షాదన్ వైద్య విజ్ఞాన సంస్థ

తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు సమీపంలోని రంగారెడ్డిలో ఉన్న వైద్య కళాశాల.

షాదన్ వైద్య విజ్ఞాన సంస్థ (షాదన్ మెడికల్ కళాశాల) తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు సమీపంలోని రంగారెడ్డిలో ఉన్న వైద్య కళాశాల.[1][2] భారత వైద్య మండలి అనుమతితో 150 వైద్యసీట్లతో ఉన్న ఈ సంస్థ, విద్యార్థులకు ప్రపంచస్థాయి వైద్య శిక్షణ అందించడంకోసం 800 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి జతచేయబడింది.[3] ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. దీనికి భారత ప్రభుత్వం గుర్తింపు కూడా లభించింది.[4]

షాదన్ వైద్య విజ్ఞాన సంస్థ
వైద్యవిద్య ఆసుపత్రి, పరిశోధన సంస్థ
షాదన్ వైద్య విజ్ఞాన సంస్థ భవనం
రకంప్రైవేటు మైనారిటీ సంస్థ
స్థాపితం2003
చైర్మన్డాక్టర్ మహమ్మద్ విజారత్ రసూల్ ఖాన్
డీన్ప్రొ. (డా.) దినేష్ రాజ్ మాథూర్
అండర్ గ్రాడ్యుయేట్లు150
స్థానంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
కాంపస్హిమాయత్‌సాగర్ రోడ్, హైదరాబాదు
అనుబంధాలుకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
జాలగూడుwww.shadan.in/aboutsims.html

నిర్వహణ

మార్చు

షాదన్ వైద్య విజ్ఞాన సంస్థ వైద్యవిద్య, పరిశోధన సంస్థ షాదన్ ఎడ్యుకేషనల్ సొసైటీచే స్థాపించబడి, నిర్వహించబడుతోంది. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ చట్టం 1350 ఫస్లీ ప్రకారం 1985లో డాక్టర్ మహమ్మద్ విజారత్ రసూల్ ఖాన్ దీనిని స్థాపించాడు. ఇతను ఉస్మానియా వైద్య కళాశాల నుండి వైద్యవిద్యను అభ్యసించి, డాక్టర్‌గా ప్రాక్టీస్ చేశాడు. 1984, 1989లలో రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా (ఎమ్మెల్యే) పనిచేశాడు.

సంస్థ కార్యవర్గం

మార్చు
  • షాదన్ టెహ్నియత్ (కార్యదర్శి)
  • మహ్మద్ షా ఆలం రసూల్ ఖాన్ (చైర్మన్)
  • అజాజ్ ఉర్ రెహ్మాన్ (వైస్ చైర్మన్)
  • డాక్టర్ మహ్మద్ సరిబ్ రసూల్ ఖాన్ (మేనేజింగ్ డైరెక్టర్)
  • ప్రొ. (డా.) దినేష్ రాజ్ మాథూర్ (ప్రొఫెసర్, డీన్)[5]
  • డాక్టర్ వసంత ప్రసాద్, రిటైర్డ్ డిఎంఇ - ఎపి (హాస్పిటల్ సూపరింటెండెంట్)

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Shadan Institute of Medical Sciences - Peerancheru Ranga Reddy Dist, Telangana medicine - INST-SIMS-P Archived 2017-08-16 at the Wayback Machine. minglebox. Retrieved on 2020-09-21
  2. Shadan Institute of Medical Sciences Rangareddy. Highereducationinindia.com. Retrieved on 2020-09-21
  3. Shadan Institute of Medical Science, Himayatsagar Road, Rangareddy (Dist), AP Archived 2017-08-16 at the Wayback Machine. Andhradesh.com (2009-10-18). Retrieved on 2020-09-21
  4. http://www.highereducationinindia.com/institutes/shadan-institute-of-medical-sciences-701.php
  5. Telangana Today, Hyderabad (5 April 2018). "Graduation ceremony held at Shadan Institute of Medical Sciences". Archived from the original on 21 September 2020. Retrieved 21 September 2020.

ఇతర లంకెలు

మార్చు