శేషం రామానుజాచార్యులు

(శేషం రామానుజాచార్య నుండి దారిమార్పు చెందింది)

శేషం రామానుజాచార్యులు సుప్రసిద్ధ కవి, పండితుడు, వ్యాఖ్యాత, ఉభయ భాషా ప్రవీణుడు. ఆకాశవాణి కార్యనిర్వహణ అధికారిగా విభిన్న కార్యక్రమాలను ఆయన సమర్థవంగా నిర్వహించారు. ప్రముఖ పత్రికల్లో ఎన్నో వ్యాసాలు రాసారు. ఆముక్తమాల్యద, చింతరామృతం, చైతన్యరేఖలు, సమాలోచన, రంఘనాథ వైభవం మొదలైన రచనలు చేశారు.[1]

శేషం రామానుజాచార్యులు

జీవిత విశేషాలు

మార్చు

ఆయన తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా, నకిరేకల్‌కు చెందిన వారు. గీతా విజ్ఞానాంధ్ర కళాశాలలో బీవోఎల్‌ను పూర్తి చేశారు. 1974లో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌గా కొనసాగారు. 1976 అక్టోబరు 15న ఆకాశవాణిలో చేరి 30ఏళ్లుగా వివిధ హోదాల్లో, శాఖల్లో విధులు నిర్వహించారు. శ్రీ వైష్ణవ సేవా సంఘానికి ఉపాధ్యక్షుడిగా కొనసాగారు.[2] ఆయన ఏప్రిల్ 16 2016 న శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ మరణించారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.[3]

1969లో సాగిన తెలంగాణ ఉద్యమంలో నల్లగొండ జిల్లాలో చురుకుగా పాల్గొన్నారు. ఆకాశవాణిలో ఉన్నతాధికారులతో పోరాడి, తెలంగాణ ఒగ్గు కళాకారులకు అవకాశం కల్పించారు.[4]

రచనలు

మార్చు

ఆశు కవిత్వం, పద్యగద్య రచనల్లోనూ ఆయన అసామాన్యులు. చైతన్యరేఖలు (కవిత్వం), తిరుప్పావై (అనువాదం), అహో! ఆంధ్రభోజ (పద్యకృతి), యా మినీ పూర్ణతిలకం (నాటకం), చింతనామృతం (ఆధ్యాత్మిక వ్యాసాలు) వంటివి రాసారు. ఆయన లలిత గీతాలతో సంకలనం తెచ్చారు. తిరుమల బ్రహ్మోత్స వాలు, యాదగిరీశుని ఉత్సవాలకు వ్యాఖ్యానాన్ని అందించారు. యామినీపూర్ణ తిలకం పేరుతో ఆయన రాసిన రేడియోనాటకం సంచలనం సృష్టించింది.[5] తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ సాహిత్యంపై ఆయనకు సాధికారిక ప్రజ్ఞ ఉండేది.

మూలాలు

మార్చు
  1. ప్రముఖ కవి, పండితుడు, వ్యాఖ్యాత శేషం రామానుజాచార్యులు మృతి![permanent dead link]
  2. "కవి రామానుజాచార్యులు కన్నుమూత 17-04-2016". Archived from the original on 2016-04-18. Retrieved 2016-06-06.
  3. శేషం రామానుజాచార్యులు కన్నుమూత[permanent dead link]
  4. "కవి శేషం రామానుజాచార్య కన్నుమూత". Archived from the original on 2016-04-19. Retrieved 2019-07-10.
  5. యామినీ పూర్ణతిలకం రెండవ భాగం

ఇతర లింకులు

మార్చు