శోభనాపురం (ఆగిరిపల్లి)

(శోభనాపురము నుండి దారిమార్పు చెందింది)

శోభనాపురం, కృష్ణా జిల్లా, ఆగిరిపల్లి మండలానికి చెందిన గ్రామం.

శోభనాపురము
—  రెవెన్యూ గ్రామం  —
శోభనాపురము is located in Andhra Pradesh
శోభనాపురము
శోభనాపురము
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°42′37″N 80°44′56″E / 16.710331°N 80.748766°E / 16.710331; 80.748766
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఆగిరిపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521211
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర

మార్చు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

మార్చు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

అగిరిపల్లె మండలం

మార్చు

అగిరిపల్లె మండలం మొత్తంతో పాటు పట్టణ పరిధిలో ఉన్న ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

మార్చు

శోభనగిరి లేక శోభనాచలం అను కొండను ఆనుకుని ఉన్న గ్రామం. ఆగిరపల్లి కొండ (శోభనాద్రి) పై వెలసిన శ్రీ శోభనాచలపతి స్వామి వారి పేరు మీదుగా, ఈ గ్రామంనకు ఆ పేరు వచ్చింది.

గ్రామ భౌగోళికం

మార్చు

శోభనాపురం మండల కేంద్రమైన ఆగిరిపల్లికి 5 కిమీ దూరంలో ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో అబ్బూరి హేమలత, సర్పంచిగా ఎన్నికైంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ భవానీ సమేత శ్రీ లింగమేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం):- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

ఇక్కడ ప్రధానంగా వరి సాగు చేస్తారు.

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

ఇక్కడి ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయం.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.

వెలుపలి లంకెలు

మార్చు