వోల్గా నది ఐరోపాలో అతి పెద్ద నది. ఇది నీటిని సముద్రంలోకి తీసుకువెళ్ళుటలోను, పరీవాహక ప్రాంతంలోనూ కూడా ఐరోపా లోకెల్లా అతి పెద్ద నది. ఈ నది, మధ్య రష్యా గుండా కాస్పియన్ సముద్రం లోకి ప్రవహిస్తోంది. రష్యా జాతీయ నదిగా దీన్ని పరిగణిస్తారు. ఈ నది పొడవు 3,531 కి.మీ., పరీవాహక ప్రాంతం 13,60,000 చ.కి.మీ.[3] భౌగోళికంగా దీనికున్న స్థానం కారణంగా వోల్గా తూర్పు పడమరల మధ్య, ఉత్తర దక్షిణాల మధ్యా ప్రజల రవాణాలో ముఖ్యమైన పాత్ర పోషించింది.[4] చారిత్రికంగా వోల్గా నది యూరేసియన్ నాగరికతలకు ముఖ్యమైన సంగమస్థానంగా నిలిచింది.[5][6][7]

వోల్గా
ఉల్యనోవ్స్క్ వద్ద వోల్గా
వోల్గా డ్రెయినేజి బేసిన్ మ్యాపు
స్థానిక పేరు[Волга] Error: {{Native name}}: missing language tag (help)  (language?)
స్థానం
దేశంరష్యా
నగరాలుట్వెర్, యారిస్లావ్ల్, నీజ్ని నొవ్‌గొరోద్, చెబోక్సరీ, కజాన్, ఉల్యనోవ్స్క్, సమారా, సారాటోవ్, వోల్గోగ్రాడ్, అస్త్రఖాన్
భౌతిక లక్షణాలు
మూలం 
 • స్థానంవల్దాయ్ కొండలు, ట్వెర్ ఓబ్లాస్ట్
 • అక్షాంశరేఖాంశాలు57°9′N 32°36′E / 57.150°N 32.600°E / 57.150; 32.600
 • ఎత్తు228[1] మీ. (748 అ.)
సముద్రాన్ని చేరే ప్రదేశంకాస్పియన్ సముద్రం
 • స్థానం
అస్త్రఖాన్ ఓబ్లాస్ట్
 • అక్షాంశరేఖాంశాలు
45°50′N 47°58′E / 45.833°N 47.967°E / 45.833; 47.967[2]
 • ఎత్తు
−28[1] మీ. (−92 అ.)
పొడవు3,531 కి.మీ. (2,194 మై.)[3]
పరీవాహక ప్రాంతం1,360,000 కి.మీ2 (530,000 చ. మై.)[3]
ప్రవాహం 
 • స్థానంఅస్త్రఖాన్
 • సగటు8,060 m3/s (285,000 cu ft/s)
పరీవాహక ప్రాంత లక్షణాలు
ఉపనదులు 
 • ఎడమకామా
 • కుడిఓకా

రష్యాలోని అడవుల గుండా, అడవుల స్టెప్పీల గుండా, స్టెప్పీల గుండా వోల్గా ప్రవహిస్తుంది. మాస్కోతో సహా, రష్యా లోని 11 ఐ పెద్ద నగరాలు వోల్గా పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. ప్రపంచం లోని అతొపెద్ద జలాశయాల్లో కొన్ని వోల్గా వెంట ఉన్నాయి.

వోల్గా రష్యా సంస్కృతిలో ప్రధానమైన అంగం. రష్యను సారస్వతంలో, జానపదంలో వోల్గాను వోల్గా మాత (వోల్గా మతూష్క) అని అంటారు.

వోల్గా విశేషాలు

మార్చు

ఉపనదులు

మార్చు
 
నీజ్ని నొవ్‌గొరోద్ వద్ద వోల్గా నది
  • అఖ్తూబా పాయ
  • బోల్షోయ్ ఇర్గిజ్
  • సమారా
  • కామా
  • కజాంకా
  • స్వియాగా
  • వెట్లూగా
  • సూరా
  • కెర్జెనెత్స్
  • ఓకా
  • ఉజోలా
  • ఉంజా
  • కొస్త్రోమా
  • కొటోర్స్ల్
  • షెక్స్నా
  • మొలోగా
  • కాషింకా
  • నెర్ల్
  • మెద్వెదిస్తా
  • దుబ్నా
  • షోషా
  • ట్వెర్ట్సా
  • వజూజా
  • సెలిజరోవ్కా

జలాశయాలు

మార్చు

సోవియట్ కాలంలో వోల్గాపై అనేక ఆనకట్టలు జలాశయాలు నిర్మించారు.అవి:

  • వోల్గోగ్రాడ్ జలాశయం
  • సరటోవ్ జలాశయం
  • కుయ్‌బిషేవ్ జలాశయం
  • చెబోక్సరీ జలాశయం
  • గోర్కీ జలాశయం
  • రైబిన్స్క్ జలాశయం
  • ఉగ్లిచ్ జలాశయం
  • ఇవాన్‌కోవో జలాశయం

వోల్గా తీరాన ఉన్న పెద్ద నగరాలు

మార్చు
  • వోల్గోగ్రాడ్
  • నీజ్ని నొవ్‌గొరోద్
  • కజాన్
  • సమారా
  • సారటోవ్
  • తొల్యాట్టి
  • యారోసావ్ల్
  • అస్త్రఖాన్
  • ఉల్యనోవ్స్క్
  • చెబోక్సరీ
  • ట్వెర్


మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; readersnatural అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. Volga at GEOnet Names Server
  3. 3.0 3.1 3.2 «Река Волга» Archived 2016-03-05 at the Wayback Machine, Russian State Water Registry
  4. "Volga River Basin". ResearchGate (in ఇంగ్లీష్). Retrieved 2019-09-11.
  5. Luttwak, Edward N. (2011). Grand strategy of the byzantine empire. Belknap Harvard. p. 52. ISBN 978-0674062078. OCLC 733913679.
  6. Walker, Joel (2007). "Iran and Its Neighbors in Late Antiquity: Art of the Sasanian Empire (224–642 C.E.)". American Journal of Archaeology. 111 (4): 797. doi:10.3764/aja.111.4.795. ISSN 0002-9114.
  7. McNeese, Tim. (2005). The Volga river. Philadelphia: Chelsea House Publishers. pp. 14–16. ISBN 0791082474. OCLC 56535045.