శనగపిండి

యుఫ్ర్స్5ఎ4స్తెద్
(శెనగపిండి నుండి దారిమార్పు చెందింది)

శనగపిండి అనేది శనగపప్పును పిండి ఆడించగా వచ్చిన పదార్ధం. శనగపప్పును బెంగాల్ పప్పు అని కూడా కొన్ని ప్రదేశాల్లో పిలుస్తారు. శనగపిండి అనేది భారత వంటకాలలో అతి ముఖ్యమైన దినుసు. భారతీయ వంటల్లో ఎన్నో వంటలను శనగపిండి లేకుండా చేయడం కుదరదు. కేవలం భారత వంటకాల్లోనే కాక, బంగ్లాదేశ్ వంటల్లోనూ, బర్మా వంటల్లోనూ, నేపాలీ, పాకిస్థానీ, శ్రీలంక వంటకాల్లో కూడా శనగపిండి చాలా ముఖ్యమైన దినుసు. పచ్చి శనగపప్పును కానీ వేయించిన శనగపప్పును కానీ పిండి పట్టించుకుని శనగపిండిని తయారు చేసుకోవచ్చు. పచ్చి శనగపిండి కాస్త చేదుగా ఉంటుంది. అదే వేయించిన పప్పు ద్వారా వచ్చిన శనగపిండి కమ్మగా, బాగుంటుంది.

Gram flour
Nutritional value per 100 గ్రా. (3.5 oz)
శక్తి1,619 కి.J (387 kcal)
57 g
చక్కెరలు10 g
పీచు పదార్థం10 g
6 g
22 g
విటమిన్లు Quantity
%DV
నియాసిన్ (B3)
7%
1 mg
ఫోలేట్ (B9)
109%
437 μg
ఖనిజములు Quantity
%DV
కాల్షియం
5%
45 mg
ఇనుము
31%
4 mg
మెగ్నీషియం
47%
166 mg
ఫాస్ఫరస్
45%
318 mg
పొటాషియం
18%
846 mg
సెలేనియం
11%
8 μg
సోడియం
4%
64 mg
జింక్
21%
2 mg
ఇతర భాగాలుపరిమాణం
నీరు10 g
Percentages are roughly approximated using US recommendations for adults.
Source: USDA Nutrient Database

పోషక విలువలు

మార్చు

శనగ పిండిలో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి.,[1] మైదా, గోధుమ వంటి ఇతర పిండ్ల కన్నా శనగ పిండిలో పీచు పదార్ధం ఎక్కువ. గ్లుటెన్ అనే ప్రొటీన్ల సమూహం ఈ పిండిలో అస్సలు ఉండదు. ఈ గ్లుటెన్ అనేది కాస్త అనారోగ్యకరమైన ప్రొటీన్. [2] శనగ పిండిలో ఆరోగ్యకరమైన ఇతర ప్రొటీన్ల శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.[1]

శనగపిండి వాడి చేసే వంటకాలు

మార్చు

భారతదేశం

మార్చు

భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనూ శనగపిండి వాడకం ఎక్కువగానే ఉంటుంది. ఎన్నో వంటకాల్లో శనగపిండే ప్రధాన పదార్ధం. ఎక్కువగా చిరుతిళ్ళు, తీపి పదార్ధాలూ, పులుసులు, కూరల్లో శనగపిండిని వాడతారు. శనగపిండి ఉపయోగించి చేసే కొన్ని భారతీయ వంటకాల చిట్టా:

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో, శనగపిండి, ఉల్లిపాయలు, బంగాళాదుంపలతో ఒక కూర చేస్తారు. ఎక్కువగా చపాతిలు, పూరీల్లోకి ఈ కూర తింటారు. [3] మజ్జిగ పులుసులోకి, దప్పళంలోకి కూడా శనగపిండిని వాడతారు. ముఖ్యంగా కాకరకాయ వంటి కూరల్లో కూడా శనగపిండి వేస్తారు. అలా వేయడం వల్ల కాకరకాయ చేదు తగ్గుతుంది. క్యాప్సికం, వంకాయ కూరల్లో కూడా ఈ పిండి చల్లుతారు. శనగపిండితో వేసే దోశ కూడా భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎక్కువగా తినే అల్పాహారం.

