భారతదేశంలో విద్య
| ||
విద్య పర్యవేక్షణ మానవ వనరుల అభివృద్ధి మంత్రి
|
మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రకాష్ జవదేకర్ | |
భారతీయ విద్యా బడ్జెట్ • ఇచ్ఛాపూర్వకమైన •విధిగా |
Rs.24,115 కోట్లు (2006-07) ? ? | |
విద్య కొరకు ప్రాథమిక భాషలు | ఆంగ్లం, ఇతర ప్రాంతీయ భాషలు | |
అక్షరాస్యత (2001) • పురుషులు • స్త్రీలు |
64.8 % 75.3 % 53.7 % | |
నమోదు1 (2001-02) • ప్రాథమిక (I-V) • మాధ్యమిక/ప్రాథమికోన్నత (VI-VIII) • ఉన్నత విద్య (IX-X) |
18.92 కోట్లు 11.39 కోట్లు 4.48 కోట్లు 3.05 కోట్లు | |
1. వీటిలో శిశుబాల విద్య నమోదాలు లేవు. |
భారతదేశంలో విద్య వేల సంవత్సరాల పూర్వంనుండి తన వైభవాన్ని కలిగి ఉంది. ప్రాచీన కాలంలో నలంద, తక్షశిల మొదలగు విశ్వవిద్యాలయాలను పరిశీలిస్తే, భారత్ లో విద్య, విజ్ఞానము సర్వసాధారణమని గోచరిస్తుంది. నేడు, ఐఐటీ లు, ఐఐఎస్ లు, ఐఐఎమ్ లు, ఏఐఐఎమ్ఎస్, ఐఎస్ బిలు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినవి. భారతదేశంలో విద్య, 100% సాధించేందుకు ఓ సవాలుగా తీసుకొని ముందుకు పోతూ ఉంది. భారతదేశంలో అవిద్య లేదా నిరక్షరాస్యత అభివృద్ధికి పెద్ద అడ్డుగోడలా తయారైంది. నిరక్ష్యరాస్యతకు పేదరికం జీవాన్నిస్తూవుంది. పేదరికం, సామాజిక అసమతుల్యతల మూలంగా, సహజవనరులను సరైన ఉపయోగించే విధానాలు లేక, విద్యకొరకు అతితక్కువ బడ్జెట్ కేటాయించడంవల్ల, ప్రాథమిక విద్య పట్ల నిర్లక్ష్య వైఖరి వలన, నిరక్ష్యరాస్యత వెక్కిరిస్తూవున్నది. కేరళ లాంటి రాష్ట్రాలలో అక్షరాస్యత స్థితులను చూసి భారతదేశంలో విద్య పట్ల కొంచెం ఆశ చిగురిస్తుంది. భారత్ లో మానవవనరుల అభివృద్ధి శాఖ, ఉన్నత విద్యా శాఖ, పాఠశాల విద్య మున్నగు శాఖలు విద్య కొరకు పాటుపడుతున్న సంస్థలు. విద్య కొరకు, సరైన పెట్టుబడులు, బడ్జెట్ లు లేని భారత్, ఇతరదేశాలనుండి, నేరుగా పెట్టుబడులు ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది.[1]
రూపు రేఖలుసవరించు
భారతదేశంలో విద్యావిధానంలో వివిధ స్థాయిలు ఉన్నాయి. అవి, నర్సరీ (శిశు), ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల, గ్రాడ్యుయేషన్ మరియు పోస్టు గ్రాడ్యుయేషన్. ఇంకనూ 3 సంవత్సరాల పాలిటెక్నిక్ సాంకేతిక విద్యా డిప్లొమాలు.
ప్రధానంగా భారతదేశంలో 10+2+3 విద్యా విధానము అమలు పరచ బడుతోంది. 10 అనగా పదవతరగతి వరకు ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలవిద్య, +2 అనగా ఇంటర్మీడియట్ విద్య, +3 అనగా పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) విద్య. చట్ట ప్రకారం 6-14 సంవత్సరాల బాలబాలికలకు విద్య తప్పనిసరి.
