శంకర్ మహదేవన్

ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు
(శంకర్ మహాదేవన్ నుండి దారిమార్పు చెందింది)

శంకర్ మహదేవన్, ఒక భారతీయ సంగీత స్వరకర్త, గాయకుడు. భారతీయ సంగీత కళాకారుల త్రయంగా గుర్తింపు పొందిన శంకర్-ఎహ్సాన్-లోయ్ జట్టులో ఒక భాగం అతను. ఈ జట్టు భారతీయ చలన చిత్రాలకు స్వరకల్పన చేస్తుంది, నేపధ్య గానాన్ని అందిస్తుంది. ఇతను ఉత్తమ నేపథ్య గాయకుడిగా నాలుగు సార్లు జాతీయ అవార్డును గెలుపొందారు. ఇతను శంకర్ మహదేవన్ అకాడమీ స్థాపకుడు కూడా,ఇది ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు భారతీయ సంగీతంలో ఆన్లైన్ సంగీత పాఠాలను నిర్వహిస్తుంది.

శంకర్ మహదేవన్
Shankar Mahadevan performing with Shankar-Ehsaan-Loy Trio at Idea Rocks India concert in Bangalore. (April 6, 2013) (photo - Jim Ankan Deka)
బెంగుళూరులో ఐడియా రాక్స్ ఇండియా కచేరీలో శంకర్ మహదేవన్. (April 6, 2013)
వ్యక్తిగత సమాచారం
జననం (1967-03-03) 1967 మార్చి 3 (వయస్సు: 53  సంవత్సరాలు)
చెంబూర్, ముంబై[1]
రంగంభారతీయ సంగీతం, ప్లేబ్యాక్ గానం, స్వరకర్త
వృత్తిగాయకుడు, స్వరకర్త
వాయిద్యాలుగానం
క్రియాశీల కాలం1998–ప్రస్తుతం
సంబంధిత చర్యలుశంకర్-ఎహ్సాన్-లోయ్
వెబ్‌సైటుwww.shankarmahadevan.com
ముఖ్యమైన సాధనాలు
గానం, వీణ

ప్రారంభ జీవితంసవరించు

శంకర్ మహదేవన్ ముంబై శివారు ప్రాంతమైన చెంబూరులో పుట్టి, పెరిగారు.[2] ఇతను పాలక్కడ్, కేరళ నుండి వచ్చిన తమిళ అయ్యర్ కుటుంబానికి చెందినవాడు. ఇతను తన బాల్యంలోనే హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. ఐదు సంవత్సరాల వయసులో వీణ వాయించటం ప్రారంభించాడు. మరాఠీ సంగీత స్వరకర్తగా పేరు పొందిన పండిట్ శ్రీనివాస్ ఖలే మార్గదర్శకత్వంలో సంగీతాన్ని అభ్యసించాడు. ఇతను చెంబూర్ లో ఉన్న అవర్ లాడీ ఆఫ్ పెర్పెట్యుయల్ సక్కర్ ఉన్నత పాఠశాలలో (Our Lady of Perpetual Succour High School) చదివాడు.తరువాత ఇతను సియోన్ లో ఎస్ఐఇసి, కళాశాలలో చేరి తన ఎచ్ఎ.స్.సి. పూర్తి చేసాడు.ఇతను1988 లో న్యూ ముంబైలో ముంబై విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉన్న రాంరావ్ ఆదిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడయ్యాడు. ఒరాకిల్కు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేశాడు.

వృత్తి జీవితంసవరించు

కొంతకాలం పనిచేసిన తర్వాత శంకర్ సంగీత రంగంలోకి అడుగు పెట్టాడు.[2] అతను నేపధ్యగాయకునిగా ఒక తమిళ చిత్రంలో మొదటి అవార్డు సాధించాడు. కన్డుకొండైన్ కన్డుకొండైన్ లో ఎఆర్. రెహమాన్ తో కలిసి అతని పాట కోసం పనిచేశాడు.జాతీయ చలన చిత్ర అవార్డు పొందాడు. గెలుచుకున్నాడు.1998లో తన మొదటి సంగీత అల్బం బ్రీత్లెస్ విడుదలతో కడమ్‌బక్కం చిత్ర పరిశ్రమలో అతను ప్రముఖ స్టార్‌గా మరింత గుర్తింపు పొందాడు.అల్బమ్ టైటిల్ ట్రాక్ ఏ విరామం లేకుండా పాడుకునే పద్ధతిలో తయారు చేశాడు, కాబట్టి అది ఒక శ్వాసలో పాడినట్లుగా కనిపిస్తుంది. అందువలన దీనికి బ్రీత్లెస్ టైటిల్ సరిపోయింది. అతను తరువాత సంగీత దర్శకత్వంలోకి వచ్చాడు, శంకర్-ఎహ్సాన్-లోయ్ త్రయం, ఒక భాగంగా మారి హిందీ చిత్రాలకు సంగీతం సమకూర్చాడు.

మూలాలుసవరించు

  1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; ti అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 http://www.hinduonnet.com/thehindu/mp/2003/11/06/stories/2003110600310400.htm

వెలుపలి లంకెలుసవరించు