శిల్పా రైజాదా (జననం 1990 జూలై 12) ఒక భారతీయ టెలివిజన్ నటి.[1] ఆమె స్టార్ ప్లస్ ప్రసారం చేసిన హమారి దేవరానీలో పద్మిని పాత్రతో పాటు, కలర్స్ టీవీ వీర్ శివాజీలో బేగం రుఖ్సార్, జీ టీవీ జోధా అక్బర్ లో షెహ్నాజ్, & టీవీ ఢిల్లీ వాలీ ఠాకూర్ గుర్ల్స్ లో బిన్నీ పాత్రలకు ప్రసిద్ధి చెందింది.[2][3] ఆమె 2016 నుండి 2021 వరకు స్టార్ ప్లస్ లో వచ్చిన యే రిష్టా క్యా కెహ్లతా హై ధారావాహికలో సురేఖా అఖిలేష్ గోయెంకా గా మెప్పించింది.[4]

శిల్పా రైజాదా
జననం
శిల్పా రైజాదా

(1990-07-12) 1990 జూలై 12 (వయసు 34)
పాఠఖేరా, బేతుల్ జిల్లా, మధ్యప్రదేశ్, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తిటెలివిజన్ నటి
క్రియాశీల సంవత్సరాలు2010–2021
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హమారీ దేవ్ రాణి, వీర్ శివాజీ, కృష్ణాబెన్ ఖఖ్రావాలా, జోధా అక్బర్, డిల్లీ వలీ ఠాకూర్ గర్ల్స్, యే రిష్తా క్యా కెహ్లతా హై:

వ్యక్తిగత జీవితం

మార్చు

శిల్పా రైజాదా 1990 జూలై 12న భారతదేశంలోని మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లా పాఠక్హరాలో జన్మించింది.[5] ఆమె పాఠక్హరాలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె భోపాల్ లోని, ఎంవిఎం కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. భోపాల్ లో ఆమె ఆజ్ తక్ న్యూస్ ఛానెల్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన ప్రజలపై అభివృద్ధి కథనాలను కవర్ చేసింది. భోపాల్ లో ఆమె తన తొలి షో హమారి దేవరాని కోసం ఆడిషన్ చేసి ఎంపికయ్యింది. ఆమెకు అక్క సుమన్ రైజాదా, ఇద్దరు సోదరులు సౌమిత్ర, సిద్ధార్థ్ రైజాదా ఉన్నారు.

కెరీర్

మార్చు

ఆమె స్టార్ ప్లస్ రోజువారీ సోప్ మధ్యాహ్నం షో హమారి దేవరానీతో తన వృత్తిని ప్రారంభించింది. ఆమె నెగటివ్ ప్రధాన పాత్రకు నామినేట్ చేయబడింది. ఈ షో తరువాత ఆమె మాతా కీ చౌకీలో సీతగా, జోధా అక్బర్ షెహ్నాజ్ గా, ఢిల్లీ వలీ ఠాకూర్ గుర్ల్స్ లో బిన్నీగా.. ఇలా పలు పాత్రలు పోషిస్తూ బిజీగా ఉండిపోయింది. ఆమె చివరిసారిగా 2016 నుండి 2021 వరకు యే రిష్టా క్యా కెహ్లతా హై లో సురేఖా అఖిలేష్ గోయెంకా గా కనిపించింది.[6][7] 2023లో ఆమె రావణ పాత్ర పోషిస్తున్న పునీత్ ఇస్సార్, హనుమాన్ పాత్ర పోషిస్తున్న విందూ దారా సింగ్, సిద్ధాంత్ ఇస్సార్ పోషిస్తున్న రామ్ లతో సీతగా చేస్తోంది, ఇది ఒక ప్రత్యక్ష థియేటర్.

టెలివిజన్

మార్చు
సంవత్సరం సీరియల్ పాత్ర మూలం
2010 హమారి దేవరాని పద్మిని
2011 వీర్ శివాజీ బేగమ్ రుఖ్సర్
2011 కృష్ణబెన్ ఖాఖ్రవాలా బిన్నీ [8]
2013 జోధా అక్బర్ షెహ్నాజ్
2015 ఢిల్లీ వాలీ ఠాకూర్ గుర్ల్స్ బిన్నీ [9][10]
కిల్లర్ కరోకే అట్కా తో లట్కా తానే [11]
2016–2021 యే రిష్టా క్యా కెహ్లతా హై సురేఖా అఖిలేష్ గోయెంకా [12] [13]

మూలాలు

మార్చు
  1. "Yeh Rishta Kya Kehlata Hai: Shilpa Raizada celebrates her birthday with Mohsin Khan, Shivangi Joshi and others; see pics". Times of India. 13 July 2019.
  2. Team, Tellychakkar. "Shilpa Raizada to enter Zee TV's Jodha Akbar". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2019-08-14.
  3. "&TV launches new fiction show Dilli Wali Thakur Gurls". Tellychakkar. Retrieved 26 June 2021.
  4. "Yeh Rishta Kya Kehlata Hai team wraps up shoot in Silvassa, returns to Mumbai. See pics". India Today. 10 June 2021. Retrieved 26 June 2021.
  5. "'I'm a small town girl'". The Tribune. 30 August 2020. Retrieved 26 June 2021.
  6. "Shilpa Raizada: I want to be versatile". Eastern Eye. 10 September 2020. Retrieved 26 June 2021.
  7. Shruti Sampat (26 October 2021). "EXCLUSIVE! Surekha Goenka aka Shilpa Raizada gets CANDID on QUITTING Yeh Rishta Kya Kehlata Hai, memories and more". Tellychakkar. Retrieved 31 December 2021.
  8. "Shilpa Raizada to be part of Krishnaben Khakhrawala". Tellychakkar. Retrieved 26 June 2021.
  9. "Dilli Wali Thakur Gurls' mirrors society, say actors". Zee News. 26 March 2015. Retrieved 26 June 2021.
  10. "Light and funny". The Hindu. 1 April 2016. Archived from the original on 24 April 2022. Retrieved 26 June 2021.
  11. "Dilli Wali Thakur Gurls to rock &TV's Killerr Karaoke". Tellychakkar. Retrieved 26 June 2021.
  12. "These young TV mothers look shockingly different in real life". Times of India.
  13. "Yeh Rishta Kya Kehlata Hai: Shilpa Raizada aka Surekha Goenka gets emotional as she bids adieu to the show; says, 'The whole journey is unexplainable in words'". Bollywood Life Dot Com (in ఇంగ్లీష్). 2021-10-24. Retrieved 2021-10-25.