నాందేడ్ జిల్లా
మహారాష్ట్ర రాష్ట్రంలోని 37 జిల్లాలలోనాందేడ్ జిల్లా ఒకటి. నాందేడ్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది.
నాందేడ్ జిల్లా नांदेड जिल्हा | |
---|---|
![]() మహారాష్ట్ర పటంలో నాందేడ్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | ఔరంగాబాదు డివిజన్ |
ముఖ్య పట్టణం | నాందేడ్ |
మండలాలు | |
ప్రభుత్వం | |
• లోకసభ నియోజకవర్గాలు | 1. Nanded, 2. Hingoli (shared with Hingoli District) (Based on Election Commission official website) |
• శాసనసభ నియోజకవర్గాలు | 9 |
విస్తీర్ణం | |
• మొత్తం | 10,422 km2 (4,024 sq mi) |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 33,61,292 |
• సాంద్రత | 320/km2 (840/sq mi) |
• విస్తీర్ణం | 27.19 % |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 75.45% |
• లింగ నిష్పత్తి | 943 |
ప్రధాన రహదార్లు | NH-222, National Highway 204 |
సగటు వార్షిక వర్షపాతం | 954 మి.మీ. |
జాలస్థలి | అధికారిక జాలస్థలి |
అవలోకనంసవరించు
జిల్లా వైశాల్యం 10,502 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 3,361,292. నగరప్రాంత జనసంఖ్య 27.19%..[1] జిల్లాలోగోదావరి నది ప్రవహిస్తుంది.
సరిహద్దులుసవరించు
జిల్లా తూర్పు సరిహద్దులోఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిజామాబాదు, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలు, దక్షిణ సరిహద్దులోకర్నాటక రాష్ట్రానికి చెందిన బీదర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులోమహారాష్ట్ర లోని మరాఠ్వాడా డివిజన్‌లోని పర్భణీ జిల్లా, లాతూర్ జిల్లా, ఉత్తర సరిహద్దులోమహారాష్ట్ర లోని విదర్భ డివిజన్‌లోని యావత్మల్ జిల్లా ఉన్నాయి.
భాషలుసవరించు
తెలంగాణ, కర్ణాటక, విదర్భ ప్రాంతాల ప్రభావంతో జిల్లాలోని ప్రజల భాషల మీద ఉండడం వలన జిల్లాలోపలు భాషలు వాడుకలోఉన్నాయి.
గణాంకాలుసవరించు
భౌగోళిక ప్రాంతం: 10.502 km²
మొత్తం జనాభా: 3.361.292
మేల్: 14,81 లక్షలు
ఆడ: 13,94 లక్షలు
మొత్తం జనాభా అర్బన్: 27,19%
సాధారణ వర్షపాతం: 901 mm
తాలూకాను లేదా మండలం : 16
తలసరి ఆదాయం: రూ 23.801
జనాభా (1000s లో1991 సెన్సస్): 2,330 (పురుషులు = 1,198 ఆడ = 1,132)
సాంద్రత: 319 / చదరపు కిలోమీటరు
అక్షరాస్యత: 75,45%
పురుష అక్షరాస్యత: 84.27%
మహిళా అక్షరాస్యత: 66,15%
మౌళిక సదుపాయాలుసవరించు
'మొత్తం నివసించేవారు గ్రామాల: 1,546
'గ్రామాల సదుపాయాలు నం
'తాగునీరు సౌకర్యాలు: 1,538
'ముఖ్యమైన పట్టణాలు (అతిపెద్ద మూడు) సురక్షిత తాగు నీరు: 1,537
'జనాభా విద్యుత్ (పవర్ సప్లై): 1,531
'ప్రాథమిక పాఠశాల: 1,536
'మధ్య పాఠశాలలు: 768
'సెకండరీ / Sr సెకండరీ పాఠశాలలు: 504
'కళాశాల: 26
'మెడికల్ సౌకర్యం: 209
'ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం: 71
'ప్రాథమిక ఆరోగ్యం సబ్ సెంటర్: 111
'బస్ సేవలు: 1.141
'చదును విధానం రోడ్: 1,049
'మడ్ అప్రోచ్ రోడ్: 4
నివాసిత గ్రామాలు : 1,546
హిస్టారికల్ ప్రాముఖ్యత: కాంధార్ వద్ద దర్గా ఖండ్ గురుద్వారా (హజూర్ సాహిబ్), రేణుక దేవి మందిర్ మహుర్,
వాణిజ్య బ్యాంకులు: 132
పారిశ్రామిక ఎస్టేట్స్: నాందేడ్, ధర్మాబాద్ లోహా, డెగ్లూర్, కింవత్, క్రష్నూర్ (సెజ్)
చరిత్రసవరించు
నాందేడ్ జిల్లా చరిత్ర 4వ శతాబ్దం నుండి నమోదు చేయబడి ఉంది. ఇక్కడ 40-50 వేల పూర్వంనాటి మానవ నివాసాల ఆధారాలు లభిస్తున్నాయి.
