శకుంతల ఎక్స్ ప్రెస్

మహారాష్ట్రలో అమరావతి జుల్లాలోని, యావత్మార్ - ముర్తాజాపూర్ - అచల్ పూర్ పట్టణాలను కలిపే నారోగేజ్ రైలు మార్గంలో 190 కిలో మీటర్ల దూరం తిరిగే పాసింజరు రైలు పేరు శకుంతల ఎక్స్ ప్రెస్స్. 'బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే కంపెనీ' (సి.పి.ఆర్.సి.) కి శకుంతల రైల్వేస్ అని పేరు. భారత దేశంలో పాసింజరు రైళ్లలో అతి పొడవైన ప్రవేటు రైలు మార్గం కూడా ఇదే. ఆనాడు విదర్బ ప్రాంతపు యువరాణి శకుంతల పేరు మీద ఈ సంస్థకు శకుంతల రైల్వేస్ అని పేరు వచ్చింది.

ప్రారంబం మార్చు

మహారాష్ట్ర లోని విదర్బ ప్రాంతంలో ప్రత్తి ఎక్కువగా పండేది ఆ రోజుల్లో. ఆ ప్రత్తిని నాగపూర్ కు, అక్కడనుండి ముంబై అటునుండి సముద్ర మార్గాన ఇంగ్లండ్కు చేరవేసే వారు. ప్రత్తి ఎగుమతికి, ప్రత్తి రైతుల రవాణా సౌకర్యం కొరకు బ్రిటీష్ వారు 1910 వ సంవత్సరంలో సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే కంపెనీ (సి.పి.ఆర్.సి.) ని ఏర్పాటు చేశారు. ఆనాడు బ్రిటిష్ వారి ఆధీనంలోని 'గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేస్ ' (జి.ఐ.పి.ఆర్.) అనే రైల్వే కంపెనీ 'శకుంతల రైల్వేస్ ' లోని కొన్ని రైలు మార్గాలను అద్దె ప్రాతిపధికన వాడుకునే వారు. స్వాతంత్ర్యానంతరం జి.ఐ.పి.ఆర్ కంపెనీ సెంట్రల్ రైల్వేగా మారి పోయింది. కానీ సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే కంపెనీని విలీన ప్రక్రియలో మర్చి పోయారు. స్థానికంగా దాని పేరే 'శకుంతల రైల్వేస్ '

స్వాతంత్రానంతరం మార్చు

1951 వ సంవత్సరంలో భారత్ లోని రైల్వేలు అన్ని జాతీయం అయినపుడు 'సెంట్రల్ రైల్వేస్ ' ఇండియన్ రైల్వేస్ లో అంతర్భాగమైంది. కాని 'సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే కంపెనీ (సి.పి.ఆర్.సి.) ' అనే పేరుతో వున్న 'శకుంతల రైల్వేస్ ' మాత్రం భారత రైల్వేలో అంతర్భాగం కాలేదు. కానీ సెంట్రల్ రైల్వేస్ కు శకుంతల రైల్వేస్ మార్గాలలో ప్యాసింజర్ రైళ్లు నడిపే ఒప్పందం మాత్రం వుండేది. లభాలలో 55 శాతం శకుంతల రైల్వేస్ కు ఇవ్వాలి. ప్రతి పది సంవత్సరాలకు ఈ ఒప్పందాన్ని సమీక్షించి అవసరమైతే మరో పది సంవత్సరాలు పొడిగించేవారు. అదే విధంగా ఈ ఒప్పందం ఈనాటికి పొడిగించ బడి అమలులో ఉంది. భారత రైల్వే వారు రెండు ప్యాసింజరు రైళ్లను, ఒక గూడ్సు రైలును శకుంతల రైల్వే వారి మార్గాలలో నడుపుతున్నది. దానికి బదులుగా భారత రైల్వే ... శకుంతల రైల్వేకి ఏడాదికి రెండు కోట్ల రూపాయలను ఇవ్వాల్సి వుంటుంది. రైల్వే మార్గాల నిర్వహణకు, మరమ్మత్తులకు అయ్యే ఖర్చు పది వేల రూపాయలకు మించితే శకుంతుల రైల్వే వారే భరించాల్సి వుంటుంది. కాని రైలు మార్గాల నిర్వహణ, మరమ్మత్తులకు శకుంతల రైల్వేస్ ముందుకు రాక పోవడంతో భారత రైల్వే వారే ఆ పని కానిస్తున్నారు.

