శారదా పీఠం, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున గల సరస్వతీ దేవి శక్తిపీఠం వద్ద ఉండేది. శారదా పీఠ్ 5000 సంవత్సరాల పురాతన హిందువుల మందిరం దీనిని క్రీస్తుపూర్వం 237 లో మౌర్య మహారాజు అశోకుడు నిర్మించారు. కానీ కొంత మంది కుషాన్ సామ్రజ్యంలో నిర్మించారు అని ,మార్తాండ్ సూర్య దేవాలయంతో పాటు కాశ్మీరీ రాజు లలితాదిత్య (724 CE - 760 CE) చేత నిర్మించబడిందని అని చెపుతారు శ్రీనగర్ నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న శారద పీఠంలోని 18 మహాశక్తి పీఠాలలో ఒకటి నీలం నదిని భారతదేశంలో కిషన్‌గంగ అని పిలుస్తారు. అయితే, ప్రస్తుతం ఆలయ శిథిలాలు తప్ప మరేమీ లేవు. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకి చేరువలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులోని నీలం జిల్లాలో ఉంది. ఇక్కడ షీనా, కాశ్మీరీ భాషలు ఎక్కువగా మాట్లాడతారు. ఈ ఆలయం వల్లనే కాశ్మీరుని శారదాదేశంగా కూడా పిలుస్తారు.కాశ్మీరీ పండితులు చేయవలసిన తీర్థయాత్ర లలో మూడు పవిత్ర ప్రదేశాలలో మార్తాండ్ సూర్య దేవాలయం మరియు అమర్‌నాథ్ ఆలయంతో పాటు శారదా పీఠం ఒకటి .

శారదా పీఠం
శారదా పీఠం యొక్క శిథిలాలు
Lua error in మాడ్యూల్:Location_map at line 502: Unable to find the specified location map definition: "Module:Location map/data/Karakoram" does not exist.
భౌగోళికాంశాలు:34°47′35″N 74°11′19″E / 34.79306°N 74.18861°E / 34.79306; 74.18861Coordinates: 34°47′35″N 74°11′19″E / 34.79306°N 74.18861°E / 34.79306; 74.18861
స్థానము
దేశము:పాకిస్తాన్
ప్రదేశము:శారద, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు,
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:శారద (సరస్వతి)

ఇది ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యాకేంద్రంగా విరాజిల్లినది. ఇక్కడే ఆది శంకరుడు సర్వజ్ఞానపీఠాన్ని అధిష్టించాడు. రామానుజచార్య బ్రాహ్మణ సూత్రాలపై తన సమీక్షను ఇక్కడ రాశారు.ఒకప్పుడు సంస్కృత పండితులకు, కాశ్మీరీ పండితులకు; హిందూ, బౌద్ధ ధర్మాలకూ నిలయంగా ఉండేది.

ఇక్కడి శారదా దేవినే, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరైన సరస్వతీ దేవిగా కొలుస్తారు.హిందూ విశ్వాసాల ప్రకారం, సతీ దేవి యొక్క కుడి చేయి ఇక్కడ పడింది 1947 లో భారతదేశం మరియు పాకిస్తాన్ విడిపోయిన తరువాత, హిందూ భక్తులు ఆలయాన్ని సందర్శించడంలో ఇబ్బంది పడ్డారు. 2007 లో, ఈ ఆలయాన్ని కాశ్మీరీ పండితుడు మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చర్ రిలేషన్స్ యొక్క ప్రాంతీయ డైరెక్టర్ ప్రొఫెసర్ అయాజ్ రసూల్ నజ్కి సందర్శించారు. అప్పటి నుండి, భారతీయ భక్తులను సందర్శించడానికి అనుమతి కోసం డిమాండ్ మొదలైంది. కాశ్మీరీ పండిట్లను ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించడానికి ఏర్పాటు చేసిన శారదా బచావో కమిటీ భారత ప్రభుత్వంతో పాటు పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఒక లేఖ రాసింది. ముజఫరాబాద్ ద్వారా భక్తులను ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించాలని ఇది డిమాండ్ చేసింది.

ఇక్కడి శారదాదేవి లేదా సరస్వతీ దేవికి చెందిన స్తోత్రం

జ్ఞానప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ
మహావిద్యా మహామాయా భక్తిముక్తిప్రదాయినీ

చిత్రమాలికసవరించు

ప్రస్తుత స్థితిసవరించు

ప్రస్తుతం ఈ పీఠం, ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. కొంతమంది కాశ్మీరీ పండితులు ఆలయ సందర్శనకీ, మరమ్మత్తులకీ అనుమతినివ్వమని ఇటు భారతదేశానికీ, జమ్మూ ‍కాశ్మీరుకీ; అటు పాకిస్తాన్ కీ, ఆజాదు కాశ్మీరుకీ విజ్ఞప్తులు చేసుకుంటున్నారు.[1]

మూలాలుసవరించు

  1. "Discuss opening of Sharda Peeth in PaK during talks: APMCC". greaterkashmir. Srinagar, India. June 18 2011. Check date values in: |date= (help)[permanent dead link]

బయటి లంకెలుసవరించు

మూలాలుసవరించు