శొంఠి శారదాపూర్ణ

శొంఠి శారదాపూర్ణ ప్రముఖ రచయిత్రి. ఆమె స్వాతంత్రసమరయోధులైన సుసర్ల గోపాలశాస్త్రి గారి కుమార్తె.చికాగోలో తెలుగు స్టడీస్ సెంటర్ డైరక్టరుగా పనిచేస్తున్నారు.

జీవిత విశేషాలు మార్చు

ఆమె తిరుపతి లో జన్మించింది. కోస్తా ప్రాంత నగరమైన విశాఖపట్నం లో పెరిగింది. ఆమె తండ్రి ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుదు, ఆజాద్ హింద్ ఫొజ్ సభ్యుడు అయిన సుసర్ల గోపాలశాస్త్రిగారు.1975 లో ఆమె అమెరికాకు వలస వెళ్ళారు.ఆమె 1997 లో తెలుగుభాషలో డాక్టరేట్ పొందడంతో పాటు త్రిపురనేని గోపీచంద్ గోల్డ్ మెడల్ ను పొందారు. 2010 లో సంస్కృత భాషలో రెండవ డాక్టరేటు డిగ్రీని పొందారు. భారతదేశం లోని ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి సంగీత శాస్త్రంలో డి.లిట్ చేశారు.ఆమె భారత దేశంలో భాష,సాహిత్యం, కళా ప్రదర్శనలపై గణనీయంగా కృషిచేసారు.ఆమె లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థ అయిన "సప్నా"(అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్ నార్త్ అమెరికా) ను 1989లో స్థాపించారు. 1989 లో చికాగో నగరంలో "శ్రీ ఫొండేషన్" ను స్థాపించారు. ఈ సంస్థను అమెరికాలో భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షించేందుకు గాను స్థాపించారు.ఆమె 2000 లో "సెంటర్ ఫర్ తెలుగు స్టడీస్" ను స్థాపించారు. ఆమె రచయిత,పండితురాలు, 8 పుస్తకాలను ప్రచురించారు. "బ్రహ్మి" అనే త్రైమాసిక జర్నల్ కు ఆమె యజమాని, సంపాదకురాలు.[1]

ఆమె ఆరు సంవత్సరాల పాటు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి విజిటింగ్ ప్రొఫెసర్, ప్రోగ్రాం కో ఆర్దినేటరుగా పనిచేసారు.

ప్రచురణలు మార్చు

  • ప్రతీచి (లేఖలు)[2]
  • శరధృతి[2]
  • తాళ్ళపాక అన్నమాచార్యుని సంగీత నృత్య కళాభిజ్ఞత.
  • మేఘదూతం [3]
  • నీతి సాహస్రి(చాణక్య సూక్తులు)
  • శరజ్ఘరి
  • తెలుగు సంస్కృతి-భాషా సారస్వతములు
  • శరన్నిక్వాణం

పురస్కారాలు మార్చు

  • భాషారత్న
  • 2013 : మహతి పురస్కారం
  • 1989 : రాయప్రోలు సుబ్బారావు సాహితీ అవార్డు
  • సంగీత కళా ప్రపూర్ణ
  • 2005 లో తానా అవార్డు.
  • 2006 లో ఆటా అవార్దు.

మూలాలు మార్చు

  1. "Dr Sarada Purna Sonty". drsaradapurna.com/. saradapurna sonty. Archived from the original on 13 ఆగస్టు 2015. Retrieved 1 August 2015.
  2. 2.0 2.1 "Books authored by NRI released". STAFF REPORTER. The Hindu. Retrieved 26 October 2011.
  3. "ప్రచురణలు". Archived from the original on 2015-08-13. Retrieved 2015-08-02.

ఇతర లింకులు మార్చు