శివం రోడ్
శివం రోడ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇక్కడ సత్య సాయి బాబా నెలకొల్పిన శివం టెంపుల్ కారణంగా ఈ ప్రాంతానికి శివం రోడ్ అనే పేరు వచ్చింది. ఇది బాగ్ అంబర్‌పేట్ వార్డు పరిధిలోకి వస్తుంది.[1]
శివం రోడ్ | |
---|---|
సమీప ప్రాంతాలు | |
Coordinates: 17°23′27″N 78°31′25″E / 17.390941°N 78.523493°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500 013 |
Vehicle registration | TS 11 |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
వాణిజ్య ప్రాంతం
మార్చుఈ ప్రాంతంలో మంచి షాపింగ్ సముదాయాలు, అనేక కిరాణా దుకాణాలు ఉన్నాయి.
దేవాలయాలు
మార్చుసత్యసాయి బాబా నెలకొల్పిన శివం టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది. షిర్డీ సాయి బాబా దేవాలయం, అయ్యప్పస్వామి దేవాలయం, అహోబిల్ మఠం (నరసింహస్వామి దేవాలయం), రామాలయం, పుట్టు లింగాల గుడి మొదలైన ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి.
రవాణా వ్యవస్థ
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో శివం రోడ్ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. దీనికి సమీపంలో విద్యానగర్ రైల్వే స్టేషను ఉంది.
బ్యాంకులు
మార్చుఈ ప్రాంతంలో అనేక బ్యాంకులు, ఏటిఎంలు ఉన్నాయి.
- ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఏటిఎం
- ఇండియన్ బ్యాంక్ & ఏటిఎం
- భారతీయ స్టేట్ బ్యాంకు & ఏటిఎం
- సిండికేట్ బ్యాంకు & ఏటిఎం
- కార్పొరేషన్ బ్యాంకు & ఏటిఎం
- కరూర్ వైశ్యా బ్యాంకు & ఏటిఎం
- తెలంగాణ గ్రామీణ బ్యాంకు
మూలాలు
మార్చు- ↑ మన తెలంగాణ (29 October 2015). "బల్దియాలో 150వార్డుల వివరాలు". Archived from the original on 18 September 2018. Retrieved 18 September 2018.