- ప్రాథమిక విద్య : 1 నుండి 5 తరగతులు (ప్రాథమిక పాఠశాల), 6 నుండి 11 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు విద్య నభ్యసిస్తారు.
- ప్రాథమికోన్నత విద్య : 1 నుండి 7 తరగతులు (6 మరియు 7 తరగతులు) (ప్రాథమికోన్నత పాఠశాల), 6 నుండి 13 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు విద్య నభ్యసిస్తారు.
- ఉన్నత పాఠశాల విద్య : 6 నుండి 10 తరగతులు (ఉన్నత పాఠశాల), 11 నుండి 16 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు విద్య నభ్యసిస్తారు.
- ఇంటర్మీడియట్ విద్య, 11, 12 తరగతులు. 17 నుండి 18 సంవత్సరాల వయస్సుగల బాలబాలికలు.
ఇవియే గాక, సాంకేతిక విద్యాసంస్థలు, కళాశాల లు, విశ్వవిద్యాలయాలు గలవు.
భారత్ లో ప్రధాన పద్ధతి: పాఠశాలలను నియంత్రించు సంస్థలు:
- ఉన్నత పాఠశాల విద్యాశాఖ, భారత్ లో అత్యధికంగా విద్యార్థులు ఇందులో నమోదవుతున్నారు.
- ఉన్నత పాఠశాల కేంద్రీయ విద్యా సంస్థ (CBSE)
- భారతీయ పాఠశాల విద్య పరీక్షల మండలి (CISCE)
- నేషనల్ ఓపెన్ స్కూల్ మరియు
- అంతర్జాతీయ పాఠశాలలు.
పైన ఉదహరించబడిన సంస్థలు తమ తమ విద్యావిధానాలననుసరించి పాఠ్యప్రణాళిక లను కలిగి ఉన్నాయి. ప్రభుత్వ సరికొత్త సర్వేల ప్రకారం (NUEPA, DISE, 2005-6 చేపట్టినది), భారత్ లో 1,124,033 పాఠశాలలు గలవు.
శిశు (పూర్వ ప్రాథమిక) విద్యసవరించు
పూర్వ ప్రాథమిక విద్య, రాజ్యాంగ పరమైన హక్కు కాదు. ఈ విద్యను అతి తక్కువ శాతం మాత్రం పొందుతున్నారు. ఈ రకపు విద్యలో నర్సరీ విద్య, లోయర్ కిండర్ గార్టెన్ (ఎల్.కే.జీ.), అప్పర్ కిండర్ గార్టెన్ (యూ.కే.జీ.) తరగతులు గలవు. ఈ విద్యా విధానం ఆంగ్లేయుల విద్యా విధానం. భారత విద్యా విధానంలో "శిశు అభివృద్ధికి సమీకృత సేవలు" (Integrated Child Development Services (or ICDS) ), వీటిలో అంగన్ వాడి, బాలవాడి విద్యా విధానాలు చూడవచ్చు. ఈ అన్ని విధానాలలోనూ ఆటల ద్వారా విద్య (ప్లేవే మెథడ్) ఆధారంగా పిల్లలకు ప్రాథమిక విద్య కొరకు తయారు చేస్తారు.
