శ్రీ సింహాచల క్షేత్ర మహిమ
1965 సినిమా
శ్రీ సింహాచల క్షేత్ర మహిమ 1965 లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఇది సింహాచలం లో వెలసిన శ్రీ నరసింహ క్షేత్రం యొక్క మహిమా విశేషాలను చిత్రీకరించింది.
శ్రీ సింహాచల క్షేత్ర మహిమ (1965 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.వి.ప్రసాద్ |
---|---|
కథ | బి.వి.ప్రసాద్ |
తారాగణం | కాంతారావు, కృష్ణకుమారి |
సంగీతం | టి.వి.రాజు |
గీతరచన | రాజశ్రీ |
సంభాషణలు | రాజశ్రీ |
నిర్మాణ సంస్థ | శ్రీ సరస్వతి మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- పురూరవుడిగా కాంతారావు
- కృష్ణకుమారి
- చిత్తూరు నాగయ్య
- ఇంద్రుడిగా రాజనాల
- రేలంగి
- గిరిజ
- నారదుడిగా చలం
పాటలు
మార్చు- సింహాచలము మహా పుణ్యక్షేత్రము - గానం ఘంటసాల బృందం; రచన : రాజశ్రీ
- అందాల ఓ సుందరా అనురాగభావ రసకేళివిహారా - పి.సుశీల, ఎస్. జానకి
- ఒప్పులకుప్పా వయ్యారి భామా మగాడు పిలిచాడే - పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత బృందం
- ఓహొ ఏలికా ఇదే వేడుక ఈ వసంత వినోదాలు నీకు కానుక - పి.సుశీల బృందం
- ఓ దేవా వరాహముఖా నృసింహశిఖా దయమయా నన్నిక - ఎస్.జానకి
- చిన్నారి పొన్నారి వెన్నెలరాశి జోజో బాబూ అదిగో బూచి - ఎస్.జానకి
- జయహే మోహనరూపా గానకలాపా ఆదిస్వరూపా - పి.బి. శ్రీనివాస్
- నీలాటి రేవుకాడ నేరేడు చెట్టునీడ ఆనాడు నాతో చేరి - ఎల్. ఆర్. ఈశ్వరి
- బాబూ బిరాన కనుపించరా కనుపించి నా బాధ తొలగించరా - ఎస్. జానకి
- భక్తశిఖామణి ప్రహ్లాదు కరుణించి ఆవిర్భివించిన (పద్యం) - ఘంటసాల - రచన: రాజశ్రీ
- రావోయి రాజా కనరావోయి రాజా చెలి నేరాలు మన్నించ - ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్
- హాయిగా ఎదో తీయగా నా కలలే పండగా ఈరోజే పండుగ - పి.సుశీల
మూలాలు
మార్చు- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.