శైలీ సింగ్(జననం: జనవరి 7, 2004) లాంగ్ జంప్ పోటీలలో పాల్గొనే యువ భారతీయ క్రీడాకారణి. ఆమె కేవలం భారత జాతీయ జూనియర్ లాంగ్ జంప్ విజేత మాత్రమే కాదు అండర్ -18 విభాగంలో ప్రపంచంలోని అత్యుత్తమ 20 లాంగ్ జంప్ క్రీడాకారిణుల్లో ఒక్కత్తి. [1] అండర్ -18 విభాగంలో ఆమె జాతీయ రికార్డును నెలకొల్పింది. ఆమెకు ఒకప్పటి ప్రముఖ భారతీయ లాంగ్ జంప్ క్రీడాకారిణి అంజు బాబీ జార్జ్, ఆమె భర్త శిక్షకులుగా వ్యవహరిస్తున్నారు.

శైలీ సింగ్
వ్యక్తిగత సమాచారం
జన్మనామంశైలీ సింగ్
జననంజనవరి 7 2004
ఝాన్సీ
క్రీడ
దేశంభారత దేశం
క్రీడలాంగ్ జంప్
సాధించినవి, పతకాలు
జాతీయ ఫైనళ్ళు2018, రాంచిలో జరిగిన నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అండర్ -16 లాంగ్ జంప్ విభాగంలో బంగారు పతకం.[2] 2019, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జరిగిన నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అండర్ 18 విభాగంలో బంగారు పతకం.

వ్యక్తిగత జీవితం, నేపద్యం

మార్చు

సింగ్ జనవరి 7, 2004న ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సి లో జన్మించింది. ఆమె తల్లి వినీత సింగ్. తన ముగ్గురు పిల్లలను ఆమె ఒంటరిగానే పెంచింది. వృత్తిరీత్యా దర్జీ అయిన వినీత సింగ్, శైలీ అథ్లెటిక్స్‌ రంగాన్ని ఎంచుకుంటానన్న తన అభిలాషను వ్యక్తం చేసినప్పుడు ఆమె వెనకడుగు వేశింది. ఒక చిన్న పట్టణంలో నిరాడంబరమైన నేపథ్యం ఉన్న ఓ అమ్మాయి లాంగ్ జంప్‌ని కెరీర్ గా ఎంచుకోవడం అంత సులభం కాదు. [3] [4] లాంగ్ జంప్‌లో సింగ్ చూపించిన అద్భుతమైన ప్రతిభ మాజీ భారత లాంగ్ జంప్ క్రీడాకారిణి అంజు బాబీ జార్జ్, ఆమె భర్త , కోచ్ రాబర్ట్ బాబీ జార్జ్ దృష్టిని ఆకర్షించింది. బెంగళూరు లో ఉన్న అంజు బాబీ జార్జ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ Archived 2021-11-26 at the Wayback Machine లో సింగ్ కు శిక్షణ ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చాడు. అంజు బాబీ జార్జ్ స్పోర్ట్స్ ఫౌండేషన్‌లో శిక్షణ కోసం సింగ్ తన 14 ఏళ్ల వయసులో బెంగళూరుకు వెళ్ళింది.[5]జార్జ్ దంపతుల పర్యవేక్షణలో సింగ్ శిక్షణ ప్రారంభించారు.

వృత్తిపరమైన విజయాలు

మార్చు

2018 లో రాంచీలో జరిగిన జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అండర్ -16 విభాగంలో లాంగ్ జంప్‌లో సింగ్ బంగారు పతకం సాధించింది. అదే సమయంలో ఆమె జూనియర్ లాంగ్ జంప్‌లో ఉన్న జాతీయ రికార్డును కూడా బద్దలు కొట్టింది. ఆమె పేరు మీద 5.94 మీటర్ల లాంగ్ జంప్ రికార్డ్ నమోదైంది. 2019 లో, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జరిగిన జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ పోటీలో బంగారు పతకం సాధించడానికి ఆమె 6.15 మీటర్లు దూకి అండర్ -18 లో తన రికార్డును మరింత మెరుగుపరిచింది .అలా 2020లో ఐఎఎఎఫ్ అండర్ -20 ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి అర్హత సాధించింది. [6] భారత క్రీడా మంత్రి కిరెన్ రిజిజు ఆమె సాధించిన విజయానికి అభినందిస్తూ ట్వీట్ చేశాడు. [7] [8]కోచ్ రాబర్ట్ బాబీ జార్జ్-అంజు బాబీ జార్జ్ ఇద్దరూ శైలీ సింగ్ దృష్టిలో ఆమె ఒక అసాధారణమైన అథ్లెట్.అంజు బాబీ జార్జ్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందడంతో పాటు, సింగ్‌కు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్, బెంగళూరులోని అభినవ్ బింద్రా సెంటర్ కూడా సహకారం అందిస్తున్నాయి.[9]

మూలాలు:

మార్చు
  1. "Long Jumper Shaili Broke Two National Records. Is She The Next Big Thing In Indian Athletics?". IndiaTimes (in Indian English). 2019-11-05. Retrieved 2021-02-17.
  2. Andrajyothy (25 August 2021). "దూకుడే ఆమెశైలి!". Archived from the original on 5 సెప్టెంబరు 2021. Retrieved 5 September 2021.
  3. "Long Jumper Shaili Broke Two National Records. Is She The Next Big Thing In Indian Athletics?". IndiaTimes (in Indian English). 2019-11-05. Retrieved 2021-02-17.
  4. "శైలీ సింగ్: అథ్లెటిక్స్‌లో భారత్ ఆశాకిరణం". BBC News తెలుగు. Retrieved 2021-02-17.
  5. "Jr National Athletics: Long Jumper Shaili Singh Breaks National Record - SheThePeople TV" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  6. "Long-jumping and breaking records: Shaili Singh, remember the name". The Indian Express (in ఇంగ్లీష్). 2019-11-07. Retrieved 2021-02-17.
  7. ANI (2019-11-05). "Rijiju lauds Shaili Singh for scripting national record". Business Standard India. Retrieved 2021-02-17.
  8. "శైలీ సింగ్: అథ్లెటిక్స్‌లో భారత్ ఆశాకిరణం". BBC News తెలుగు. Retrieved 2021-02-17.
  9. "Coach tips Olympics future for teen prodigy Shaili Singh". The New Indian Express. Retrieved 2021-02-17.