సంధ్యారాణి 1960 - 70 దశకాలలో తెలుగు చిత్రాలలో నటించిన సినిమానటి.

సంధ్యారాణి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1965–1974

జీవిత విశేషాలు

మార్చు

ఆమె బెజవాడ వాస్తవ్యురాలు. [1] తను చిన్నతనంలో కొత్తసినిమా వచ్చినప్పుడల్లా ఆమె అందులో బాగా నచ్చిన వేషాన్ని ఇంట్లో తన కుటుంబ సభ్యుల ఎదుట ప్రదర్శించేది. అందరూ మెచ్చుకునేవారు. ఆమె 1965లో తేనె మనసులు చిత్రంలో చిత్రసీమలోకి ప్రవేశించింది. ఈ చిత్రంతో బాబూ మూవీస్ డైరెక్టర్ , టెక్నీషియన్ల ద్వారా శిక్షణ పొందింది. వారు ఆమె నటనలోని లోపాలను తెలియజేసి నటనలో శిక్షణనిచ్చారు. ఈ సినిమాలో "సీత" పాత్ర ద్వారా తెలుగు సినిమాలో అందరికీ సుపరిచితురాలైంది.[2] ఈ చిత్రంలో కథానాయకుడు ఘట్టమనేని కృష్ణ. అతనికి కూడా ఇది తొలి చిత్రం. ఈ సినిమా విజయవంతమైంది.[3]

సినిమాల జాబితా

మార్చు

ఈమె నటించిన కొన్ని తెలుగు సినిమాలు:

మూలాలు

మార్చు
  1. "50 ఏళ్ల తేనెమనసులు". Sakshi. 2015-03-29. Retrieved 2020-07-26.
  2. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-07-26.
  3. "కృష్ణ తొలి చిత్రానికి 55 ఏళ్లు.. మహేశ్‌ కామెంట్‌". www.eenadu.net. Retrieved 2020-07-26.
  4. ఐ.ఎం.డి.బి.లో తేనెమనసులు
  5. Vadlmudi, Raghu (2015-03-30). "50 Years For Super Star Krishna Thene Manasulu Movie". TeluguStop.com. Retrieved 2020-07-26.

బయటిలింకులు

మార్చు