శిల్పా చక్రపాణిరెడ్డి

సింగారెడ్డి గారి శిల్పా చక్రపాణిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

శిల్పా చక్రపాణిరెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - 2024
నియోజకవర్గం శ్రీశైలం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 01 జూలై 1954
కొండ సుంకేసుల , వైఎస్‌ఆర్ జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు చెన్నారెడ్డి , వెంకట లక్ష్మమ్మ
జీవిత భాగస్వామి భాగ్యలక్ష్మి,
సంతానం కార్తీక్‌రెడ్డి, శ్వేత
నివాసం శ్రీశైలం

జననం, విద్యాభాస్యం

మార్చు

శిల్పా చక్రపాణిరెడ్డి 01 జూలై 1954లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వైఎస్‌ఆర్ జిల్లా , కొండ సుంకేసుల గ్రామంలో చెన్నారెడ్డి , వెంకట లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన బీఏ వరకు చదువుకున్నాడు.[1]

రాజకీయ జీవితం

మార్చు

శిల్పా చక్రపాణిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2004, 2009లో నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన సోదరుడు శిల్పా మోహన్‌ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఆయన 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. శిల్పా చక్రపాణిరెడ్డి 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీని విడి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేశాడు.

శిల్పా చక్రపాణిరెడ్డి 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి పై 38,698 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు.[2]

మూలాలు

మార్చు
  1. Sakshi (18 March 2019). "కర్నూలు జిల్లా... అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  2. Sakshi (2019). "Srisailam Constituency Winner List in AP Elections 2019 | Srisailam Constituency MLA Election Results 2019". Archived from the original on 18 September 2021. Retrieved 18 September 2021.