రైలు మార్గం ప్రస్తుత పరిస్తితి మార్చు

మొత్తం 190 కిలో మీటర్ల పొడవు వున్న శకుంతల రైల్వే మార్గంలో 17 స్టేషన్లు, 12 వంతెనలు ఉన్నాయి. ఆ మార్గంలో వున్న సిగ్నల్ వ్వవస్త వంటి పరికరాలన్నీ బ్రిటిష్ కాలం నాటివే. ప్రస్తుతం రైలు మార్గము సరిగా లేక పోవడముతో రైళ్లు సగటు వేగం గంటకు 20 కిలోమీటర్లు మాత్రమే. వంతెనల మీద నడిచేటప్పుడు ఆ వేగం కేవలము 5 కిలోమీటర్లు మాత్రమే. ప్యాసింజెరు రైలు గార్డులే అదనంగా టికెట్టు కలెక్టరు బాధ్యతలు కూడా నెరవేరుస్తారు. రైల్వే క్రాస్ వద్ద కాపలాదారులుండరు. ఆ విధులు నిర్వర్తించడానికి ఒక ఉద్యోగి ఆ రైలు లోనే ప్రయాణిస్తూ రైల్వే క్రాసింగుకు కొంచెం ముందుగానే రైలు దిగి గేటు వేసి రైలు క్రాసింగు దాటగానే గేటు తెరిచి తిరిగి ఆ రైలు ఎక్కి వెళుతాడు.

ఈ రైల్వే మార్గం ఏమంతే లాభదాయకం కాక పోవడముతో గతంలో దీని మూసి వేయాలని అనేక సార్లు ప్రయత్నించారు. కానీ స్థానికుల ఆందోళన కారణంగా రాజకీయ ఒత్తిడులకు తలొగ్గి ఆ ప్రయత్నం విరమించు కున్నారు. ఈ మార్గంలో స్థానికులకు ప్రయాణానికి, సరకుల రవాణాకు ఇదొక్కటే ఏకైక మార్గము. ఈ మార్గములో రోజు వెయ్యి మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఇప్పుడు నడుస్తున్న రెండు రైళ్లను స్థానికులు శకుంతల ఎక్స్ ప్రెస్స్ గానే వ్వవహరిస్తుంటారు.

వంద సంవత్సరాల క్రితం 'సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే కంపెనీ (సి.పి.ఆర్.సి.) ' గా బ్రిటిష్ వారిచే ప్రారంబించ బడిన ఈ రైల్వేలో అప్పట్లో అందరూ బ్రిటిష్ వారే పెట్టుబడి దారులుగా వుండే వారు. కాని కాలానుగుణంగా ఈ నాడు ఈ రైల్వే సంస్థలో భారతీయులే ఎక్కువగా వాటాదారులున్నారు. ఈ రైలు మార్గాన్ని భారత రైల్వే కొనుగోలు చేసి దాన్ని బ్రాడ్ గేజ్ గా మారిస్తే దక్షిణ భారత దేశానికి ఉత్తర భారత దేశానికి మద్య దూరము వంద కిలోమీటర్ల వరకు తగ్గగలదని ఊహిస్తున్నారు. అదే జరిగితే ఒక శతాబ్ద చరిత్ర కలిగిన 'శకుంతల రైల్వే ' అనే ప్రవేటు రైల్వే మార్గం శకం ముగిసినట్లే.

మూలాల జాబిత మార్చు

1.ఈనాడు 2016 నవంబరు 6.

2.http://www.netiap.com/featured/indian-biggest-privet-rail-line.html

3.https://www.google.co.in/search?q=EWIzQPIbBuASEoJj4Dw&ie=utf-8&oe=utf-8&client=firefox-b-ab&gfe_rd=cr&ei=gk-EWPHCB4bBuASEoJj4Dw#q=%E0%B0%B6%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A4%E0%B0%B2+%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D+%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D

4.https://www.youtube.com/watch?v=pbjtfGIrpGI (టి.వి.9 మరాటి) https://www.google.com/imgres?imgurl=http://im.rediff.com/money/2015/sep/14train.jpg&imgrefurl=http://www.rediff.com/money/report/column-the-little-known-story-about-shakuntala-railway/20150914.htm&h=540&w=614&tbnid=wWw4XPMbcT16FM:&q=shakuNtala+railways&tbnh=176&tbnw=200&usg=AI4_-kSD_bg5kfCrGuRpG1Xlr3TGkcHW2g&vet=12ahUKEwjCiKWg8cTeAhUck3AKHQmpBm0Q_B0wEXoECAYQBg..i&docid=gEhDf0qVl1kf-M&itg=1&client=firefox-b-ab&sa=X&ved=2ahUKEwjCiKWg8cTeAhUck3AKHQmpBm0Q_B0wEXoECAYQBg 5.https://www.google.co.in/search?q=shakuntala+express&client=firefox-b-ab&biw=1025&bih=493&tbm=isch&tbo=u&source=univ&sa=X&ved=0ahUKEwiYtci3jtXRAhVLObwKHX0mBvsQ7AkIJg

6.https://www.aanavandi.com/blog/indian-railway/little-known-story-shakuntala-railways-indias-privately-owned-railway

7.http://www.india.com/travel/articles/shakuntala-railways-you-wont-believe-why-indian-railways-pays-a-british-company-to-run-a-train-in-india/

8.http://www.thelallantop.com/bherant/all-you-need-to-know-about-british-company-owned-shakuntala-express/

9.http://www.thelallantop.com/bherant/all-you-need-to-know-about-british-company-owned-shakuntala-express/

10.https://en.wikipedia.org/wiki/Shakuntala_Railway