శీలా వీర్రాజు
రచయిత, చిత్రకారుడు
శీలా వీర్రాజు 1939, ఏప్రిల్ 22న రాజమండ్రిలో జన్మించాడు. విద్యాభ్యాసం కూడా రాజమండ్రిలోనే జరిగింది.1961లో హైదరాబాదు నుండి వెలువడే కృష్ణాపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరి రెండేళ్లు పనిచేశాడు. 1963లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ సమాచార పౌర సంబంధ శాఖలో అనువాదకుడిగా చేరి 1900లో స్వచ్ఛంద పదవీవిరమణ చేశాడు. చిత్రకారుడిగా, కవిగా, కథారచయితగా, నవలారచయితగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించాడు.[1]
రచనలుసవరించు
కవిత్వం
- కొడిగట్టిన సూర్యుడు
- హృదయం దొరికింది
- మళ్ళీ వెలుగు
- కిటికీ కన్ను
- ఎర్రడబ్బా రైలు
- పడుగుపేకల మధ్య జీవితం
- శీలా వీర్రాజు కవిత్వం ( పై ఆరు కవితాసంపుటాల బృహద్గ్రంథం)
- బతుకు బాట
- ఒక అసంబద్ధ నిజం
నవలలు
- వెలుగు రేఖలు
- కాంతిపూలు
- మైనా
- కరుణించని దేవత
కథాసంపుటాలు
- సమాధి
- మబ్బుతెరలు
- వీర్రాజు కథలు
- హ్లాదిని
- రంగుటద్దాలు
- పగా మైనస్ ద్వేషం
- వాళ్ళ మధ్య వంతెన
- మనసులోని కుంచె
- ఊరు వీడ్కోలు చెప్పింది
- శీలావీర్రాజు కథలు (8 కథాసంపుటాల హార్డ్ బౌండ్)
ఇతరాలు
- కలానికి ఇటూ అటూ(వ్యాస సంపుటి)
- శిల్పరేఖ (లేపాక్షి రేఖాచిత్రాలు)
- శీలావీర్రాజు చిత్రకారీయం (వర్ణచిత్రాల ఆల్బమ్)
పురస్కారాలుసవరించు
- 1967లో కొడిగట్టిన సూర్యుడు కవితాసంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ మొట్టమొదటి అవార్డు
- 1969లో మైనా నవలకు ఆం.ప్ర.సాహిత్య అకాడెమీ ఉత్తమ నవల పురస్కారం
- 1991లో శీలావీర్రాజు కథలు సంపుటానికి తెలుగువిశ్వవిద్యాలయం ఉత్తమ కథల సంపుటి బహుమతి
- 1994లో కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం[2].
- డా. బోయి భీమన్న వచన కవితా పురస్కారం - లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం (బోయి భీమన్న సాహిత్య పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం, 19.09.2014)[3].
మూలాలుసవరించు
- ↑ పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు
- ↑ పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284. Check date values in:
|date=
(help) - ↑ నమస్తే తెలంగాణలో బోయి భీమన్న సాహితీ పురస్కారాలు వ్యాసం