శీతల్ మీనన్ ఒక భారతీయ మోడల్, నటి.[1] కేరళలోని మంగళూరుకు చెందిన ఆమె భరతనాట్యం, ఒడిస్సీ శాస్త్రీయ నృత్యంలలో శిక్షణ పొందింది. ఆమె మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించి, మోడలింగ్ పరిశ్రమలో స్థిరపడింది. ఆ తర్వాత, ఆమె అతుల్ కస్బేకర్ నేతృత్వంలోని ఏజెన్సీతో కలిసి పనిచేసింది. ఆమె 2005, 2008 సంవత్సరాలలో కింగ్‌ఫిషర్ తో పాటు అనేక ప్రముఖ బ్రాండ్‌లకు మోడల్.గా వ్యవహరించింది.

శీతల్ మీనన్
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్

ఆమె అనుపమ్ ఖేర్ యాక్టర్ ప్రిపేర్స్ (Actor Prepares) కోర్సులో చేరింది. పవన్ కౌల్ దర్శకత్వం వహించిన నారీ హీరా భ్రమ్ – యాన్ ఇల్యూజన్‌ (2008)లో ఆమె మొదటి సారిగా నటించింది. ఆమె బెజోయ్ నంబియార్ దర్శకత్వం వహించిన షైతాన్ (2011), తెలుగులో జులాయి (2012), హిందీ-తమిళ ద్విభాషా క్రైమ్ చిత్రం డేవిడ్ (2013) వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది.

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2008 భ్రమ్ – యాన్ ఇల్యూజన్‌ అంతారా త్యాగి హిందీ అరంగేట్రం
2010 మై నేమ్ ఈజ్ ఖాన్ రాధ
2011 ది డిజైర్ ఆంగ్లం, హిందీ ఇండో-చైనా సినిమా
షైతాన్ నందిని హిందీ
2012 జులాయి దేవయాని తెలుగు
2013 డేవిడ్ సుసాన్ హిందీ
డేవిడ్ సుస్సానాః తమిళం
2016 సాగసం శీతల్

మూలాలు

మార్చు
  1. "I never saw myself making a film: Sheetal Menon - the Kashmir Monitor". 4 April 2019.