శుభశ్రీ రాయగురు
Vijay
| name = శుభశ్రీ రాయగురు
| birth_date = ఒడిశా
| nationality = భారతీయురాలు
| education = ఎల్‌ఎల్‌బీ
| alma_mater = కేంద్రీయ విద్యాలయ, ముంబై
కె.వి. న్యాయ కళాశాల, ముంబై
| occupation = నటి, మోడల్
| years_active = 2022 - ప్రస్తుతం
}}
శుభశ్రీ రాయగురు (జననం 1997 ఏప్రిల్ 15) భారతీయ సినిమా నటి, మోడల్. ఒడిశాలో పుట్టిపెరిగిన ఆమె 2022లో వచ్చిన తెలుగు సినిమా రుద్రవీణ, తమిళ సినిమా డెవిల్ లతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆ తరువాత 2023లో అమిగోస్, కథ వెనుక కథ వంటి పలు చిత్రాల్లోనూ ఆమె నటించింది.[1]
ముంబైలో ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తి చేసిన ఆమె లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయినప్పటికీ ఆమెకి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. అలా 2020లో వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా విజేతగా నిలిచింది. తర్వాత టెలీవిజన్ యాంకర్‌గా మారింది. హిందీ సినిమా మస్తీజాదే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా ఆమె వ్యవహరించింది.
2023 సెప్టెంబరు 3న స్టార్ మాలో ప్రారంభమైన తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7లో ఆమె ఓ హౌస్‌మేట్.[2]
ప్రారంభ జీవితం
మార్చుఆమె ఒడిశాలో 1997 ఏప్రిల్ 15న జన్మించింది. ముంబైలో కేంద్రీయ విద్యాలయలో ఆమె చదువుకుంది. ఆమె స్కూల్ స్థాయిలో మంచి స్పోర్ట్స్ ప్లేయర్ గా ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్ సహా ఎన్నో స్పోర్ట్స్‌లో సత్తా చాటింది. ఆ తరువాత కె.వి. న్యాయ కళాశాల నుంచి ఆమె న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా (బ్యాచిలర్ ఆఫ్ లాస్) పుచ్చుకుంది. కాలేజీ రోజుల్లో ఆమె మోడలింగ్ చేసింది. VLCC ఫెమినా మిస్ ఇండియా ఒడిశా 2020 ని ఆమె గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె టీవి యాంకర్‌గా అనేక లైవ్ షోలు నిర్వహించింది కూడా.
అలాగే నటన మీదున్న ఆసక్తితో ఆమె హైదరాబాద్ చేరుకుని సినిమా రంగంలో ప్రవేశించింది. దానికి ముందు ఆమె కొంతకాలం లాయర్‌గా పనిచేసింది.
మూలాలు
మార్చు- ↑ "తెలుగు రాదు, కానీ తెలివి చాలా ఉందంటోన్న అమిగోస్ బ్యూటీ | Bigg Boss 7 Telugu: Subhashree Rayaguru Entered as 5th Contestant - Sakshi". web.archive.org. 2023-09-04. Archived from the original on 2023-09-04. Retrieved 2023-09-04.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Namasthe Telangana (3 September 2023). "గ్రాండ్‌గా మొదలైన బిగ్‌బాస్-7.. హౌజ్‌లోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే." Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.