శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం

శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గ్రామంలో ఉంది. కోనేరు మధ్యలో వెలుగొందుతున్న శివాలయాల్లో ఈ శివగంగ రాజరాజేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధమైంది. శివగంగ మధ్యలో ఉన్న రాజేశ్వరిదేవీని, పైన రాజేశ్వరుడి రాజుగా పరిగణించినందుకే ఈ ఆలయానికి రాజరాజేశ్వర స్వామి ఆలయం పేరు వచ్చింది. ఈ కోనేటి చుట్టున్న పదహారు శివాలయాల్లో స్వామివారు పదహారు నామాలతో భక్తులకు దర్శనమిస్తున్నాడు.[1]

శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:రంగారెడ్డి జిల్లా
ప్రదేశం:మహేశ్వరం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:రాజరాజేశ్వరుడు
ప్రధాన దేవత:రాజేశ్వరీదేవి

స్థల చరిత్ర

మార్చు

ఈ దేవాలయానికి నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది. 1673-1680 మధ్య కాలంలో గోల్కొండ నవాబు తానీషా కాలంలో సేనాధిపతులుగా పనిచేసిన అక్కన్న, మాదన్నలు ఈ ఆలయాన్ని కట్టించారని తెలుస్తుంది.[2] అక్కన్న, మాదన్నలు హత్యకు గురవ్వడంతో ఈ ఆలయం ప్రభ కొంచెం తగ్గడంతోపాటు 1687లో ఔరంగజేబు దండయాత్ర చేసి, రాతితో నిర్మించిన ఈ ఆలయాలను ధ్వంసం చేశాడు. అప్పటి నుంచీ 1979 వరకూ ఈ ఆలయం పూర్తిగా శిథిలావస్థలోనే ఉండిపోయింది. 1980లో ఆలయ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టి, కాశీ నుంచి తీసుకువచ్చిన శివలింగాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు పూజలు నిర్వహిస్తారు.

ఇతర ఆలయాలు

మార్చు

గంగ మధ్యలో ఉన్న శివాలయం దాని చుట్టూ ఉప ఆలయాలుగా శ్రీహరిహరేశ్వరుడు, శ్రీమల్లీశ్వరుడు, శ్రీఅవిముక్తేశ్వరుడు, శ్రీఅఘోరేశ్వరుడు, శ్రీఅమరేశ్వరుడు, శ్రీఅమృతేశ్వరుడు, శ్రీగంగాధేశ్వరుడు, శ్రీఇష్టకామేశ్వరుడు, శ్రీముకేశ్వరుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, శ్రీఏకాంబేశ్వరుడు, శ్రీమణికర్ణికేశ్వరుడు, శ్రీమహానందీశ్వరుడు, శ్రీఅమరావతీశ్వరుడు, శ్రీకాశీపతీశ్వరుడు, శ్రీమంగళ గౌరీశ్వరుడు ఆలయాలు పద రేకుల్లా ఉంటాయి.[3]

మూలాలు

మార్చు
  1. ఈనాడు, ఆధ్యాత్మికం. "పుష్కరిణిలో కొలువైన భోలానాథుడు". Archived from the original on 17 February 2018. Retrieved 15 February 2018.
  2. https://telugu.nativeplanet.com/travel-guide/sivaganga-raja-rajeshwari-devi-temple-maheshwaram-history-003503.html
  3. krishna (2020-02-20). "మహదేవశంభో". Mana Telangana. Archived from the original on 2023-05-31. Retrieved 2023-05-31.

వెలుపలి లంకెలు

మార్చు