స్నిగ్ధ ఒక తెలుగు సినీ నటి. ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. 2011 లో నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చింది.

స్నిగ్ధ
జననం
రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
తల్లిదండ్రులుజగదీష్ (తండ్రి)
రాజేశ్వరి (తల్లి)[1]

ప్రారంభ జీవితం

మార్చు

స్నిగ్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి నగరంలో జగదీష్ రాజేశ్వరి దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి జగదీష్ డాక్టర్, తల్లి గృహిణి.[1] ఆమె ఏలూరు లోని సి.ఆర్ రెడ్డి కళాశాలలో ఎం.బి.ఎ చదువుతున్నప్పుడు బంగారు పతకం సాధించింది.[2] ఆమె సినిమాలలోనికి రాకముందు ఆమె హైదరాబాదులోని లాజికల్ బైట్స్ లో హెచ్.ఆర్ మేనేజరుగా పనిచేసింది.[3]

కెరీర్

మార్చు

ఆమె సినిమా రంగ ప్రవేశం నందినిరెడ్డి దర్శకత్వంలో మొదలైన అలా మొదలైంది. ఆమె ఈచిత్రంలో పింకీ పాత్రలో ముఖ్యతారాగణమైన నాని, నిత్యా మీనన్ లకు స్నేహితురాలిగా నటించింది. ఆమె మేం వయసుకు వచ్చాం, రొటీన్ లవ్ స్టోరీ, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, దమ్ము చిత్రాలలో కూడా నటించింది.[4] ఆమె నటనతో పాటు లఘు చిత్రాలలో సంగీత స్వరకల్పన చేస్తున్నారు.[5] ఆమె సంగీతకారిణి కూడా. [6] [7]2015వ నంవత్సరంలో నటించిన జత కలిసే చిత్రంలో ఉత్తమ హాస్యనటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారంతో సన్మానించింది.

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2011 అలా మొదలైంది పింకీ తెలుగు
2012 మేం వయసుకు వచ్చాం ఎస్సెమ్మెస్ శ్యామల తెలుగు
2012 రొటీన్ లవ్ స్టోరీ సంజు
2012 దమ్ము తెలుగు
2013 ఒక్కడినే సుజాత తెలుగు
2015 టైగర్ గంగ స్నేహితురాలు తెలుగు
2015 జత కలిసే తెలుగు ఉత్తమ హాస్యనటి.

నంది పురస్కారం

2016 గుంటూర్ టాకీస్ తెలుగు
2016 కల్యాణ వైభోగమే
2017 కిట్టు ఉన్నాడు జాగ్రత్త తెలుగు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Focus Light: Snigdha - Telugu cinema news". idlebrain.com.
  2. "Focus Light: Snigdha - Telugu cinema news". idlebrain.com. Retrieved 2017-09-16.
  3. Namasthe Telangana (16 April 2022). "శివుడిలాంటి..వరుడు కావాలి!". Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
  4. "Kittu Unnadu Jagratha Review {2.5/5}: For the fans of Raj Tarun, the film might offer a few moments of weekend fun". The Times of India. Retrieved 2017-09-16.
  5. "Another Decent Number From Snigdha". Telugu Filmnagar. 2016-10-25. Archived from the original on 2017-08-29. Retrieved 2017-08-28.
  6. K, Manaswini. "Young Lady Singer & Comedian Snigdha Opens up About facial Hair". www.mirchi9.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-09-16.
  7. "Review: Rushi is a meaningful film". Rediff. Retrieved 2017-09-16.

ఇతర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=స్నిగ్ధ&oldid=3509939" నుండి వెలికితీశారు