శరద్ జోషి
శరద్ జోషి (1931, మే 21 - 1991, సెప్టెంబరు 5) భారతీయ కవి, రచయిత. హిందీ సినిమాలు, టెలివిజన్‌లో సంభాషణలు, స్క్రిప్ట్ రచయితగా పనిచేశాడు. 1990లో ఇతనికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసింది.[1]
శరద్ జోషి | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | ఉజ్జయిని, మధ్యప్రదేశ్ | 1931 మే 21
మరణం | 1991 సెప్టెంబరు 5 ముంబై, మహారాష్ట్ర | (వయసు 60)
వృత్తి | కవి, రచయిత |
పురస్కారాలు | పద్మశ్రీ (1990) |
జీవిత భాగస్వామి | ఇర్ఫానా సిద్ధిఖీ |
సంతానం | బని, రిచా, నేహా శరద్ |
జననం, విద్య
మార్చుశరద్ జోషి 1931, మే 21న శ్రీనివాస్ - శాంతి జోషి దంపతులకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జన్మించాడు.
వ్యక్తిగత జీవితం
మార్చు1950వ దశకం చివరిలో, శరద్ జోషి ఇండోర్‌లో వార్తాపత్రికలు, రేడియో కోసం రాస్తున్న సమయంలో ఇర్ఫానా సిద్ధిఖీ (తరువాత ఇర్ఫానా శరద్)ని కలుసుకున్నాడు. ఇర్ఫానా సిద్ధిఖీ భోపాల్‌కి చెందిన రచయిత్రి, రేడియో ఆర్టిస్ట్, నాటకరంగంలో నటి. వీరికి ముగ్గురు కుమార్తెలు బని, రిచా, నేహా శరద్ ఉన్నారు. నేహా శరద్ నటి, కవయిత్రి.[2][3]
శరద్ జోషి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాలపై అథ శ్రీ గణేశాయ నమః, బిల్లియోన్ కా అర్థ శాస్త్రం, బుద్ధిజీవి, సాహిత్య కా మహాబలి, అధ్యక్ష మహోదయ[4] వంటి అనేక వ్యంగ్య వ్యాసాలు రాశాడు.
ఏక్ థా గధా ఉర్ఫ్ అలదద్ ఖాన్, ఆంధోన్ కా హాతీ వంటి వ్యంగ్య నాటకాలు కూడా రాశాడు.[5]
పరిక్రమ, కిసీ బహనే, తిలాస్మ్, జీప్ పార్ ది సవార్ ఇలియన్, రహా కినారే బైత్, మేరీ శ్రేష్ఠ్ రచనయే, దుస్రీ సతః, యథా సంభవ్, యాత్ర తత్ర సర్వత్ర, యథా సమయ్, హాం భ్రష్టన్ కే భ్రాష్ట్ హమారే, ప్రతిదిన్ మొదలైన అతని పుస్తకాలు, వ్యాస సంకలనాలు వెలువరించాడు.[6]
సినిమా సంభాషణలు
మార్చు- క్షితిజ్ (1974)
- చోటీ సి బాత్ (1975)
- శ్యామ్ తేరే కిత్నే నామ్ (1977)
- సాంచ్ కో ఆంచ్ నహిన్ (1979)
- గోధూలి (1977)
- చోర్ని (1982)
- ఉత్సవ్ (1984)
- మేరా దామద్ (1990)
- దిల్ హై కి మంత నహిన్ (1991)
- ఉడాన్ (1997)
- షోలే(1986)
టీవీ సీరియల్స్
మార్చుమరణం
మార్చుశరద్ జోషి తన 60వ ఏట 1991 సెప్టెంబరు 5న మహారాష్ట్రలోని ముంబైలో మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 2023-07-11.
- ↑ "Satirist Sharad Joshi said we chose World Leader PM". www.patrika.com. Retrieved 2023-07-11.
- ↑ "Film Writers Association". fwa.co.in. Archived from the original on 2015-09-08. Retrieved 2023-07-11.
- ↑ Datta, Amaresh (1988-01-01). Encyclopaedia of Indian Literature: Devraj to Jyoti (in ఇంగ్లీష్). Sahitya Akademi. p. 1863. ISBN 9788126011940.
- ↑ "...And all for the sake of a donkey - DNA - English News & Features - Art & Culture - dnasyndication.com". dnasyndication.com. Retrieved 2023-07-11.
- ↑ "Sharad Joshi". Goodreads. Retrieved 2023-07-11.
- ↑ "India television". Indianteleevision.com. 30 August 2001. Retrieved 2023-07-11.
- ↑ भाषा. "Sharad Joshi : Literature | शरद जोशी : हिन्दी के अनूठे व्यंग्यकार". Web Dunia. Retrieved 2023-07-11.