శ్రీ వళ్లీ కళ్యాణం
శ్రీ వళ్లీ కళ్యాణం 1962, మార్చి 18న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ పౌరాణిక చిత్రానికి టి.ఆర్.రామన్న దర్శకత్వం వహించాడు.
శ్రీ వళ్లీ కళ్యాణం (1962 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.ఆర్.రామన్న |
---|---|
తారాగణం | శివాజీ గణేశన్, పద్మిని, రాగిణి, టి.ఆర్. మహాలింగం |
సంగీతం | టి.చలపతిరావు |
గీతరచన | శ్రీశ్రీ |
సంభాషణలు | శ్రీశ్రీ |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- శివాజీగణేశన్
- టి.ఆర్.మహాలింగం
- చంద్రబాబు
- రాజగోపాల్
- సహదేవన్
- సి.కె.సరస్వతి
- బేబీ ఉమ
- అంబికా సుకుమారన్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకుడు: టి.ఆర్.రామన్న
- పాటలు, మాటలు: శ్రీశ్రీ
- సంగీతం: టి.చలపతిరావు
- ఛాయాగ్రహణం: కె.హెచ్.కపాడియా, బాబూరావు ఉదౌసి
పాటలు, పద్యాలు
మార్చుఈ సినిమాలోని పాటలను ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది, పి.సుశీల, ఎస్.జానకి, పి.కె.సరస్వతి, టి.జి.కమల తదితరులు పాడారు.[1]
క్ర.సం. | పాట | పాడినవారు |
---|---|---|
1 | ఇంతటి దైవమై అభయమీయవో మా కిక (పద్యం) | ఎస్.జానకి |
2 | ఎంత ధైర్యం ఎంత ధైర్యం ఏనుగును చూడగానే | పి.బి.శ్రీనివాస్ |
3 | కారుదున్న గొడుగునీడ కందిరీగ మేలమాడ | ఎస్.జానకి |
4 | కొనియాడవే మదిని లలనా నీకు అనువైన మన్మధుని | ఘంటసాల |
5 | గిరిధరములందు సమస్త తరళ నిర్జ్రములందు (పద్యం) | మాధవపెద్ది |
6 | వచ్చాడే బావయ్య వానరమల్లె పూల పల్లకినెక్కి | పి.కె.సరస్వతి బృందం |
7 | తగ్గాలి తగ్గాలి తాతయ్య మీకు స్వాముల వేషము చాలయ్య | ఎస్.జానకి |
8 | తరువులందు సమస్త సాగరములందు అగ్ని యందు (పద్యం) | మాధవపెద్ది |
9 | దాహం తగ్గింది దాహం తగ్గింది సత్యమే కాని మొహం | పి.బి.శ్రీనివాస్ |
10 | మా జాతి వీర జాతి విలుదాల్చు కోయజాతి | ఎస్.జానకి బృందం |
11 | మరదలికోసం వచ్చారే బావయ్యగారు ఒక మాయలేడిని | పి.కె.సరస్వతి బృందం |
12 | పారుబోతు పరిగేలరా మదం పట్టిన గువ్వల్లారా | ఎస్.జానకి |
13 | జ్ఞాన ఫలమే జ్ఞాన ఫలమే విజ్ఞాన ఫలమే | ఘంటసాల బృందం |
14 | చిన్ని చిన్ని గువ్వల్లారా చిన్నారి పిట్టల్లారా జొన్న పైరుల కేసి | పి.సుశీల బృందం |
15 | విఘ్ననాయక విలంబము చేయక రావే సాయమున్ (పద్యం) | పి.బి.శ్రీనివాస్ |
16 | ఓం శరవణ భవ ఓం శరవణ భవ.. ఓ షణ్ముఖా పల్కరాదో | పి.సుశీల బృందం |
17 | ఆనందకరమైన ఈనాడే సుభలీల కలసితిమే | పి.బి.శ్రీనివాస్, టి.జి.కమల |
18 | అయ్యో బావ వచ్చావా అరె అలాపోయి నిల్చావా | అప్పారావు |
19 | సమ్మతి కోరితిరా నిన్ సన్నుతి జేసెదరా షణ్ముఖా | ఘంటసాల బృందం |
20 | మోహనమూర్తివిరా నినుగన ముచ్చటపడితినిరా స్వామి | ఘంటసాల బృందం |
21 | తామరాకుపై నీటి బిందువై తనరు బ్రతుకు శాశ్వతమా | పి.బి.శ్రీనివాస్ |
22 | హాయ్ గూర్చు బాల అనురాగ గానలోల అలరారు | పి.బి.శ్రీనివాస్ |