ప్రాథమిక విద్యసవరించు
8వ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యోద్దేశ్యం ప్రాథమిక విద్యను సార్వత్రీకరణం ("Universalisation") చేయడం. అనగా ప్రాథమిక విద్యను పిల్లలందరికీ అందజేయడం. మరియు పిల్లలందరూ ప్రాథమిక విద్యను తప్పనిసరిగా పొందేటట్లు చేసి అక్షరాస్యతను పెంపొందించి దేశ పునాదులను గట్టిచేయడం. 2000 సం. నాటికి భారత్ లోని 94% గ్రామాలలో ఒక కి.మీ. పరిధిలో ఒక ప్రాథమిక పాఠశాల ను, 84% గ్రామాలలో ప్రతి 3 కి.మీ. పరిధిలో ఒక ప్రాథమికోన్నత పాఠశాల స్థాపించునట్లు చర్యలు తీసుకున్నారు. భారత్ లో 1950-51, ప్రాథమిక విద్యకొరకు 31 లక్షల విద్యార్థులు నమోదైతే 1997-98 లో ఈ సంఖ్య 395 లక్షలకు చేరింది. 1950-51 లో ప్రాథమిక పాఠశాలల సంఖ్య 2.23 లక్షలుంటే 1996-97 లో ఈ సంఖ్య 7.75 లక్షలకు చేరింది.
2002/2003, లో 6-14 సంవత్సరాల వయస్సుగల బాలబాలికలు 82% నమోదైనారు. భారత ప్రభుత్వం తన లక్ష్యాన్ని 2000 ల దశకంలో 100% నమోదు కార్యక్రమం పెట్టుకున్నది. దీనిని సాధించుటకు సర్వశిక్షా అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
బడి మానివేసే వారి సంఖ్యను తగ్గించడానికి, ప్రభుత్వం క్రింది చర్యలను చేపట్టింది :
- తల్లి-దండ్రులలో అవగాహనను పెంపొందించడం.
- సమాజాన్ని కార్యోన్ముఖం చేయడం.
- ఆర్థిక రాయితీలు
- కనీస అభ్యసనా స్థాయిలు (MLL)
- జిల్లా ప్రాథమిక విద్యా పథకం (DPEP)
- నేషనల్ ప్రోగ్రాం ఆఫ్ న్యూట్రీషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ (మధ్యాహ్న భోజన పథకము)
- 86వ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రాథమిక విద్యా హక్కును ప్రాథమిక హక్కు మరియు ప్రాథమిక బాధ్యతగా లోక్ సభలో చట్టం చేశారు.
- జాతీయ ప్రాథమిక విద్యా సంస్థ.
- రాష్ట్రాల విద్యామంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షునిగా మానవ వనరుల అభివృద్ది మంత్రి వ్యవహరిస్తారు.
- ప్రసార మాధ్యమాల ప్రచార ప్రణాళికలు.
- సర్వశిక్షా అభియాన్ (SCERT ప్రాంగణంలో తన కార్యక్రమాలు నిర్వహిస్తుంది)
ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు అమలు పరుస్తున్ననూ, బడి మానివేసే వారి సంఖ్య అనుకున్నంత స్థాయిలో తగ్గడం లేదు. పాఠశాలల దీనావస్థలు బడిమానివేసేవారి సంఖ్య పెరగడానికి ప్రధాన కారణాలు. DISE 2005-6 డేటా ప్రకారం 9.54% పాఠశాలలు ఒకే గది కలిగినవి మరియు 10.45% పాఠశాలలకు తరగతి గదులు లేవు. ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల సగటు నిష్పత్తి 1:36, 8.39% పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు; 5.30% పాఠశాలలు, ఒక ఉపాధ్యాయునికి 100 కంటే ఎక్కువ విద్యార్థులను కలిగి ఉన్నాయి; 30.87% పాఠశాలలలో మహిళా ఉపాధ్యాయినుల కొరత ఉంది. కేవలం 10.73% పాఠశాలలు మాత్రమే ఒక కంప్యూటర్ ను కలిగి ఉన్నాయి. బాలికల నమోదులు బాలుర నమోదుల కంటే తక్కువ గలవు.
ఉన్నత విద్యసవరించు
భారతదేశంలో ఉన్నత విద్య ను, కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ, మానవ వనరుల అభివృద్ధి శాఖ వారు నియంత్రిస్తారు. దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు రాష్ట్రాలచే నియంత్రించబడుతాయి, కానీ, దేశం మొత్తం మీద 18 విశ్వవిద్యాలయాలు కేంద్రప్రభుత్వంచే నియంత్రించబడుతాయి. వీటిని కేంద్ర విశ్వవిద్యాలయాలు అని అంటారు. వీటి ఏర్పాటు, నిర్వహణ లను కేంద్రప్రభుత్వం చేపడుతుంది.
