శిలాగుహ చిత్రకళ
శిలాగుహ చిత్రకళ (ఆంగ్లం: Cave Painting) పాతరాతియుగం (14,000 నుండి 40,000 ఏళ్ళ పూర్వం) లో శిలాగుహలపై వేయబడ్డ చిత్రలేఖనాలు, చెక్కబడ్డ నగిషీలు.[1]
చరిత్ర
మార్చుప్రదేశాలు
మార్చుస్పెయిన్ లోని ఆల్టామీరా లో ఇప్పటి వరకు ఉన్న శిలాగుహ చిత్రలేఖనాలలో అతి ప్రాచీనమైనవిగా గుర్తించబడ్డాయి. ఆ యుగానికి చెందిన మనుషులే (హోమో సాపియన్స్) వీటిని చిత్రీకరించబడిందని తేల్చబడింది. శిలాగుహ చిత్రలేఖనాలు ఎక్కువగా స్పెయిన్ ఫ్రాన్సు దేశాలలో కనబడిననూ, పోర్చుగల్, ఇంగ్లాండు, ఇటలీ, రొమేనియా, జర్మనీ, రష్యా, ఇండోనేషియా లలో కూడా వీటి దాఖలాలు కలవు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 చోట్ల శిలాగుహ చిత్రలేఖనాల ఉనికి ఉంది.[1]
ఉపయోగించబడిన వస్తువులు
మార్చుశిలాగుహ చిత్రలేఖనాలలో చాలా మటుకు ఎరుపు లేదా నలుపు రంగులలో చిత్రీకరించబడ్డవి. Iron Oxide లతో ఎరుపు రంగు, Manganese Dioxide, కర్ర బొగ్గు లతో నలుపు రంగును తయారు చేశారు. చదునుగా ఉండే శిలల పై చేతి వ్రేళ్ళను, కరకుగా ఉండే శిలల పై చెకుముకిరాయిని కుంచెగా ఉపయోగించారు. [1]
చిత్రీకరించబడిన అంశాలు
మార్చుప్రధానంగా మనుషుల బొమ్మలు వేయబడినను, అక్కడక్కడా కేవలం మనుషుల తలలు, లేదా కేవలం జనాంగాలు కూడా చిత్రీకరించబడినవి. ఫ్రెంచి పిరినీస్ లోని గార్గాస్ గుహలలో చేతి ముద్రలను అచ్చు వేశారు. అన్ని కాలాలలోను, జంతువుల చిత్రలేఖనాలు కూడా సింహ భాగాన్ని ఆక్రమించాయి. ఫ్రాన్స్ లోని Chauvet-Pont-d'Arc (షావె పాంట్ డార్క్) లో ఇప్పుడు అంతరించి పోయిన జాతుల సింహాలు, ఏనుగులు, ఎలుగు బంట్లు చిత్రీకరించబడ్డవి. Lascaux, Niaux గుహలలో గుర్రాలు, అడవి దున్నలు, జింకలు, మేకలు చిత్రీకరించబడ్డవి.[1] పక్షులు, చేపలు అక్కడక్కడా చిత్రీకరించబడ్డవి. రేఖాగణిత అంశాలు చాలామటుకు చిత్రీకరించబడ్డవి.
అర్థాలు
మార్చుశిలాగుహ చిత్రలేఖనం, సాధారణంగా సంకేతాలను , లేదా మతపరమైన అంశాలను తెలుపటానికి ఉపయోగించబడ్డదనే భావింపబడుతోంది. [1]
ప్రపంచ వ్యాప్తంగా శిలాగుహ చిత్రకళ
మార్చుఆసియా
మార్చుఆస్ట్రేలియా
మార్చుఆఫ్రికా
మార్చుఉత్తర అమెరికా
మార్చుఐరోపా
మార్చుఫ్రాన్స్
మార్చులసాక్స్
మార్చులసాక్స్ లో శిలాగుహ చిత్రలేఖనాలు 1940 లో కనుగొనబడ్డాయి.[2] ఖచ్చితంగా ఎప్పుడు ఈ చిత్రలేఖనాలు వేయబడ్డాయనేది చర్చైనీయాంశం. చిత్రీకరించబడ్డ జంతువులపైనే మరల మరల వేరే జంతువులను చిత్రీకరించటం, చిన్నగా చిత్రీకరించబడ్డ గుర్రాలు, పెద్దగా చిత్రీకరించబడ్ద ఎడ్లు, చిత్రీకరించబడిన విధానాలలో తేడాలు, ఒకే మారు అన్నీ చిత్రీకరించబడ్డాయా, వేర్వేరు సందర్భాలలోనా అనే ప్రశ్నలు, వీటన్నింటికీ దొరికే సమాధానాలు లసాక్స్ శిలాగుహ చిత్రకళ సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. [3]
-
వివిధ పరిమాణాలలో లసాక్స్ చిత్రలేఖనాలు
-
మనిషిని ఒక అడవి దున్న వధించిన దృశ్యం వలె ఉన్న ఒక చిత్రలేఖనం
-
ఒక గుర్రం
-
ఒక రాక్షస జింక
-
నీటిలో ఈదుతోన్న జింకలు
దక్షిణ అమెరికా
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Cave Art". britannica.com. Retrieved 21 January 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Windels 1949, p. 11.
- ↑ Windels 1949, p. 12.
రెఫరెన్స్
మార్చు- Windels, Fernand (1949). The Lascaux Cave Paintings. Faber and Faber.