మధ్య రైల్వే
సెంట్రల్ రైల్వే భారతీయ రైల్వేలు లోని 17 మండలాల్లో అతిపెద్ద వాటిల్లో ఒకటి . దీని ప్రధాన కార్యాలయం ముంబై వద్ద ఛత్రపతి శివాజీ టెర్మినస్ (గతంలోని విక్టోరియా టెర్మినస్) ఉంది. భారతదేశంలో ఇది మొట్టమొదటి ప్రయాణీకుల రైలు మార్గము (లైన్) గా కలిగిన, ఈ మార్గము 1853 ఏప్రిల్ 16 న బాంబే నుండి థానే వరకు ఆరంభించబడింది.
మధ్య రైల్వే Central Railway | |
---|---|
![]() 8-మధ్య రైల్వే | |
![]() మధ్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఛత్రపతి శివాజీ టెర్మినస్ | |
ఆపరేషన్ తేదీలు | 1951–ప్రస్తుతం |
మునుపటిది | [ గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే, సింధియా స్టేట్ రైల్వే, ధోల్పూర్ రైల్వే, నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే , వార్ధా కోల్ స్టేట్ రైల్వే , ఇతరములు. |
ట్రాక్ గేజ్ | మిశ్రమము |
ప్రధానకార్యాలయం | ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై |
మధ్య రైల్వే మహారాష్ట్ర రాష్ట్రంలో ఒక పెద్ద భాగాన్ని, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో చిన్న భాగం, కర్ణాటక రాష్ట్రంలో కొంత ఈశాన్య ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. ఈ రైల్వే జోన్ 1951, నవంబరు 5 న గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేతో సహా, గ్వాలియర్ మాజీ రాచరిక రాష్ట్రం యొక్క సింధియా స్టేట్ రైల్వే, నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే, వార్ధా కోల్ స్టేట్ రైల్వే, ధోల్పూర్ రైల్వేలు వంటి అనేక ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వేలను ఒక చోట చేర్చడము ద్వారా ఏర్పడింది.[1][2] మధ్య రైల్వే జోన్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని ఎక్కువ భాగాలు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని దక్షిణ భాగం ప్రాంతం లతో ఏర్పడటము వలన భౌగోళికంగా, ట్రాక్ పొడవు, సిబ్బంది పరంగా భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోనుగా అవతరించింది. ఈ ప్రాంతాలు తదుపరి ఏప్రిల్, 2003 సం.లో కొత్త పశ్చిమ మధ్య రైల్వే జోనుగా ఏర్పాటు అయ్యింది.

మధ్య రైల్వే ప్రధాన మార్గాలు
- సెంట్రల్ రైల్వే ప్రధాన / పొడవైన మార్గములు
- ముంబై సిఎస్‌టి - దాదర్ - కుర్లా - థానే - దివా - కళ్యాణ్ - కాసర- మన్మాడ్ - జలగావ్ - భూసావల్ - అకోలా - వార్ధా - నాగ్పూర్
- ముంబై సిఎస్‌టి - దాదర్ - కుర్లా - థానే - దివా - కళ్యాణ్ - నేరల్ -కర్జత్ - లోనావాలా - పూనే
- పూనే - దావండ్ - షోలాపూర్ - వాడి - తాండూరు
- పూనే - సతారా - సాంగ్లీ - మిరాజ్ - కొల్హాపూర్
- మిరాజ్ - పండరపుర - కుర్దువాడి - ఉస్మానాబాద్ - లాతూర్ - లాతూర్ రోడ్
- బల్లార్షా- సేవాగ్రామ్ (గతంలో వార్ధా ఈస్ట్ జంక్షన్.) - నాగ్పూర్ - ఆమ్లా - ఇటార్సి
- సెంట్రల్ రైల్వే షార్టర్ / బ్రాంచ్ మార్గాలు
- ముంబై సిఎస్‌టి-వాదల-కింగ్ సర్కిల్
- ముంబై సిఎస్‌టి-వాదల-కుర్లా-వాషి-పాన్వెల్
- థానే-వాషి
- దావండ్-మన్మాడ్
- భూసావల్ -ఖాండ్వా
- అమరావతి - నర్ఖేర్
- దివా-పాన్వెల్-రోహా
- పన్వేల్-కర్జత్
- ఖోపోలి-కర్జత్
- దివా - భివాండీ రోడ్-వాషి రోడ్
- బద్నెర-అమరావతి
- దావండ్-బారామతి
- పుంతంబా-షిర్డీ
- చాలిస్గాంవ్-ధూలే
- పచోర-జామ్నార్ (ఎన్‌జి)
- పూల్గాంవ్-Arvi (ఎన్‌జి)
- మూర్తిజాపూర్-యావత్మల్ (ఎన్‌జి)
- మూర్తిజాపూర్-అచల్పూర్ (ఎన్‌జి)
- జాలాంబ్-ఖాంగాంవ్
బి.బి. , సి.ఐ. రైల్వే ప్రధాన కార్యాలయాలు
నవంబరు, 1906 సం.లో ఇది పాక్షికంగా మంటలలో నాశనం కాగా, ఆ రాత్రి వేల్స్ యొక్క యువరాజు బొంబాయి వదిలి వేయడము జరిగింది.
