సుసర్ల గోపాలశాస్త్రి
సుసర్ల గోపాలశాస్త్రి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.[1] ఆయన సివిల్ ఇంజనీరింగ్ లో "భీష్మాచార్యులు"గా సుప్రసిద్ధులు.[2][3] ఆయన నేతాజీ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో సభ్యునిగా ఉండేవారు.[4]
జీవిత విశేషాలు
మార్చుఆయన అమెరికన్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డిగ్రీని పొందారు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టాను పొందారు.[5]
ఆయన స్థానికంగా అనేక సాంకేతిక సంస్థలలో కీలక భూమిక పోషించారు. ఆయన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వాల్యూర్స్ ఇనిస్టిట్యూట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రిడ్జ్ ఇంజనీర్స్, ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూ, అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజరీర్స్ వంటి సంస్థలకు తన సేవలందించారు.[2]
ఆయన తత్వవేత్తగా, పరోపకారిగా విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీకి వ్యవస్థాపక సెక్రటరీగా ఉన్నారు. శోభం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు మేనేజింగ్ పార్టనర్ గా ఉండేవారు. ఆయన ఇండియన్ రైల్వే, టివియస్ ఇందస్త్రీస్, గోడ్రెస్ అండ్ బోయ్సీ, హెచ్.పి.సి.ఎస్, ఇతర ఆయిల్ కంపెనీలలో పనిచేసారు.[2]
వ్యక్తిగత జీవితం
మార్చుఆయనకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు.[2] ఆయన కుమార్తె శొంఠి శారదాపూర్ణ ప్రముఖ రచయిత్రి.
మరణం
మార్చుఆయన ఏప్రిల్ 11 2015 న తన 93వ యేట విశాఖపట్నంలోని తన స్వగృహంలో మరణించారు.[2][6]
మూలాలు
మార్చు- ↑ "విశాఖ:స్వాతంత్ర్య సమరయోధుడు డా.సుసర్ల కన్నుమూత (11-Apr-2015)". Archived from the original on 2016-03-07. Retrieved 2015-08-02.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "Susarla Gopala Sastry Passes Away". Indian Express. Archived from the original on 17 ఏప్రిల్ 2015. Retrieved 12 April 2015.
- ↑ indian soceity of structural engineers- profile of susarla gopalasastry[permanent dead link]
- ↑ "S Gopala Sastry passes away". The Times of India. Retrieved 12 April 2015.
- ↑ Gopala Sastry passes away
- ↑ "Susarla Gopala Sastry Passes Away". Archived from the original on 2016-03-14. Retrieved 2015-08-02.