శ్రీధన్య (జననం 1983 మార్చి 17) భారతీయ నటి, టెలివిజన్ హోస్ట్ కూడా. ఆమె ప్రధానంగా మలయాళం భాషా చిత్రాలు, టెలివిజన్ షోలలో పనిచేస్తుంది.

శ్రీధన్య
జననం (1983-03-17) 1983 మార్చి 17 (వయసు 41)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, టీవి షో హోస్ట్

ఈటీవీలో 2023 నుంచి ప్రసారమవుతున్న మా అత్త బంగారం ధారావాహికలో సరస్వతి పాత్రతో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.

కెరీర్

మార్చు

శ్రీధన్య అమృత టీవీ ప్రసారం చేసిన సమాంతరం కార్యక్రమంలో యాంకర్‌గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. దీనికి ముందు, ఆమె జీవన్ టీవీలో ఒక టాక్ షో చేసింది. ఆమె వైద్యశాల, వీడు, గృహతురం వంటి అనేక కార్యక్రమాలను హోస్ట్ చేసింది.

ఆమె గాయత్రి అనే పేరుతో జ్ఞాన్ సంవిధానం చేయుమ్‌ అనే చిత్రంలో ప్రధాన పాత్రను పోషించింది.[1] అయితే, దీనికి ముందు ఆమె అనేక చిత్రాలలో సహాయక పాత్రలలో నటించింది.

ఆమె ఆమి (2018) చిత్రానికి విద్యాబాలన్కి మలయాళ ట్యూటర్‌గా పనిచేసింది.[2][3][4] 2017లో, ఆమె కైరలి టీవీలో భాగ్యలక్ష్మిహోస్ట్‌ చేస్తున్న సెల్ఫీ షోని శ్రీధన్య ముందుకుతీసుకెళ్లింది.[5]

టీవి, సినిమారంగాల్లోనే కాకుండా ఆమె అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, వైభవ్ జ్యువెలర్స్, సుజాత మిక్సీ వంటి వాణిజ్య ప్రకటనల్లోనూ చేసింది.

అవార్డులు

మార్చు
సంవత్సరం పురస్కారం కేటగిరి ఫలితం ధారావాహిక/సినిమా
2012 కేరళ రాష్ట్ర టెలివిజన్ అవార్డులు ఉత్తమ యాంకర్ విజేత గృహతురం
2014 జేసీ ఫౌండేషన్ అవార్డు ఉత్తమ యాంకర్ విజేత గృహతురం
2017 మలయాళ పురస్కారం ఉత్తమ యాంకర్ విజేత సెల్ఫీ
2022 ఆసియానెట్ టెలివిజన్ అవార్డులు ఉత్తమ సహాయ నటి నామినేట్ చేయబడింది కూడెవిడే
2022 ఆసియానెట్ టెలివిజన్ అవార్డులు ఉత్తమ సహాయ నటి (జ్యూరీ) విజేత కూడెవిడే

మూలాలు

మార్చు
  1. "Balachandra Menon was apprehensive". The Times of India. 8 September 2015. Retrieved 4 December 2023.
  2. Manu, Meera (2 October 2016). "Vidya Balan's teacher – in real life". Deccan Chronicle.
  3. "Vidya Balan's Mallu connection". The Times of India.
  4. "Unprofessional and unethical: Kamal on Vidya quitting Kamala Das biopic". 13 January 2017.
  5. Nagarajan, Saraswathy (14 May 2015). "A selfie of society". The Hindu.
"https://te.wikipedia.org/w/index.php?title=శ్రీధన్య&oldid=4298853" నుండి వెలికితీశారు