శ్రీనాథ రత్నశిల్పి వుడయార్

ప్రముఖ శిల్పి, చిత్రకారుడు

దేవగుప్తపు శ్రీనాథ రత్నశిల్పి వుడయార్ (1938 జనవరి 26 - 2003 జూన్ 23) ప్రముఖ శిల్పి, చిత్రకారుడు.

దేవగుప్తపు శ్రీనాథ రత్నశిల్పి వుడయార్
జననం(1938-01-26)1938 జనవరి 26
నత్తా రామేశ్వరం, పశ్చిమగోదావరి, ఆంధ్రప్రదేశ్
మరణం2003 జూన్ 23
జాతీయతభారతీయుడు
భార్య / భర్తలక్ష్మీకాంతం
తండ్రిసత్యలింగ వుడయార్
తల్లిభద్రమాంబ

బాల్యం

మార్చు

1938 జనవరి 26 పశ్చిమగోదావరి జిల్లా నత్తా రామేశ్వరంలో జన్మించారు. దేవగుప్తపు సత్యలింగ వుడయార్, భద్రమాంబ తల్లిదండ్రులు. వుడయార్ బి.ఏ. డిగ్రీ వరకు భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజి లో చదువుకుని, అనంతరం 1959లో కలకత్తాలోని విశ్వకవి రవీంద్రుడు స్థాపించిన (శాంతినికేతన్) విశ్వభారతి విశ్వవిద్యాలయం లో చేరి, పద్మభూషణ్ నందలాల్ బోస్, రాంకింకర్ జైన్, పద్మశ్రీ రాధాచరణ బక్షి వంటి ఉద్దండులైన గురువుల వద్ద చిత్ర, శిల్పకళలు అభ్యసించి ఫైన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో డిప్లొమా పొందారు.

కళా సృజన

మార్చు

అన్నీ ఉన్నాయ్... ప్రాణమొక్కటే తక్కువ అన్నంత సజీవంగా ఉంటాయి ఆయన శిల్పాలు. వుడయార్ శిల్పాలు విశిష్టంగా రూపొందటానికి ప్రధాన కారణం - ఆయా చిత్రికాంశాలపట్ల ఆయనకున్న అవగాహన, మానవదేహాన్ని అత్యంతాకర్షణీయంగా, వాస్తవికంగా రూపొందించటమే. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో వుడయార్ ఆకాడెమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పేరుతో శిల్ప కళాశాలను స్థాపించి, ఆధునిక యుగంలో అతిప్రాచీనమైన శిల్పకళ అంతరించి పోకుండా ఎందరికో శిల్పకళలో శిక్షణ ఇచ్చారు. నాలుగు దశాబ్దాలు పాటు శిల్పరచన కొనసాగించి ఎన్నో కోవెలలు, వేలాది జాతీయ నాయకుల ప్రతిమలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. చిత్ర శిల్పకళల రెండింటిలోనూ ప్రాక్పశ్చిమ శైలిలో సమానంగా కళారచన చేయగల దిట్ట అయిన వీరికి విదేశీ పర్యటనావకాశం లభించగా జపాన్, టిబెట్, నేపాల్, భూటాన్, చైనా, శ్రీలంక, ఇండోనేషియా, మంగోలియా, అమెరికా దేశాలు పర్యటించి అక్కడి శిల్పకళా నైపుణ్యాలను పరిశీలించి శాంతినికేతన్ ప్రతిష్ఠను మరింత ఇనుమడింది చేసారు.

రూపొందించిన శిల్పాలు

మార్చు

1986లో హైదరాబాద్ లోని టాంక్ బండ్ పై అన్నమాచార్యుని కాంస్య విగ్రహాన్ని రూపొందించి అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రశంసలందుకున్నారు.

పురస్కారాలు

మార్చు
  1. పండిట్ నెహ్రూ, డా. బాబూ రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, ఎలిజబెత్ రాణి, కుముద్ బెన్ జోషిలచే ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు.
  2. అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్శిటీ నుండి డాక్టరేట్ ను అందుకున్నారు.
  3. వీరి కళానైపుణ్యానికి తార్కాణంగా ఇండియన్ మైఖేలేంజిలో, శిల్పకళా సార్వభౌమ, ఆచార్య శిల్పశ్రీ, శిల్ప సరస్వతి, అభినవ మయబ్రహ్మ, వాస్తు విశారద వంటి బిరుదులు వరించాయి.

2003 జూన్ నెల 23వ తారీకు సాయంత్రం హైదరాబాదు లో గుండెపోటుతో మృతిచెందారు.

కళా వారసత్వం

మార్చు

వీరి కుమారులు రాజ్ కుమార్ వుడయార్, హరేంద్రనాథ్ వుడయార్, కుమార్తె దేవికారాణి వుడయార్ తండ్రి కళా వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.