ఐఐటీలు : ఇంజనీరింగ్ తరువాత వీటిని ప్రవేశపెట్టారు. ఇవి ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ నందు, ఉత్తమ స్థానాలను కలిగి ఉన్నాయి.
ప్రపంచంలోని ప్రముఖ 200 విశ్వవిద్యాలయాలలో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఒకటి.[2]. ఇదేవిధంగా, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ సప్లిమెంట్ సంస్థ, 2006లో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన స్కూల్ ఆఫ్ సోషియల్ సైన్సెస్ను ప్రపంచంలోని మొదటి 100 సంస్థలలో 57వ ర్యాంకును ఇచ్చింది.
ద నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ ఒక పేరొందిన సంస్థ, దీని విద్యార్థులకు 'ర్హోడ్స్ స్కాలర్ షిప్'లు ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి లభించాయి. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (All India Institute of Medical Sciences), భారత్ లో ప్రముఖమైన వైద్యసంస్థ.
ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో అనేక సంస్థలు నడుస్తున్నవి. ప్రభుత్వం వీటికి గుర్తింపులనూ ఇస్తున్నది. ప్రాథమిక విద్య సార్వత్రీకరణకు ఇవి మంచి ఉదాహరణలు.
గుర్తింపులు, అనుసంధానాలుసవరించు
విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వ గుర్తింపులు అవసరం. లోక్ సభ చట్టం చే ప్రారంభించబడిన విశ్వవిద్యాలయాలకు ఎలాంటి గుర్తింపు అక్కరలేదు. ఇవి కేంద్ర విశ్వవిద్యాలయాలుగా గుర్తింపబడుతాయి. గుర్తింపు లేని విశ్వవిద్యాలయాలను ప్రభుత్వం 'దొంగ విశ్వవిద్యాలయం' లుగా ప్రకటించి, వాటికి పట్టాలు ప్రదానం చేసేందుకు అనర్హమైనవిగా ప్రకటిస్తుంది.[3]. University Grants Commission Act 1956 విశదీకరిస్తుంది,
"డిగ్రీలు ప్రదానం చేసే అర్హతలు, కేవలం ప్రభుత్వాలనుండి అనుమతి పొంది ప్రారంభించబడిన విశ్వవిద్యాలయాలకునూ, డీమ్డ్ యూనివర్శిటీగా ప్రభుత్వంచే ప్రకటింపబడిన విశ్వవిద్యాలయాలకునూ, లేదా పార్లమెంటు ఆక్టు చే ప్రారంభింపబడిన విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఉన్నవి."[3]
స్వతంత్ర సంస్థలను నియంత్రించే, పర్యవేక్షించే బాధ్యతలు విశ్వ విద్యాలయాల విరాళాల సంస్థకు ఉంటాయి.[4]: స్వతంత్ర సంస్థలు :
- అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (All India Council for Technical Education) (AICTE)
- దూరవిద్యా మండలి (Distance Education Council) (DEC)
- భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (Indian Council of Agricultural Research) (ICAR)
- భారతీయ విద్యా మండలి కౌన్సిల్ (Bar Council of India) (BCI)
- నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రీడిటేషన్ కౌన్సిల్ (NAAC)
- జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (National Council for Teacher Education) (NCTE)
- భ్హారతీయ పునరావాస మండలి (Rehabilitation Council of India) (RCI)
- మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Medical Council of India) (MCI)
- ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Pharmacy Council of India) (PCI)
- ఇండియన్ నర్సింగ్ కౌన్సి (Indian Nursing Council) (INC)
- డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Dental Council of India) (DCI)
- సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి (Central Council of Homeopathy) (CCH)
- సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ (Central Council of Indian Medicine) (CCIM)
- వెటెరినరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (veterinary council of india) (VCI)
చరిత్రసవరించు
భారతదేశంలో ప్రాచీనకాలం నుండి, సాంప్రదాయకవిద్య, ప్రామాణికవిద్యావిధానాలు కానవస్తాయి. గురుకులం విద్యావిధానాలు ప్రాచీన భారత్ లో సర్వసాధారణం. గురుకులాలు, హిందూ సంప్రదాయాల విద్యాకేంద్రాలు. ఇవి గురుకుల పాఠశాలల లాంటివి. సాధారణంగా ఇవి ఉపాధ్యాయుని ఇల్లు లేదా ఋషిపుంగవుల నివాసగృహాలు. విద్య ఉచితంగా అందించబడేది, కానీ ఇవి ఉచ్ఛజాతులవారికి మాత్రమే పరిమితమైయుండేవి. ఉన్నత కుటుంబాలు తమ పిల్లలకు బోధించిన బోధకులకు గురుదక్షిణ సమర్పించుకునేవారు. గురుకులాలలో గురువులు ఈ శాస్త్రాలు బోధించేవారు : ధర్మము, గ్రంథ జ్ఞానాలు, హిందూ తత్వము, సంస్కృత సాహిత్యం, యుద్ధవిద్యలు, రాజకీయాలు, గణిత శాస్త్రము, వైద్యం, ఖగోళ శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము, చరిత్ర, ఇతిహాసాలు మొదలగునవి. బ్రాహ్మణకులం మరియు క్షత్రియకులాలవారికి మాత్రమే ఈ గురుకులాలలో విద్య లభించేది. కాని బౌద్ధమతము మరియు జైనమతము ఆవిర్భవించిన తరువాత, ఇతర కులాలవారికీ ఈ విద్యాభ్యాసం లభించడం ఆరంభమైనది. మొదటి వేయి సంవత్సరాల కాలంలో, నలంద, తక్షశిల, ఉజ్జయిని మరియు విక్రమశిల విశ్వవిద్యాలయాలు ప్రాశస్త్యం పొందాయి. కళ, వాస్తు శాస్త్రం, చిత్రలేఖనం, తర్కము, గణితం, వ్యాకరణం, తత్వము, ఖగోళ శాస్త్రము, సాహిత్యము, బౌద్ధ ధర్మం, హిందూ ధర్మం, అర్థశాస్త్రము, న్యాయ శాస్త్రము మరియు వైద్య శాస్త్రము మున్నగునవి బోధించేవారు. ఒక్కొక్క విశ్వవిద్యాలయం ఒక్కో విషయాలలో ప్రాముఖ్యమైన విద్యనందించేది. ఉదాహరణకు, తక్షశిల వైద్యశాస్త్రము నకు ప్రసిద్ధి. ఉజ్జయిని ఖగోళ శాస్త్రము నకు ప్రసిద్ధి. నలందలో అన్ని శాస్త్రాలు బోధించేవారు. దీనిలో దాదాపు 10,000 విద్యార్థులు విద్యనభ్యసించేవారు. బ్రిటిష్ రికార్డుల ప్రకారం 18వ శతాబ్దంలో విద్యావ్యాప్తి చాలాఉండేది. ప్రతి దేవాలయం, ప్రతి మసీదు, ప్రతి గ్రామం ఒక పాఠశాలను కలిగి ఉండేది. వీటిలో చదవడం, వ్రాయడం, గణితం, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, ఖగోళ శాస్త్రము, నీతి, న్యాయసూత్రములు, వైద్యం మరియు మతపరమైన శాస్త్రాలు బోధించెడివారు. ఈ పాఠశాలలలో అన్ని జాతులకు, తెగలకు సంబంధించిన పిల్లలకు విద్యాబోధనలు జరిగేవి. మహాత్మా గాంధీ అభిప్రాయం లో, ఈ సాంప్రదాయక విద్య ఓ అందమైన వృక్షం లాంటిది. బ్రిటిష్ పరిపాలన కాలంలో ఇది నాశనమైనది.