కథ
మార్చునంబిరాజు సుబ్రహ్మణ్యస్వామి భక్తుడు. ఒకరోజున రాజు వేటకు వెళ్లి జింక రక్షిస్తున్న ఒక ఆడశిశువును చూస్తాడు. విస్మయానందాలతో ఇంటికి తీసుకువెడతాడు. వళ్లి అని పేరుపెడతాడు. అల్లారుముద్దుగా ఆమె పెరుగుతుంది. ఆటవస్తువులు చూపించగా స్వామి ప్రతిమకోసమే చెయ్యిచాపుతుంది. పెద్దదైన కొద్దీ సుబ్రహ్మణ్యేశ్వరునకు తానే ఇల్లాలు కావాలని కోరుకునేది. ఈ ప్రేమను చూసి నంబిరాజు విచారించి పరిసరాలమార్పు ఆమెలో భావపరివర్తన కలిగించ వచ్చుననే ఆశతో జొన్నచేలున్న పల్లెసీమకు పంపిస్తాడు. తోడుగా ఆమె సహోదరులను కూడా పంపిస్తాడు. కలహభోజనుడు నారదుడు శ్రీవల్లికి సుబ్రహ్మణ్యేశ్వరునికి తగిన అర్దాంగినవి నువ్వేనని చెబుతాడు. తిన్నగా కైలాసానికి వెళ్లి అక్కడ ఆమె అందచందాలను వర్ణించి, స్వామిని ఆమె మనసారా వరించిందని చెబుతాడు.
సుబ్రహ్మణ్యస్వామి తనయెడల వళ్లికి గల భక్తిశ్రద్ధలను పరీక్షించడంకోసం వేటగాని రూపంలో వస్తాడు. వళ్లిని కలుసుకొని ఆమె సౌందర్యానికి ముగ్ధుడవుతాడు. ఆ వేటగాడే తాను వలచిన స్వామి అని తెలియని వళ్లి భయపడి తన తండ్రిని, సోదరులను పిలుస్తుంది. వారు వచ్చేసరికి స్వామి మహావృక్షరూపం ధరిస్తాడు. తిరిగి వేటగాని రూపం ధరించిన సుబ్రహ్మణ్యేశ్వరునకు వళ్లి చెలికత్తెలు తగిన శాస్తి చేస్తారు.
నారదుడు స్వామిని వృద్ధుని రూపం ధరించి ప్రయత్నించు, మరోసారి ప్రయత్నించు అని ప్రోత్సహిస్తాడు.
వృద్ధుని రూపంలో ఉన్న స్వామి మహనీయుడని తలంచిన నంబరాజు ఆయనను తన ప్రాసాదానికి గొనివచ్చి పరిచర్యకు వళ్లినే నియమిస్తాడు.
నారదుడు స్వామిని కలుసుకుని అన్నగారైన గణనాథుని ఆశీర్వాదం పొందకుండా ప్రణయంలో పడ్డందుకు అన్నీ విఘ్నాలే కలుగుతున్నయని అన్నని ప్రార్థించి ప్రసన్నుని చేసుకొమ్మని చెబుతాడు. విఘ్నేశ్వరుడు గజరూపం ధరించివచ్చి వళ్లిని కొండమీదనుండి క్రిందకు విసిరివేస్తాడు. సుబ్రహ్మణ్యస్వామి కొండ దిగువన తాను ఉండి రక్షిస్తాడు. వళ్లికి మాత్రమే నిజరూపంలో ఇతరులకు వృద్ధుని రూపంలో స్వామి కనిపించడంతో వళ్లి మాటలు అర్థం కాక నంబిరాజు ఆమెను ఖైదు చేస్తాడు. సహస్రజ్యోతుల కాంతితో స్వామివచ్చి ఆమెను నిర్భందవిముక్తను చేసి తనతో కొనిపోతాడు. నంబిరాజు యుద్ధానికి వస్తాడు. ఆగ్రహోదగ్రుడైన స్వామి షణ్ముఖాలతో విశ్వరూపం ధరిస్తాడు. నంబిరాజుకు విషయం తెలిసి వళ్లిని సుబ్రహ్మణ్యస్వామికి ఇచ్చి వివాహం చేయడంతో కథ సుఖాంతమౌతుంది[2].
మూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "శ్రీ వళ్ళీ కల్యణం - 1962 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 21 ఫిబ్రవరి 2020. Retrieved 21 February 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ రాధాకృష్ణ (25 March 1962). "చిత్ర సమీక్ష - శ్రీ వళ్లీ కళ్యాణం". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 21 February 2020.[permanent dead link]