మధ్య రైల్వే డివిజన్లు
ఈ జోను ఐదు విభాగాలు (డివిజన్లు)గా విభజించారు.
నెట్వర్క్ డివిజన్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.[3] ముంబైలో రెండు ప్రధాన రైల్వే డివిజన్లు ఉన్నాయి:ముంబై సిఎస్‌ఎంటి ప్రధాన కార్యాలయం కలిగిన ముంబై మధ్య (సెంట్రల్ రైల్వే), ముంబై సెంట్రల్ ప్రధాన కార్యాలయం కలిగిన ముంబై పశ్చిమ (వెస్ట్రన్ రైల్వే).
ముంబై రైల్వే డివిజను
ఇక్కడ మరింత వివరణాత్మక విచ్ఛిన్నం ఉంది: 1. ముంబై మధ్య(సెంట్రల్ రైల్వే) డివిజను: ప్రధాన కార్యాలయం: ముంబై సిఎస్‌ఎంటి (ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్). జోన్: సెంట్రల్ రైల్వే (మధ్య రైల్వే ). మధ్య రైల్వే కింద ఉన్న ఇతర విభాగాలు: భూసావల్, నాగపూర్, పూణే, షోలాపూర్. చారిత్రక ప్రాముఖ్యత:మధ్య రైల్వే భారతదేశంలో మొట్టమొదటి ప్రయాణీకుల రైల్వే మార్గాన్ని నడుపుతోంది, ఇది ఏప్రిల్ 16, 1853 సం.న ముంబై నుండి థానే వరకు ప్రారంభించబడింది.
2. ముంబై పశ్చిమ (పశ్చిమ రైల్వే) డివిజను: ప్రధాన కార్యాలయం: ముంబై సెంట్రల్. జోన్: వెస్ట్రన్ రైల్వే (పశ్చిమ రైల్వే). పశ్చిమ రైల్వే పరిధిలోని ఇతర విభాగాలు: వడోదర, అహ్మదాబాద్, భావ్‌నగర్, రాజ్‌కోట్, రత్లాం. అత్యంత రద్దీగా ఉండే జంక్షన్: వడోదర రైల్వే స్టేషను పశ్చిమ రైల్వేలలో అత్యంత రద్దీగా ఉండే జంక్షన్ పాయింట్, ఇది అహ్మదాబాద్-ముంబై, ముంబై-రత్లం మార్గాలకు సేవలు అందిస్తుంది. అత్యంత రద్దీగా ఉండే నాన్-జంక్షన్ స్టేషన్: సూరత్ రైల్వే స్టేషను పశ్చిమ రైల్వేలోని నాన్-జంక్షన్ విభాగంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి.
స్టేషన్లు
సెంట్రల్ రైల్వే జోన్‌లో భాగమైన ముంబై రైల్వే డివిజన్‌లో హార్బర్, ట్రాన్స్-హార్బర్, సెంట్రల్ లైన్లలోని స్టేషన్లు ఉన్నాయి. అనేక ఇతర స్టేషన్లతో పాటు, వీటిలో సిఎస్‌ఎంటి, దాదర్, కుర్లా, థానే, కళ్యాణ్, పన్వెల్, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలోని స్టేషన్లు, ప్రధానంగా ఉన్నాయి.
సెంట్రల్ స్టేషన్లు
భారతదేశంలో మొత్తం 5 సెంట్రల్ స్టేషన్లు ఉన్నాయి. అవి, త్రివేండ్రం సెంట్రల్, కాన్పూర్ సెంట్రల్, మంగుళూరు సెంట్రల్, ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్.
