ్డంగా బుక్కై పవన్ పరువు తీసిన ఫ్యాన్స్ ..!". Dharuvu (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-21. Retrieved 2020-06-18.
- ↑ May 6, IANS; May 6, 2009UPDATED:; Ist, 2009 19:07. "11 sentenced to life for murder of YSR's father". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-06-18.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ విశాలాంధ్ర, వై.ఎస్.ఆర్ జిల్లా, 2016 జనవరి 27, జిల్లా ఎడిషన్ పుట:2