షఫ్కత్ రానా

పాకిస్తానీ మాజీ క్రికెటర్

షఫ్కత్ రానా (జననం 1943, ఆగస్టు 10) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1964 నుండి 1969 వరకు ఐదు టెస్టుల్లో ఆడాడు.

షఫ్కత్ రానా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షఫ్కత్ రానా
పుట్టిన తేదీ (1943-08-10) 1943 ఆగస్టు 10 (వయసు 80)
సిమ్లా, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
బంధువులుఅజ్మత్ రానా (సోదరుడు)[1]
షకూర్ రానా (సోదరుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 46)1964 అక్టోబరు 24 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1969 నవంబరు 8 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 5 107
చేసిన పరుగులు 221 4947
బ్యాటింగు సగటు 31.57 35.33
100లు/50లు -/2 9/25
అత్యధిక స్కోరు 95 174
వేసిన బంతులు 36 1091
వికెట్లు 1 16
బౌలింగు సగటు 9.00 35.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - -
అత్యుత్తమ బౌలింగు 1/2 2/8
క్యాచ్‌లు/స్టంపింగులు 5/- 83/-
మూలం: Cricinfo, 2012 అక్టోబరు 26

క్రికెట్ రంగం మార్చు

షఫ్కత్ రానా కుడిచేతి బ్యాట్స్‌మన్ గా డ్రైవ్ అండ్ కట్‌లో అడుతాడు. ఆరేళ్ళలో ఐదు టెస్టులు ఆడాడు.[2] 1969లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో తన అత్యధిక టెస్ట్ స్కోరు 95ను నమోదు చేశాడు. ఇది మూడు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్‌కు అత్యధిక స్కోరు కూడా. మూడో టెస్టులో 65 పరుగులు కూడా చేశాడు.[3][4]

1959-60లో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. 1963లో పాకిస్థాన్ ఈగలెట్స్‌తో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటించాడు. 1964-65లో పాకిస్థాన్ జట్టుతో కలిసి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించాడు. 18.20 సగటుతో 182 పరుగులు చేశాడు. 1971లో ఇంగ్లండ్‌లో పర్యటించాడు, 17.53 సగటుతో 228 పరుగులు చేశాడు. 1978-79లో తన చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు. 1968-69లో లాహోర్‌లో జరిగిన క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో సర్గోధాపై లాహోర్ తరఫున అతని అత్యధిక స్కోరు 174, అతను వకార్ అహ్మద్‌తో కలిసి నాల్గవ వికెట్‌కు 330 పరుగులు చేశాడు.[5]

మూలాలు మార్చు

  1. "From Daud to Dar: | Sports | thenews.com.pk". www.thenews.com.pk.
  2. Shafqat Rana at Cricinfo
  3. R. T. Brittenden, "New Zealand in India and Pakistan, 1969", Wisden 1971, pp. 850–64.
  4. "New Zealand in Pakistan, 1969-70". Cricinfo. Retrieved 7 April 2021.
  5. "The Home of CricketArchive". cricketarchive.com.

బాహ్య లింకులు మార్చు