పెద్ద రైల్వే స్టేషను
భారతదేశంలో మూడవ అతిపెద్ద రైల్వే స్టేషను: ఛత్రపతి శివాజీ టెర్మినస్. ఛత్రపతి శివాజీ టెర్మినస్ భారతదేశంలోని మూడవ అతిపెద్ద రైల్వే స్టేషను అలాగే భారతదేశంలోని ముంబైలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా ఉంది. ఈ టెర్మినల్‌ను మొదట విక్టోరియా టెర్మినస్ అని పిలిచేవారు, తరువాత మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ పేరు మీద దీనిని మార్చారు.
మార్గములు
ముంబై డివిజను
- ముంబై సిఎస్‌ఎంటి-దాదర్-కుర్లా-థానే, ముంబై సిఎస్‌ఎంటి-వడాలా రోడ్-కుర్లా (హార్బర్ లైన్), వడాలా రోడ్-బాంద్రా-గోరేగావ్ (కలిసి).
- థానే-దివా జంక్షన్-కల్యాణ్, దివా జంక్షన్-పన్వెల్-రోహా, పన్వెల్-జసాయి-ఉరాన్.
- కళ్యాణ్ జంక్షన్-కాసర-ఇగత్‌పురి (కలిసి).
- కళ్యాణ్ జంక్షన్-కర్జత్ జంక్షన్-లోనావాలా (కలిపి), నెరల్ జెఎన్-మాథెరన్ (ఇరుకైన-గేజ్), కర్జత్ జంక్షన్-పన్వెల్.
హార్బర్ లైన్
- సిఎస్‌ఎంటి(ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్) - దాదర్ - కుర్లా
- వాడాలా రోడ్ - కుర్లా
- కుర్లా - వాషి - నెరుల్ - పన్వేల్
- ట్రోంబే : (వస్తువులు)
ట్రాన్స్-హార్బర్ లైన్
- థానే - వాషి - పన్వేల్, థానే - తుర్భే - వాషి, థానే - తుర్భే - నెరుల్.
పేరు మార్చబడిన ముంబై స్టేషన్లు
ఏడు స్టేషన్ల పేరు మార్పు ఈ క్రింది విధంగా ఉంది:
- కర్రీ రోడ్ స్టేషన్‌ను లాల్‌బాగ్‌గా, శాండ్‌హర్స్ట్ రోడ్‌ను డోంగ్రీగా, మెరైన్ లైన్స్‌ను ముంబాదేవిగా, చార్ని రోడ్‌ను గిర్గావ్‌గా, కాటన్ గ్రీన్‌ను కలచౌకీగా, డాక్‌యార్డ్ రోడ్‌ను మజ్‌గావ్‌గా, కింగ్స్ సర్కిల్‌ను తీర్థంకర్ పార్శ్వనాథ్‌గా మార్చారు. నివేదికల ప్రకారం, శాండ్‌హర్స్ట్ రోడ్ పేరు మార్పు ముంబైలోని సెంట్రల్ లైన్ హార్బర్ లైన్ రెండింటిలోనూ అమలులోకి వచ్చేస్తుంది.[4]
- ఇంతకుముందు ముంబైలో, విక్టోరియా టెర్మినస్ (VT) వంటి ఐకానిక్ స్టేషన్‌ను ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT)గా అలాగే ఎల్ఫిన్‌స్టోన్ రోడ్‌ను ప్రభాదేవిగా మార్చారు.
కొన్ని ముఖ్యమైన రైళ్ళు
ఇవి కూడా చూడండి
- హార్బర్ లైన్
- ముంబై సబర్బన్ రైల్వే
- ప్రాజెక్టు యూని గేజ్
- సెంట్రల్ రైల్వే రైళ్లు
- నాగపూర్ - ఆమ్లా ప్యాసింజర్
మూలాలు
- ↑ Rao, M.A. (1988). Indian Railways, New Delhi: National Book Trust, p.42
- ↑ "Welcome to Central Railways – Construction > Projects". Archived from the original on 2008-05-01. Retrieved 2015-03-01.
- ↑ "cnt-rly". Archived from the original on 2008-05-09. Retrieved 2015-03-01.
- ↑ https://www.clubmahindra.com/blog/travel-news/mumbais-seven-local-train-stations-to-be-renamed-check-out-details#:~:text=The%20renaming%20of%20the%20seven,as%20Mazgaon%2C%20King's%20Circle%20will