2012 నంది పురస్కారాలు


2012 సంవత్సరానికి గాను నంది పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 2017, మార్చి 1వ తేదీన ప్రకటించబడ్డాయి.[1] ఈగ ఉత్తమ చిత్రంగా బంగారునంది గెలుచుకోగా, మిణుగురులు వెండినంది గెలుచుకుంది.[2] ఈగ సినిమాకు ఎస్. ఎస్. రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా, ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాలో నటనకు నాని ఉత్తమ నటుడిగా, సమంత ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.[3]

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, కోడి రామకృష్ణకి రఘుపతి వెంకయ్య అవార్డు, దగ్గుబాటి సురేష్‌బాబుకి నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ పురస్కారం, సింగీతం శ్రీనివాసరావుకి బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డులు వచ్చాయి.[4] 2012 సంవత్సరానికి నటి జయసుధ అవార్డు కమిటీలకు అధ్యక్షులుగా వ్యవహరించింది.[5]

జాబితా

మార్చు

2012 నంది పురస్కారాలు అందుకున్న వారి వివరాలు[6][7]

విభాగం గ్రహీత సినిమా పేరు నంది రకం
ఉత్తమ చిత్రం సాయి కొర్రపాటి ఈగ బంగారం
ద్వితీయ ఉత్తమ చిత్రం కృష్ణంశెట్టి అయోధ్య కుమార్ మిణుగురులు వెండి
తృతీయ ఉత్తమ చిత్రం ఆనంద్ ముయిద రావు మిథునం కాంస్యం
ఉత్తమ కుటుంబ కథా చిత్రం సుధాకర్ రెడ్డి, విక్రం గౌడ్ ఇష్క్ వెండి
అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం రాధాకృష్ణ జులాయి బంగారం
ఉత్తమ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి ఈగ వెండి
ఉత్తమ నటుడు నాని ఎటో వెళ్ళిపోయింది మనసు వెండి
ఉత్తమ నటి సమంత ఎటో వెళ్ళిపోయింది మనసు వెండి
ఉత్తమ ప్రతినాయకుడు సుదీప్ ఈగ తామ్ర
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు కృష్ణంశెట్టి అయోధ్య కుమార్ మిణుగురులు తామ్ర
ఉత్తమ సహాయ నటుడు అజయ్ ఇష్క్ తామ్ర
ఉత్తమ సహాయ నటి శ్యామల దేవి వీరంగం తామ్ర
ఉత్తమ పాత్రోచిత నటుడు ఆశిష్ విద్యార్థి మిణుగురులు తామ్ర
ఉత్తమ హాస్యనటుడు రఘుబాబు ఓనమాలు తామ్ర
ఉత్తమ సంగీత దర్శకుడు ఇళయరాజా, ఎం. ఎం. కీరవాణి ఎటో వెళ్ళిపోయింది మనసు, ఈగ తామ్ర
ఉత్తమ ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ ఈగ తామ్ర
ఉత్తమ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈగ తామ్ర
ఉత్తమ కళా దర్శకుడు ఎస్. రామకృష్ణ అందాల రాక్షసి తామ్ర
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత ఎస్. ఎస్. రాజమౌళి ఈగ తామ్ర
ఉత్తమ కథా రచయిత కృష్ణంశెట్టి అయోధ్య కుమార్ మిణుగురులు తామ్ర
ఉత్తమ మాటల రచయిత తనికెళ్ళ భరణి మిథునం తామ్ర
ఉత్తమ పాటల రచయిత అనంత శ్రీరామ్ కోటి కోటి తారల్లోనా, ఎటో వెళ్ళిపోయింది మనసు తామ్ర
ఉత్తమ సందేశాత్మక చిత్రం చెరుగుమల్లి సింగారావు సిరి బంగారం
ఉత్తమ గాయకుడు శంకర్ మహదేవన్ ఒక్కడే దేవుడు, (శిరిడి సాయి) తామ్ర
ఉత్తమ గాయని గీతా మాధురి ఎదలో నదిలాగా (గుడ్ మార్నింగ్) తామ్ర
ఉత్తమ బాల నటుడు దీపక్ సరోజ్ మిణుగురులు తామ్ర
ఉత్తమ బాల నటి రుషిణి మిణుగురులు తామ్ర
ఉత్తమ కొరియోగ్రాఫర్ జానీ మీ ఇంటికి ముందో గేటు (జులాయి) తామ్ర
ఉత్తమ ఆడియోగ్రాఫర్ కడియాల దేవికృష్ణ ఈగ తామ్ర
ఉత్తమ వస్త్రాలంకరణ తిరుమల కృష్ణం వందే జగద్గురుం తామ్ర
ఉత్తమ మేకప్ చిట్టూరి శ్రీనివాస్ కృష్ణం వందే జగద్గురుం తామ్ర
ఉత్తమ ఫైట్ మాస్టర్ గణేష్ ఒక్కడినే తామ్ర
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ ముక్తా విఎఫెక్స్ ఈగ తామ్ర
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టు (మేల్) ఆర్.సి.యం. రాజు మిణుగురులు తామ్ర
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టు (ఫిమేల్) శిల్ప వీరంగం తామ్ర
ఉత్తమ సినీ పుస్తకం ప్రస్థానం పొన్నం రవిచంద్ర తామ్ర
ఉత్తమ సినీ విమర్శకుడు మామిడి హరికృష్ణ తామ్ర
ప్రత్యేక బహుమతి లక్ష్మి మిథునం తామ్ర
ప్రత్యేక బహుమతి ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మిథునం తామ్ర
ప్రత్యేక బహుమతి ఎటో వెళ్ళిపోయింది మనసు తామ్ర

మూలాలు

మార్చు
  1. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 29 June 2020.
  2. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
  3. సాక్షి, సినిమాలు (2 March 2017). "పండిన మిర్చి". Archived from the original on 2017-03-01. Retrieved 29 June 2020.
  4. Correspondent, Special. "S.P. Balasubrahmanyam, Hema Malini bag NTR awards".
  5. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
  6. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
  7. APFDC, Nandi Film Awards. "Nandi Film Awards G.O and Results 2012". www.apsftvtdc.in. Archived from the original on 30 జూన్ 2020. Retrieved 30 జూన్ 2020.