లీలావతి (నటి)
లీలావతి (జననం లీలా కిరణ్) కన్నడ, తమిళ, తెలుగు సినిమా నటి. 50 సంవత్సరాల సినిమా జీవితంలో 600లకు పైగా (కన్నడలోనే 400 కంటే ఎక్కువ) సినిమాలలో నటించింది. భక్త కుంబార, మన మెచ్చిదా మాదాడి, శాంతా తుకారాం సినిమాలలో తన నటనతో గుర్తింపు పొందింది. 1999లో డా. రాజ్‌కుమార్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా అందుకుంది.
ఎం. లీలావతి | |
---|---|
![]() మైసూరులోని కళామందిరంలో లీలావతి | |
జననం | లీలా కిరణ్ 1937 బెల్తంగడి, దక్షిణ కన్నడ జిల్లా, కర్ణాటక |
వృత్తి | నటి, సినీ నిర్మాత, రచయిత, పరోపకారి[1] |
క్రియాశీల సంవత్సరాలు | 1958–ప్రస్తుతం |
పిల్లలు | వినోద్ రాజ్ |
తల్లిదండ్రులు | సుబ్బయ్య |
తొలి జీవితంసవరించు
లీలావతి 1937లో కర్ణాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లా, బెల్తంగడిలో జన్మించింది. 6 సంవత్సరాల వయస్సులో తల్లిదండ్రులను కోల్పోయింది.
సినిమారంగంసవరించు
చంచల కుమారి సినిమాలో చిన్న పాత్రలో, శంకర్ సింగ్ రూపొందించిన నాగ కన్నిక సినిమాలో నటించింది. తరువాత మహాలింగ భాగవతార్ కు చెందిన శ్రీ సాహిత్య సామ్రాజ్య నాటక కంపెనీ బృందంలో చేరింది.[2] 1958లో సుబ్బాయినాయుడు తీసిన భక్త ప్రహ్లాద, మాంగల్య యోగ, ధర్మ విజయం, రణధీర కంఠీరవ వంటి చిత్రాలలో నటించింది.
రాణి హొన్నమ్మ సినిమా నుండి లీలావతి పూర్తిస్థాయి కథానాయికగా మారింది. సంత తుకారం, కంతేరేడు నోడు, కైవర మహాత్మే, గాలి గోపుర, కన్యారత్న, కులవధులు, వీర కేసరి, మన మెచ్చిదా మాదాడి వంటి చిత్రాల్లో ఆమె కథానాయికగా నటించింది. గెజ్జె పూజ, డాక్టర్ కృష్ణలో సహాయక పాత్రలలో నటించింది, కర్ణాటక రాష్ట్ర అవార్డును కూడా అందుకుంది.
సినిమాల వివరాలుసవరించు
అవార్డులు, గుర్తింపులుసవరించు
మూలాలుసవరించు
- ↑ "IndiaGlitz - Leelavathi builds hospital - Kannada Movie News". Archived from the original on 2009-02-14. Retrieved 2022-02-07.
- ↑ https://www.civicnews.in/news/karnataka/entertainment/29020-do-you-know-who-is-the-real-husband-of-lelavathi
- ↑ Leelavathi Filmography
- ↑ The Hindu. 17 December 2007.
- ↑ "Kannada Cinema News | Kannada Movie Reviews | Kannada Movie Trailers - IndiaGlitz Kannada". IndiaGlitz.com. Archived from the original on 2014-08-12. Retrieved 2023-02-22.
- ↑ "Leelavathi conferred with doctorate". The New Indian Express. 2009-01-10. Retrieved 2013-08-16.