శివ్‌హర్
శివ్‌హర్ బీహార్ రాష్ట్రం తిర్హట్ డివిజన్ లోని పట్టణం, దాని చుట్టూ ఉన్న ప్రాంతం కొత్తగా ఏర్పడిన శివ్‌హర్ జిల్లా. ఈ జిల్లాకు తూర్పు, ఉత్తరాల్లో సీతామఢీ, పశ్చిమాన తూర్పు చంపారణ్, దక్షిణాన ముజఫర్పూర్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.
మహాజనపద కాలంలో, శివ్‌హర్ మగధ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. 13 వ శతాబ్దంలో ముస్లిం పాలన ప్రారంభమయ్యే వరకు మిథిల పాలకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. తరువాత స్థానిక సామంతులు ఇక్కడ తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. బ్రిటిష్ వారు వచ్చిన తరువాత, ఇది మొదట బెంగాల్ ప్రావిన్సు లోను, తరువాత బీహార్ ప్రావిన్స్‌లోనూ భాగమైంది. 1907 లో తిర్హత్ ఒక విభాగంగా మారినప్పుడు ఇది ముజఫర్పూర్ జిల్లాలో ఒక భాగంగా మారింది.
శివ్‌హర్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో గంగానదికి ఉపనది అయిన బాగ్మతి నది ప్రవహిస్తోంది. ఇది ఇక్కడ ప్రధాన నది. పట్టణ వైశాల్యం 43 చదరపు కిలోమీటర్లు. ఇది సముద్ర మట్టానికి 40 మీటర్ల ఎత్తున ఉంది.. శివహర్ లోక్‌సభ నియోజకవర్గానికి, శివహర్ అసెంబ్లీ నియోజకవర్గానికీ ఇది ముఖ్యపట్టణం
- జనాభా: 5,15,961
- గ్రామీణ జనాభా: 4,94,699
- పట్టణ జనాభా: 21,262
- జనాభా వృద్ధి రేటు: 37·16%
- జనసాంద్రత: 1279
- లింగనిష్పత్తి: 885/1000
శివ్‌హర్ జిల్లా అక్షరాస్యత 37% మాత్రమే, ఇది జాతీయ, రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువ. స్త్రీలలో అక్షరాస్యత రేటు మరీ తక్కువ (24·43%). మౌలిక సదుపాయాల లేమి, పరిశ్రమలు లేకపోవడం వెనుకబాటుతనానికి మూల కారణం. ఈ జిల్లాలో కళాశాల గాని, పెద్ద ఆసుపత్రి గానీ లేవు. ఈ వరద ప్రభావిత జిల్లాలో మంచి రోడ్లు లేవు. హిందీ, ఉర్దూలు బోధనా మాధ్యమాలు. అయితే బజ్జిక అనేది అందరూ మాట్లాడుతారు
సామూహిక సంస్కృతి
మార్చుజిల్లాలో తిరుతి, మైథిల్ సంస్కృతి వారసత్వం ఉంది. ఇక్కడ పెళ్ళిళ్ళు, ఇతర ముఖ్యమైన సందర్భాల్లో సీతారాముల పెళ్ళి పాటలను ఆకట్టుకునేలా పాడతారు. జాట్-జతిన్, జిజియాలు శివ్‌హర్ జిల్లాలోని ముఖ్యమైన జానపద నృత్యాలు. జాట్-జాతిన్ నృత్యం రాజస్థాన్ షాన్డిలియర్ మాదిరిగానే ఉంటుంది. జిజియాలో, మహిళలు తలపై మట్టి కుండలు పెట్టుకుని నృత్యం చేస్తారు. నవరాత్రి సమయంలో ఆడతారు.
మూలాలు
మార్చు1. శివహర్‌కు సంబంధించిన ముఖ్యమైన వాస్తవాలు2. శివహార్ వద్ద రహదారుల విస్తరణ