1956 రాష్ట్రాల పునర్విభజన తరువాత నాందేడ్ జిల్లాలో6 తాలూకాలు ఉన్నాయి : కాంధార్, హద్గఒన్, బిలోలి, డెగ్లూర్, ముధోల్ ముఖెద్, భొకర్ ( రెవెన్యూ ప్రధాన కార్యాలయం (, మహాల్స్ అనే వారు).
రాష్ట్రాల పునర్విభజన ఫలితంగా డెగ్లూర్ తాలూకాలోని బిచ్కుంద, జుక్కల్ గ్రామాలు అలాగే ముధోల్ తాలూకా తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చేర్చబడ్డాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని కిన్వట్, ఇస్లాపూర్ గ్రామాలు వేరు చేసి నాందేడ్ జిల్లాలోకలుపబడ్డాయి. తరువాత ఇల్సాపూర్ గ్రామం కిన్వట్ తాలూకాతో విలీనం చేయబడింది. ధర్మాబాదు బిలోలి తాలూకాతో విలీనం చేయబడింది.
10వ సిక్కు గురువు గురు గోబింద్ సింగ్ నాందేడ్ జిల్లాలో18 మాసాల కాలం నివసించాడు. తరువాత ఆయన గురు నుండి " ఆద్ గ్రనాథ్ ", గురు గ్రంథ్ సాహెబ్ అయ్యాడు. రామాయణ కావ్యంలోనాందేడ్ గురించిన ప్రస్తావన ఉంది. భరతుని తల్లి కైకేయికి జన్మస్థలంగా (కేకయ రాజ్యంగా) భావిస్తున్నారు. మహూర్ సమీపకాలం నుండి పర్యాటక ప్రాంతంగా ప్రకటించబడింది.
పర్యాటక ఆకర్షణలుసవరించు
- మహుర్‌లోఉన్న రేణుకాదేవి ఆలయం ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. అంతేకాక మహుర్ వద్ద పలు మతాలయాలు ఉన్నాయి.
- దత్తా, పరశురాం ఆలయాలు. మాలేగావ్ (లోహ తాలూకా) ఖండోబా యాత్రకు ప్రసిద్ధం. వార్షికంగా నిర్వహించబడే ఈ యాత్ర దక్షిణ భారతదేశంలోనిర్వహించబడే అతిపెద్ద యాత్రగా భావించబడుతుంది. దేశం మొత్తం నుండి వ్యాపారులు జంతువుల క్రయవిక్రయాలకు ఇక్కడకు వస్తుంటారు. గుర్రాలు, ఒంటెలు, గొర్రెలు, మేకలు, ఆవులు, కుక్కలు వంటి జంతువుల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి.
ఆర్ధికంసవరించు
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లోవెనుకబడిన 250 జిల్లాలలోనాందేడ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 12 జిల్లాలలోఈ జిల్లా ఒకటి.[2]
మహారాష్ట్రా వెనుకబడిన జిల్లాల జాబితాసవరించు
- నాందేడ్ జిల్లా
ఎడ్యుకేషన్సవరించు
మరాఠ్వాడా ప్రాంతంలోమంచి విద్య సౌకర్యాలు కలిగిన జిల్లా నాందేడ్ జిల్లా.
- విశ్వవిద్యాలయాలు - 01: నాందేడ్ విశ్వవిద్యాలయం
- మెడికల్ కళాశాలలు - 02
- ఇంజనీరింగ్ కళాశాలలు - 03
- డిప్లొమా ఇంజనీరింగ్ కళాశాలలు - 10
- ఫార్మసీ కళాశాలలు - 03
- డిప్లొమా -ఫార్మసీ 10
ఇండస్ట్రీస్సవరించు
- జిల్లా నాందేడ్ లోపారిశ్రామిక ప్రాంతాలు ఉన్న స్థితి.
