శోభనా భర్తియా
శోభనా భర్తియా (Shobhana Bhartia (జ: 1957) హిందుస్తాన్ టైమ్స్ గ్రూపు యొక్క ఎడిటోరియల్ డైరెక్టర్. ఈ పదవి ఈమెకు తండ్రి కృష్ణ కుమార్ బిర్లా తర్వాత వంశపారంపర్యంగా సంక్రమించింది. ఈమె తాతగారు స్థాపించిన బిర్లా ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ సంస్థ ప్రొ-చాన్స్ లర్ గా కూడా ఈమెనే. ఈమె ప్రస్తుత ఎండీవర్ ఇండియా చైర్ పర్సన్. ఈమె అధికారంలోనున్న భారత జాతీయ కాంగ్రెసుకు చాలా సన్నిహితంగా పనిచేస్తూ 2006 - 2012 మధ్య రాజ్యసభకు నామినేట్ చేయబడింది.
శోభనా భర్తియా | |
---|---|
జననం | 1957 జనవరి 4 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | వ్యాపారవేత్త |
పదవీ కాలం | 2006–2012 |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | శ్యాం సుందర్ భర్తియా |
తల్లిదండ్రులు | కృష్ణకుమార్ బిర్లా |
పురస్కారాలు | పద్మశ్రీ |
వ్యక్తిగత జీవితం
మార్చుఈమె తాత జి.డి.బిర్లా; తండ్రి కె.కె.బిర్లా. వీరు ముగ్గురు అక్కాచెల్లెల్లలో శోభనా చిన్నది. ఈమె భర్త శ్యామ్ భర్తియా వ్యాపారవేత్త. వీరికి ఇద్దరు పిల్లలు.
తొలి రోజులు
మార్చుచిన్నతనం నుండి ఢిల్లీలోని హిందుస్తాన్ టైమ్స్ కార్యాలయానికి వెళ్లి, అందులోని వివిధ విభాగాల పనితీరు, యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ అంశాలు తెలుసుకున్నారు. అప్పుడు వాషింగ్టన్ పోస్ట్ యజమాని క్యాథరిన్ గ్రాహమ్తో పరిచయం ఏర్పడి వాషింగ్టన్లో వారం రోజుల పాటు ఆ సంస్థ ఉద్యోగుల పనితీరు గమనించి; తిరిగివచ్చిన తర్వాత 1986లో హిందుస్తాన్ టైమ్స్ లో చేరారు.
పత్రికా జీవితం
మార్చుఢిల్లీకి మాత్రమే పరిమితమైన పత్రికను అభివృద్ధిపథంలో నడిపించింది. ఆదివారం అనుబంధంలో బ్రంచ్ మ్యాగజైన్ ను తీసుకొనివచ్చింది. తర్వాత హెచ్ టీ నెక్స్ట్ ను ప్రారంభించింది. ఈ రెండూ యువ పాఠకుల్ని ఆకట్టుకోవడంతో పత్రికను ఉత్తర భారతదేశంలో ఆరు నగరాలకు విస్తరించారు.
2004లో పత్రికల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి వచ్చినప్పుడు వీరి కంపెనీలో 20 శాతం వాటాను హెండర్సన్ గ్లోబల్ ఇన్‍వెస్టర్స్ కు ఇచ్చారు. దానితో పత్రికను ఆధునీకరించారు. ఆ తర్వాత పబ్లిక్ ఇష్యూ ప్రకటించి నిధులు సమీకరించారు. తర్వాత 2007లో మింట్, ఫీవర్ 104 ఎఫ్.ఎం. రేడియో ప్రారంభించారు.
ఈమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.