సయాజీ లక్ష్మణ్ శీలం
శీలం సయాజీ లక్ష్మణ్ (1896, మే 18 - 1980, జూలై 5) పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం తొలి లెఫ్టెనెంటు గవర్నరు. ఇతను పుదుచ్చేరి మొదటి, రెండవ శాసనసభలకు లెఫ్టెనెంటు గవర్నరుగా పనిచేశాడు. మహారాష్ట్రకు చెందిన భారత జాతీయ కాంగ్రేసు రాజకీయనాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.
శీలం సయాజీ లక్ష్మణ్ | |||
పదవీ కాలం 1963 – 1968 | |||
తరువాత | బి.డి.జట్టి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బొంబాయి | 1896 మే 18||
మరణం | 1980 జూలై 5 బొంబాయి | (వయసు 84)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రేసు | ||
జీవిత భాగస్వామి | లక్ష్మీబాయి | ||
పూర్వ విద్యార్థి | విల్సన్ కళాశాల బొంబాయి విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయనాయకుడు |
సయాజీ లక్ష్మణ్, 1951, 1957 సార్వత్రిక ఎన్నికలలో బొంబాయి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1956 నవంబరు 21 నుండి 1957 జూన్ 16 వరకు ద్వీభాషీయ బొంబాయి రాష్ట్ర శాసనసభకు సభాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. 1957 ఎన్నికల తర్వాత స్పీకరుగా కొనసాగి, 1960 ఏప్రిల్ 30 వరకు ఆ పదవిలో పనిచేశాడు. 1960, మే 1 నుండి 1962, మార్చి 14 వరకు మహారాష్ట్ర తొలి విధానసభకు స్పీకరుగా ఉన్నాడు.[1]
సయాజీ లక్ష్మణ్ 1896, మే 18న బొంబాయిలో జన్మించాడు. కానీ, ఈయన స్వస్థలం అప్పటి నిజాం రాజ్యంలోని నాందేడ్ జిల్లాలోని కార్ఖేలీ (ప్రస్తుతం లాతూర్ జిల్లా, ఉద్గిర్ తాలూకాలో ఉన్నది). ఈయన ప్రాథమిక విద్యాభ్యాసం విల్సన్ పాఠశాలలో సాగింది. 1912లో మెట్రిక్ పాసయ్యి విల్సన్ కళాశాలలో చేరాడు. 1916లో బి.ఏ పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత బొంబాయి ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయవాద విద్యను అభ్యసించి, 1920లో ఎల్.ఎల్.బి పట్టా పొందాడు.[2] ఈయన బొంబాయి మహానగరపాలికలో అనేక పదవులు నిర్వహించాడు. భారత స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని, 1942 నుండి 1945 వరకి క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మూడేళ్ళు జైలుశిక్ష అనుభవించాడు. 1941లో బొంబాయి ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ ఉపాధ్యక్షుడిగానూ, 1946 నుండి 1949 వరకు బొంబాయి ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగాను పనిచేశాడు. 1942లో బొంబాయినుండి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యాడు. బొంబాయి విశ్వవిద్యాలయం సెనేటు సభ్యుడిగా పనిచేశాడు.
ఇతను తెలుగుమిత్ర అనే ప్రచురణకు సంపాదకుడిగా పనిచేశాడు.
సయాజీ లక్ష్మణ్, 1980, జూలై 5న బొంబాయిలో మరణించాడు. భార్య లక్ష్మీబాయి
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-03. Retrieved 2017-11-20.
- ↑ Peters, T (1942). Modern Bombay and Indian States. Who's Who Publishers (India). p. 355. Retrieved 20 November 2017.