- మొత్తం పారిశ్రామిక యూనిట్ సంఖ్య = 1482
- ఇండస్ట్రియల్ ఏరియా యొక్క నం సంఖ్య = 6
- లక్షల చిన్న తరహా పరిశ్రమల టర్నోవర్ = 54391
- లక్షల = 124520 లోమధ్యస్థ టర్నోవర్ & లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్
మధ్యస్థం & లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ / పబ్లిక్ రంగ సంస్థలుసవరించు
- Humata Jaiwantrao పాటిల్ షుగర్ మిల్స్ లిమిటెడ్., సూర్య నగర్, Hadgaon, నాందేడ్
- జై అంబికా Sahakari Sakhar Karkhana, Kuntur, Naigaon, నాందేడ్
- గోదావరి మన్నార్ Sahakari Sakhar Karkhana, శంకర్ నగర్, Biloli, నాందేడ్
- Bhaurao చవాన్ Sahakari Sakhar Karkhana, Ardhapur, నాందేడ్
- జై శివ్ శంకర్ Sahakari Sakhar Karkhana, Shaikah నగర్, Mukhed, నాందేడ్
- కీర్తి ఆహార లిమిటెడ్, MIDC, Balapur, Dharmabad, నాందేడ్
- పయనీర్ డిస్టిలరీస్ లిమిటెడ్, Balapur, Dharmabad, నాందేడ్
- జై కార్పొరేషన్ లిమిటెడ్, MIDC, నాందేడ్
- శంకర్ Sahakari Sakhar Karkhana, Waghalwada, వయసు, నాందేడ్
- కోహినూర్ ఫీడ్లు & ఫాట్స్, MIDC, నాందేడ్
- శివ ఎరువులు లిమిటెడ్, Dhakani లోహా, నాందేడ్
- Kalamber Vibhag Sahakari Sakhar Karkhana, Kalambar లోహా, నాందేడ్
- సాయి Samaran ఫుడ్స్ లిమిటెడ్, MIDC నాందేడ్
- మహారాష్ట్ర Krushi & ఉద్యోగ్ వికాస్ మహామండలం, MIDC, నాందేడ్
- Godaveri డ్రగ్స్ లిమిటెడ్, MIDC, నాందేడ్
- XL టెలికాం & ఎనర్జీ లిమిటెడ్, MIDC, నాందేడ్
- టాటా కెమికల్ లిమిటెడ్, MIDC నాందేడ్
- ఇండ్-భారత్ ఎనర్జీ లిమిటెడ్, Mukhed, నాందేడ్
- ఫ్లెమింగో Pharmasuticals, MIDC, Krushnoor, నాందేడ్
- అడ్వాన్స్ స్టీల్ స్ట్రక్చర్స్ భారతదేశం ప్రెవేట్ లిమిటెడ్. లిమిటెడ్ MIDC Krushnoor, నాందేడ్
- డాక్టర్ Reddeys లాబొరేటరీస్ లిమిటెడ్, MIDC Krushnoor, నాందేడ్
సరిహద్దులుసవరించు
జిల్లా 180 15 ' నుండి190 55' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 770 నుండి 78025 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది. జిల్లా వైశాల్యం 10,332. రాష్ట్రంలోఇది ఆగ్నేయ భూభాగంలోఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులోయావత్మల్ జిల్లా, నైరుతీ సరిహద్దులోలాతూర్ జిల్లా, వాయవ్య సరిహద్దులోపర్భాణీ జిల్లా,తూర్పు సరిహద్దులో తెలంగాణ చెందిన ఆదిలాబాద్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో ఆంధ్రప్రదేశ్కు చెందిన నిజామాబాదు జిల్లా, దక్షిణ సరిహద్దులోకర్నాటకకు చెందిన బీదర్ ఉన్నాయి.
భౌగోళికంసవరించు
జిల్లా భౌగోళికంగా కొండలు గుట్టలతో ఎగుడుదిగుడు, మైదానాలు, స్వల్పమైన ఏటవాలు, లోయల మైదానాలతో ఉంటుంది. జిల్లా కొండప్రాంతంతో కూడిన ఉత్తర భూభాగం, గోదావరి, మంజ్ర, మన్యాద్ పెంగంగా నదీ ప్రవాహక ప్రాంతం దిగువన ఉండే ఈశాన్య భూభాగంగా విభజించబడింది.
2001 లో గణాంకాలుసవరించు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,356,566,[3] |
ఇది దాదాపు. | ఉరుగుయేఅదేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 99వ స్థానంలోఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 319 .[3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 16.7%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 937:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 76.94%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. |
భాషలుసవరించు
జిల్లాలోమరాఠీ, హిందీ, పంజాబీ, బంజరీ, ఉర్దు, తెలుగు, తెలుగు, కన్నడ, అంద్ (ఇండో ఆర్యన్ భాషలలోఒకటి ) భాషలు 1,00,000 మంది ప్రజలలోవాడుకలోఉన్నాయి. [6]
ములాలుసవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-16. Retrieved 2014-11-27.
- ↑ 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Uruguay 3,308,535 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Connecticut 3,574,097
- ↑ M. Paul Lewis, ed. (2009). "Andh: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.