ఆగ్నేయ, తూర్పు ఆసియా

మార్చు
  • బర్మీస్ టోఫు(బర్మాలో తయారయే ఒక రకం పన్నీర్)
  • జిడో లియాంగ్ఫెన్(చైనా, టిబెట్ వంటి దేశాల్లో శనగపిండిని వాడి ఈ వంటకాన్ని తయారు చేస్తారు. అక్కడ ఈ వంట ఎక్కువగా దొరికే చిరుతిండి. అక్కడి ప్రజలు ఎక్కువగా వేసవికాలంలో ఈ వంటకాన్ని తినడానికి ఇష్టపడతారు.)

దక్షిణ యూరప్

మార్చు

లిగురియా సముద్ర తీరప్రాంతాల్లో కూడా శనగపిండి వాడకం బాగానే ఉంది. అయితే నేరుగా శనగలు కాకుండా, అదే జాతికి చెందిన గర్బెంజో పప్పును వాడి శనగపిండిని తయారు చేస్తారు. ఈ పిండితో ఒవెన్ లో తయారు చేసే పల్చటి పాన్ కేక్(దోశ వంటిది)ను తయారు చేస్తారు. ఈ పాన్ కేక్ ను ఇటాలియన్ భాషలో ఫరినటా అనీ, గెనోవా భాషలో ఫైనా అనీ, ఫ్రెంచ్ లో సొక్కా లేదా కేడ్ అని పిలుస్తారు. కాస్త తయారీ విధానం తేడా తప్పించి, ఈ దేశాలన్నింటిలోనూ ఈ పాన్ కేక్ ను చిరుతిండిగా తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సిసిలియాలో శనగపిండిని ఉపయోగించి పెనెల్లే అనే ఒక రకం బజ్జీలను తయారు చేస్తారు. స్పెయిన్ వారు చేసుకునే టొర్టిల్లటిస్ డీ కేమరోన్స్ అనే వంటకంలో శనగపిండి ప్రధాన దినుసు. సైప్రస్, గ్రీస్ వంటి దేశాల్లో చర్చిల్లో జరిగే సంస్మరణ సభల్లో, ప్రత్యేకించి కోలివా అనే ఒక వంటకాన్ని వడ్డిస్తారు. దీనిని పవిత్రమైన వంటకంగా భావించి, చనిపోయినవారి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఉడకపెట్టిన గోధుమలతో చేసే ఈ వంటకంలో శనగపిండిని అలంకారానికి వాడతారు. ఈ వంటకంలో శనగపిండి ప్రధాన దినుసు కాకపోయినా, తప్పకుండా పై నుంచి చల్లడానికి ఉపయోగిస్తారు.

ఉత్తర ఆఫ్రికా

మార్చు

మొరాకోలో కరన్ అనే వంటకాన్ని ఎక్కువగా చేస్తుంటారు. శనగపిండి, గుడ్లు వాడి, ఒవెన్ లో చేసే ఈ వంటను, అక్కడి వారు ఇష్టంగా తింటారు. ఇలాంటి వంటకమే అల్జీరియాలో కూడా చేస్తుంటారు. వారి భాషలో ఈ వంటని గరన్టిటా లేదా కరన్టిటా అంటారు.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Chickpea flour (besan)". Nutrition Data: Nutrition Facts and Calorie Counter. Retrieved 2007-09-29.
  2. "Grains and Flours Glossary: Besan". Celiac Sprue Association. Archived from the original on 2007-10-03. Retrieved 2019-10-17.
  3. "Senagapindi Kura (Onion curry with Besan)". Archived from the original on 2014-01-06. Retrieved 2019-10-17.
  4. "Karantita, Garantita, La Petite Panière". Archived from the original on 2016-06-29. Retrieved July 18, 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=శనగపిండి&oldid=3850104" నుండి వెలికితీశారు