శివరాజ్ తంగడగి
శివరాజ్ తంగడగి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు కనకగిరి నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 27న రాష్ట్ర బీసీ, ఎస్.టి సంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2]
శివరాజ్ తంగడగి | |||
బీసీ, ఎస్.టి సంక్షేమ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2023 మే 27 – ప్రస్తుతం | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2023 – ప్రస్తుతం | |||
నియోజకవర్గం | కనకగిరి | ||
---|---|---|---|
మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2013 – 2018 | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2008 – 2018 | |||
నియోజకవర్గం | కనకగిరి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుశివరాజ్ తంగడగి 2008లో కనకగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు కావడంతో ఆయన 2008లో రాజకీయాల్లోకి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా యడియూరప్ప ప్రభుత్వానికి మద్దతు తెలపగా ఆయన యడియూరప్ప మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా 30 మే 2008న భాద్యతలు చేపట్టి 31 జులై 2011 వరకు భాద్యతలు నిర్వహించాడు.[3]
శివరాజ్ 2013లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి రెండోసారి గెలిచి సిద్ధరామయ్య ప్రభుత్వంలో మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2023లో ఎన్నికల్లో మూడోసారి గెలిచి మళ్లీ సిద్ధరామయ్య ప్రభుత్వంలో వెనుకబడిన తరగతి & ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[4][5][6]
మూలాలు
మార్చు- ↑ Eenadu (28 May 2023). "ఆలస్యమైనా.. అమృత ఫలమే". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
- ↑ Eenadu (28 May 2023). "రాజ్‌భవన్‌కు కొత్త తళుకులు". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
- ↑ "List of Ministers in Karnataka Government in 2008". Karnataka.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2010-09-23. Retrieved 2021-08-05.
- ↑ Eenadu (28 May 2023). "గెలిచిన ప్రతిసారీ తంగడిగికి మంత్రి గిరి". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
- ↑ 10TV Telugu (29 May 2023). "సిద్ధరామయ్య కేబినెట్‌లో మంత్రులకు శాఖల కేటాయింపు.. శివకుమార్‌కు కేటాయించిన శాఖలేమిటంటే?". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.