17వ శతాబ్దం వరకూసవరించు
నలంద, తక్షశిల, ఉజ్జయిని, విక్రమశిల లలో 17వ శతాబ్దం వరకూ విద్యావిధానాలు సార్వజనీకంగానూ, సకలశాస్త్రాలలో విశాలంగానూ సాగాయి. ఈ విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగానూ, సాంస్కృతిక వారసత్వ కేంద్రాలుగానూ వర్థిల్లాయి.
బ్రిటిష్ పరిపాలన కాలంలో విద్యసవరించు
బ్రిటిష్ రికార్డుల ప్రకారం, భారతదేశంలో విద్య 18వ శతాబ్దం వరకూ బాగా వ్యాప్తి చెందియుండినది. దాదాపు అన్ని సార్వజనీయమైన విజ్ఞానాలు మరియు శాస్త్రాలలోనూ భారతదేశం మంచి ప్రావీణ్యత కలిగియున్నది. అన్ని సామాజిక తరగతులకూ విద్య అందడం జరుగుతున్నదని తెలుస్తున్నది. 1820 వరకూ, ముద్రణ కలిగిన పుస్తకాలు భారత పాఠశాలలలో లభ్యం కాలేదు. బ్రిటిష్ వారు, భారతదేశంలో తమ స్వలాభాన్ని దృష్టిలో ఉంచుకొని, విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు.
స్వాతంత్ర్యం తరువాతసవరించు
స్వాతంత్ర్యానంతరం, విద్య, రాష్ట్రాల బాధ్యతగా గుర్తింపబడింది. కేంద్రప్రభుత్వ బాధ్యత కేవలం, సాంకేతిక మరియు ఉన్నత విద్యలో సహకారమందించడం మాత్రమే. ఇది 1976 వరకూ కొనసాగింది. దీని తరువాత విద్య ఉమ్మడి జాబితాలో చేరింది.
విద్యాసంస్థసవరించు
ఆనాటి విశ్వవిద్యాలయాల విరాళాల సంస్థ అధ్యక్షుడు అయిన డాక్టర్ డి.ఎస్. కొఠారీ ఛైర్మన్ గా ఓ సంస్థను ఏర్పాటు చేసి విద్యా సిఫారసులు చేయమని నియమించారు. ఈ కమిటీలో 16 మంది సభ్యులు గలరు. దీనిని 1964 అక్టోబరు 2 లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు కొఠారీ కమీషన్ అని పేరు.
ముఖ్యమైన కార్యక్రమాల క్రమంసవరించు
- 1935: సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, (Central Advisory Board of Education CABE) స్థాపన.
- 1976: విద్యను కేంద్ర మరియు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో చేర్చారు.
- 1986: జాతీయ విద్యా విధానము (National Policy on Education) (NPE).
- 1992: జాతీయ విద్యా విధానాన్ని రివైజు చేశారు.
- డిసెంబరు 17, 1998: అస్సాం ప్రభుత్వం, పాఠశాలలో 'ర్యాగింగ్' ను నేరంగా పరిగణిస్తూ చట్టం చేసింది.
- నవంబరు 1998: ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి విద్యా వాహిని అనేకార్యక్రమాన్ని ప్రారంభించి, విశ్వవిద్యాలయాలను, యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ (యు.జీ.సీ.) మరియు 'సీ.ఎస్.ఐ.ఆర్' లను అనుసంధానం చేశారు.
