శ్రీమంతులు (1968 సినిమా)

శ్రీమంతులు కల్పనాలయ బ్యానర్‌పై టి.ఆర్.రామన్న దర్శకత్వంలో వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది 1968, నవంబర్ 22న విడుదలయ్యింది.[1] 1964లో వచ్చిన పనక్కర కుడుంబం అనే తమిళ సినిమాను శ్రీమంతులు పేరుతో తెలుగులోనికి డబ్ చేశారు. ఇదే సినిమా 1984లో ఇంటిగుట్టు పేరుతో పునర్మించారు.

శ్రీమంతులు
సినిమా పోస్టర్
దర్శకత్వంటి.ఆర్.రామన్న
రచనటి.కె.కృష్ణమూర్తి
తారాగణం
ఛాయాగ్రహణంఎం.ఎ.రహ్మాన్
కూర్పుఎం.ఎస్.మణి
పి.ఎల్.మణి
సంగీతంవిశ్వనాథన్ - రామమూర్తి,
టి.చలపతిరావు
నిర్మాణ
సంస్థ
కల్పనాలయ
విడుదల తేదీ
1968 నవంబరు 22 (1968-11-22)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

సంక్షిప్త కథ మార్చు

భూషయ్య తను ప్రేమించిన భార్యను వదిలి ధనాశపరుడై మరో భార్య వెంకమ్మను కట్టుకున్నాడు. ఆమె, ఆమె తమ్ముడు రంగడు అతడిని నానా యాతన పెట్టారు. మొదటి భార్య కూతురు రాణి తన ఆఫీసులోనే పనిచేస్తున్నా తనను నాన్నా అని పిలవద్దంటాడు. రాణి ప్రేమించిన రామును పిలిచి రాణిని పెళ్ళి చేసుకోవద్దంటాడు. రాము రాణిని తిరస్కరించగా అపార్థం చేసుకుని రాణి అతడిని నిందిస్తే రాము కుమిలిపోతాడు. రాము చెల్లెలు రాము మిత్రుడిని పెళ్ళి చేసుకుంటుంది. చివరకు రాణి చనిపోయిందనుకున్న తన తల్లిని కలుసుకుంటుంది. రంగడితో జరగనున్న రాణి పెళ్ళి ఎలా భగ్నమౌతుంది, రాము, రాణి తిరిగి ఎలా కలిసిపోతారు, భూషయ్య రెండవభార్యకు, రంగడికీ ఎలా శాస్తి జరిగింది అనే ప్రశ్నలకు సమాధానం పతాక సన్నివేశంలో తెలుస్తాయి.[2]

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Srimanthulu (T.R. Ramanna) 1968". ఇండియన్ సినిమా. Retrieved 9 December 2022.
  2. సమీక్షకుడు - చిత్రజ్యోతి (24 November 1968). "చిత్రసమీక్ష:శ్రీమంతులు" (PDF). ఆంధ్రజ్యోతి. Archived from the original (PDF) on 9 డిసెంబర్ 2022. Retrieved 9 December 2022. {{cite news}}: Check date values in: |archive-date= (help)