శివరాత్రి మహత్యం

శివరాత్రి మహత్యం 1965, డిసెంబర్ 17న విడుదలైన డబ్బింగ్ సినిమా. ఈ సినిమాకు "ಶಿವರಾತ್ರಿ ಮಹಾತ್ಮೆ" అనే కన్నడ సినిమా మూలం. వీరాంజనేయ పిక్చర్స్ బ్యానర్‌పై వెలువడిన ఈ సినిమాకు పి.ఆర్.కౌండిన్య దర్శకుడు.

శివరాత్రి మహత్యం
(1965 తెలుగు సినిమా)
Sivaratri mahatyam.jpg
దర్శకత్వం పి.ఆర్.కౌండిన్య
తారాగణం రాజ్‌కుమార్,
రాజశ్రీ,
ప్రభాకర్ రెడ్డి,
మీనాకుమారి,
ధూళిపాళ
సంగీతం సాలూరు హనుమంతరావు
నిర్మాణ సంస్థ వీరాంజనేయ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

 1. రాజ్‌కుమార్ - విజయుడు
 2. రాజశ్రీ - రంజని
 3. ప్రభాకర్ రెడ్డి - శివుడు
 4. లీలావతి - వాసంతి, విజయుని భార్య
 5. మీనాకుమారి
 6. ధూళిపాళ - విక్రముడు, సేనాధిపతి

సాంకేతిక వర్గంసవరించు

కథసవరించు

సంతానం కోసం తపస్సు చేసిన సింహపురి రాజు వీరసింహునికి శివుడు పుత్ర వరమిస్తాడు. కానీ తపస్సు మధ్యలో రాజుకు కామవికారం కలిగిన కారణంగా పుట్టబోయే కొడుకు దుర్మార్గుడూ, నాస్తికుడూ, దుర్మదాంధుడూ అవుతాడనే శాపమూ ఇస్తాడు. రాజకుమారుడు విజయుడు అలానే అవుతాడు. శివాపచారం చేస్తాడు. తల్లినీ, తండ్రినీ, భార్యనూ చెరసాలలో పెడతాడు. వెలయాలిని అంతఃపురంలో పెడతాడు. చివరికి రంజనికి స్వర్ణ తులాభారం కూడా చేయబోతాడు. బంగారం తక్కువ పడగా తాను అదివరకు మూసివేసిన శివాలయంలోని బంగారు నాగాభరణాన్ని తీసుకోబోతాడు. అందువల్ల అతని కన్ను, కాలు పోతాయి. కానీ కన్నూ కాలూ పోయాక, మిత్రులు శత్రువులు, ముక్తి రక్తి ఇవన్నీ వేర్వేరుగా గ్రహించగలిగిన వాడవుతాడు. శివుడు బిల్వపత్ర పూజకు, శివరాత్రి వ్రతానికి కనికరిస్తాడు[1].

పాటలుసవరించు

 1. కనుమోయి వయ్యారి సొంపులు ఒకసారి ఘుమఘుమ - ఎస్.జానకి
 2. చాలు చాలు ఈ జన్మ ఇక చాలురా దారి తెన్నుతెలియని బ్రతుకు - పిఠాపురం
 3. జయ జయ పరమేశా దేవ దేవ జయ జయ త్రిభువన - ఎస్.జానకి
 4. జో జో జో జో బంగారు తండ్రి పసిడి కల నిను పిలువ నిదురించ - ఎస్.జానకి
 5. తాపసేంద్ర ఓ రాజచంద్ర నీకీ వనవాసమేలో ప్రేయసి దరినుండె - ఎస్.జానకి
 6. నవ్వే వెన్నెల రేయి నవ్వెను వెన్నె హాయి నవ్వుల జాబిల్లి - ఎస్.జానకి,పి.బి.శ్రీనివాస్
 7. పరమేశా నిన్నే శరణంటి నయ్యా శశిధర వేగ కరుణించి కాపాడు - ఎస్.జానకి
 8. ప్రియమోహిని కనులలో తేనియలే చిలికే వలపు తలపు - పి.బి.శ్రీనివాస్
 9. బంగారు వంటి బ్రహ్మయ్య ఉందిలే నీ ముందు జాణ - స్వర్ణలత
 10. రమణీయ మధుమాసము మధురానంద సౌభాగ్యము - ఎస్.జానకి

మూలాలుసవరించు

 1. వీరాజీ (19 December 1965). "చిత్ర సమీక్షలు: శివరాత్రి మహాత్మ్యం". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. 255. ఎస్.రాధాకృష్ణ. Archived from the original on 8 ఆగస్టు 2020. Retrieved 26 October 2017.

బయటి లింకులుసవరించు