శావల్యాపురం
శావల్యాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా. శావల్యాపురం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. ఇది మండల కేంద్రం, సమీప పట్టణమైన వినుకొండ నుండి 9 కి. మీ. దూరంలోనూ ఉంది.
శావల్యాపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°06′09″N 79°48′55″E / 16.102524°N 79.815222°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | శావల్యాపురం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 3,208 |
- పురుషుల సంఖ్య |
|
- స్త్రీల సంఖ్య |
|
- గృహాల సంఖ్య | 439 |
పిన్ కోడ్ | 522646 |
ఎస్.టి.డి కోడ్ | 08646 |
సమీప గ్రామాలు
మార్చుగ్రామానికి ఉత్తరంగా పొట్లూరు, దక్షిణాన పిచికలపాలెం, తూర్పున శానంపూడి, పశ్చిమాన కనమర్లపూడి సరిహద్దు గ్రామాలుగా ఉన్నాయి.
గ్రామ పంచాయితీ
మార్చురెండు ఊళ్ళకు తొలి సర్పంచి:- చెరుకూరి కోటయ్య. మండల కేంద్రం శావల్యాపురం తొలుత కనమర్లపూడి పంచాయతీగా ఉన్నప్పుడు, 1964లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో, ఈయన సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.. 1982లో శావల్యాపురం విడిపోయి ప్రత్యేక పంచాయతీగా ఏర్పడినప్పుడు జరిగిన ఎన్నికలలో గూడా, ఇతనిని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మౌలిక వసతులు
మార్చుబ్యాంకులు
మార్చు- చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్.
- భారతీయ స్టేట్ బ్యాంక్.
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ గిరిజన పాఠశాల ఒకటి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు పాఠశాలలు మూడు ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, పాలీటెక్నిక్‌లు వినుకొండలోను, మేనేజిమెంటు కళాశాల కనమర్లపూడిలోను, ఇంజనీరింగ్ కళాశాల నరసరావుపేటలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులో ఉంది. దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కారుమంచిలోనూ ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలలు
మార్చు- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల
- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల
- ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల
- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
ప్రైవేటు పాఠశాలలు
మార్చు- శ్రీరామా పబ్లిక్ స్కూల్.
- శ్రీ నారాయణ పబ్లిక్ స్కూల్
- గీతమ్స్ బ్లూమ్స్ స్కూల్
- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- 2015, డిసెంబరు-2న నిర్వహించిన జాతీయ స్థాయి ఉపకారవేతనాలకు నిర్వహించిన అర్హత పోటీలలో, ఈ పాఠశాలకు చెందిన 28 మంది విద్యార్థులు అర్హత సాధించి, ఈ పాఠశాలను జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలిపినారు. ఈ పాఠశాల ఇప్పటికి 4 సార్లు ఈ అర్హత పోటీలలో జిల్లాలో ప్రథమ స్థానం పొందింది.
వైద్య సౌకర్యం
మార్చుప్రభుత్వ వైద్య సౌకర్యం
మార్చు- శావల్యాపురంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉన్నాయి. ఆసుపత్రిలో ఒక డాక్టర్, పారామెడికల్ సిబ్బంది వైద్యసేవలు అందిస్తున్నారు. ఆరోగ్య కేంద్రంలో రక్తపరీక్ష, శస్త్రచికిత్స చేసే సదుపాయాలు ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం వినుకొండలో ఉంది.
- గ్రామంలో ఒక ప్రభుత్వ పశు వైద్యశాల ఉంది. ఈ పశు వైద్యశాలలో ఒక డాక్టర్, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. వీరు శావల్యాపురం గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలలోని పశువులుకి వైద్యసేవలు అందిస్తున్నారు.
ప్రైవేటు వైద్య సౌకర్యం
మార్చుగ్రామంలో ముగ్గురు వైద్యులు ప్రైవేట్ వైద్యం చేస్తున్నారు. గ్రామంలో మూడు మందుల షాపులుతో పాటూ ఒక జనరిక్ ఔషధలా దుకాణం ఉంది. వీటితో పాటూ రెండు ప్రైవేట్ రక్తపరీక్ష కేంద్రాలు కూడా సేవలు అందిస్తున్నాయి.
తాగు నీరు
మార్చుగ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మార్చుగ్రామంలో మురుగునీరు వ్యవస్థ కొంతమేర బాగున్నప్పటికీ, కొన్ని ప్రధాన వీధులలో బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను ఊరి చివరన ప్రధాన రహదారి పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
మార్చుశావల్యాపురంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్ ఉంది. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామంలో ఉన్నాయి.
రోడ్డు రవాణా
మార్చురాష్ట్ర రాజధాని అమరావతి నుంచి రాయలసీమని కలిపే జాతీయ రహదారి, గుంటూరు నుంచి గుంతకల్లు వెళ్ళే రైల్వే మార్గం గ్రామం మధ్యలో నుంచి వెళ్తున్నాయి. అందుచేత గ్రామం నుంచి రాష్ట్రం లోని అన్ని ప్రధాన పట్టణంలకి, గ్రామాలకి రోడ్డు, రైలు రవాణా సౌకర్యం ఉంది. ఏల్చూరు నుంచి నల్లగొండ తండా వెళ్ళే రాష్ట్ర రహదారి కూడా గ్రామంలో నుంచి వెళ్తుంది. మండలం లోని అన్ని గ్రామాలతో మెరుగైన రవాణా వ్యవస్థ కలిగి ఉంది. గ్రామంలో బస్సు ప్రయాణికుల కోసం ఎపియస్‌ఆర్‌టిసి ప్రయాణికుల ప్రాంగణం ఉంది. గ్రామంలో తారు రోడ్లు, సిమెంట్, మట్టి రోడ్లు ఉన్నాయి.
ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ఆటో సౌకర్యం మొదలైనవి గ్రామంలో ఉన్నాయి. వ్యవసాయానికి, వ్యయసాయ ఉత్పత్తుల రవాణాకు ట్రాక్టర్లని ఉపయోగిస్తున్నారు. గ్రామం నుంచి ప్రతి 20 నిముషాలకి వినుకొండ, నరసరావుపేట పట్టణంలకి బస్సు సౌకర్యం ఉంది. ప్రతి 30 నిముషాలకి గుంటూరు, విజయవాడ పట్టణంలకి బస్సు సౌకర్యం ఉంది.
రైలు రవాణా
మార్చుగ్రామంలో రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్ ఉంది. గుంటూరు నుంచి గుంతకల్లు లేదా నంద్యాల వెళ్ళే మార్గంలో శావల్యాపురం స్టేషన్ లో దిగవచ్చును.
మార్కెటింగు
మార్చుగ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వ్యవసాయ పరపతి సంఘం గ్రామంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ యార్డు వినుకొండలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
మార్చుగ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలతో పాటూ, ఆశా కార్యకర్తలు ఉన్నారు. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రామంలో ప్రజలకు పఠనా విజ్ఞానానికి ప్రభుత్వ గ్రంథాలయం ఉంది. ఆటల మైదానం ఉంది. సినిమా హాలు సౌకర్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం అది మూతపడింది.
విద్యుత్తు
మార్చుగ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 10 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
నీటిపారుదల సౌకర్యాలు
మార్చుశావల్యాపురంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు:
- బావులు:
- బోరు బావులు:
వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
మార్చుగ్రామంలో 90% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ పరిధిలోని అద్దంకి బ్రాంచ్ కెనాల్ గ్రామ వ్యవసాయానికి ప్రధాన సాగునీటి వనరుగా నిలుస్తున్నది. అంతేకాకుండా గ్రామం గుండా ప్రవహిస్తున్న కొంకేరు వాగు, తలుపుల వాగు, మేజర్ కాల్వ, వ్యవసాయబావుల ద్వారా కూడా పొలాలు సాగు చేయబడుతున్నాయి.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- శ్రీ అద్దంకమ్మ దేవాలయం
- శ్రీ సీతా సమేత కోదండరామ దేవస్థానం
- శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం
- శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం
- పాత రామాలయం
- శ్రీ నిదానంపాటి అమ్మవారి దేవస్థానం
- శ్రీ అయితాత సమాధి
గ్రామంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఒకేసారి 4 దేవాలయాలతో పాటు గ్రామ నాభిశిల (బొడ్డురాయి) ప్రతిష్ఠాపన మహోత్సవాలు జరిగినాయి. అవి
- స్థానిక రైల్వే స్టేషన్ సమీపాన ఉన్న శ్రీ సీత సమేత కోదండరాముడి దేవాలయంలో శిఖర, కలశ, గణపతి, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, గరుత్మంతుడు నవగ్రహాప్రతిష్ఠాపన కార్యక్రమాలు, ఘనంగా నిర్వహించారు.
- గుంటూరు - కర్నూలు ప్రధాన రహదారి పక్కన ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో శిఖర, కలశ, శ్రీ ప్రసన్న రామలింగేశ్వరస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
- స్థానిక B.C కాలనీలోని రామాలయంలో శిఖర, కలశ, గణపతి, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, గరుత్మంతుడు విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
- స్థానిక S.T కాలనీలోని రామాలయంలో కలశ, గణపతి, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, గరుత్మంతుడు విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
- స్థానిక బ్యాంకుబజారులో ఉన్న బావి వద్ద గ్రామ నాభిశిల (బొడ్డురాయి) విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది.
- అనంతరం కుంభాభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టినారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని, స్వామివారికి తమ మొక్కులు తీర్చుకున్నారు. విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహంచారు.
- గ్రామంలో 2015, జూన్-7వ తేదీ ఆదివారం ఉదయం 8-43 గంటలకు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య రాజ్యలక్ష్మి, కుమారస్వామి, నవగ్రహాలు, లింగప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కుంభాభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టినారు. వివిధగ్రామాలకు చెందిన ప్రజలు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని, స్వామివారికి తమ మొక్కులు తీర్చుకున్నారు. విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహంచారు.
ప్రధాన పంటలు
మార్చు1967 లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు రాక పూర్వము గ్రామంలో ఆనాటి ప్రధాన పంటలు అన్ని పండించేవారు. ముఖ్యంగా మెట్ట పంటలైన జొన్నలు, సజ్జలు, కందులు, ప్రత్తి, ఆముదాలు తదితరాలు ప్రధానంగా పండేవి. నాగార్జున సాగర్ జలాలు రావడంతో వరి ప్రధాన పంటగా అవతరించింది. తదనంతరం గ్రామప్రజల ఆహార, జీవన పద్ధతులలో విప్లవాత్మక మార్పులోచ్చాయి అని చెప్పవచ్చు.
ప్రధాన వృత్తులు
మార్చుగ్రామంలో అన్ని రకాల వృత్తుల వాళ్ళు వున్నారు, అయినప్పటకి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. గ్రామంలో రైతులతో పాటు రైతు కూలీలు అధికం. వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరే కాకుండా కొంతమంది భవన నిర్మాణ కార్మికులుగా జీవిస్తున్నారు.