విద్య కొరకు బడ్జెట్ కేటాయింపులుసవరించు
భారత్‌లో విద్య కొరకు బడ్జెట్ కేటాయింపులు పంచవర్ష ప్రణాళికల ద్వారా, విద్యకొరకు కేటాయించే బడ్జెట్ లను విపరీతంగా పెంచారు. ఎంత పెంచిననూ, జనాభాను దృష్టిలో పెట్టుకున్న ఎడల ఈ బడ్జెట్ చాలా తక్కువ. సైన్యం కోసం వెచ్చిస్తున్న బడ్జెట్లో ఐదవ భాగంకూడా విద్య కొరకు వెచ్చించడంలేదు. ఈ బడ్జెట్ లో చాలా భాగం ఉపాధ్యాయుల జీతభత్యాలకే సరిపోతూంది. పాఠశాలల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కొరకు అరకొర బడ్జెట్ మాత్రమే అందజేయబడుచున్నది.
- పంచవర్ష ప్రణాళికలలో విద్య కొరకు ఖర్చులు (మిలియన్ రూపాయలలో)
డేటా మూలం "భారతదేశంలో విద్యా ప్రణాళికలు మరియు పరిపాలన" :: రెట్రోస్పెక్ట్ మరియు ప్రాస్పెక్ట్, విద్యా ప్రణాళికలు మరియు పరిపాలన జర్నల్, Vol. VII, నెం.2, NHIEPA. న్యూఢిల్లీ, డా. ఆర్.వి.వైద్యనాథ అయ్యర్.
నోట్:
- ఖర్చు, మిలియన్ రూపాయలలో
- 9వ పంచవర్ష ప్రణాళిక కొరకు కేటాయింప బడ్డ బడ్జెట్; రూ: 45267.40 మిలియన్ 'మధ్యాహ్న భోజన పథకం' కొరకు
విద్య పరమార్ధంసవరించు
విద్య పరమార్ధం విజ్ణానమే కాని ఉద్యోగం కాదు. అయితే నేడు దేశంలో విద్య యొక్క నిర్వచనం, పరమార్ధం మారిపోతున్నది. పూర్వం విద్యార్థులు విజ్ణాన సముపార్జన కోసం విద్యను అభ్యసించేవారు. నేటి విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం విద్యను అభ్యసిస్తున్నారు. ఇది బహు దురదృష్టకరము. మనిషి బ్రతుకడానికి వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం అను మూడు రకాలుగా ఉంది. విద్య వలన ఈ మూడింటినీ సమర్ధవంతంగా నిర్వర్తించవచ్చును. రైతులకు విద్య తోడైతే తమ వ్యవసాయ వృత్తిలో అధ్బుతంగా రాణించవచ్చును. పదిమందిలో దూసుకువెళ్ళిపోయి, ధైర్యం, స్వశక్తి మీద నమ్మకం ఉన్నవారు వ్యాపారం చేసుకొనేవారికి విద్య అండగా ఉంటుంది. ఇక ఉద్యోగం అనేది అతి హీన పరిస్థితుల్లో తినడానికి లోటు లేకుండా చేసుకొనే పనిగా చెప్పవచ్చు. అయితే నేటి అధ్యాపకులు తమ విద్యార్థులకు సమకాలీన సమాజ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు కాకుండా కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నారు. దీని వలన దేశంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. చదువుకి, సంపాదనకి సంబంధం లేదని, సంపాదనకి కావాల్సింది తెలివితేటలు, చదువు లేనివారు సైతం కోట్లు సంపాదిస్తున్నారు అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గ్రహించవలసియున్నది.
పూర్తి వ్యాసం కొరకు ఉద్యోగం చూడండి.
ఇదీ చూడండిసవరించు
ఇతర పఠనాలుసవరించు
- Education in Ancient India.
- The Beautiful Tree: Indigenous Education in the Eighteenth Century by Dharampal (Biblia Impex, Delhi, 1983)
- Marie Lall, The Challenges for India's Education System, Chatham House: London, 2005 (ASP BP 05/03)
- Meenakshi Jain et al. (2003) History in the New NCERT Textbooks Fallacies in the IHC Report, National Council of Educational Research and Training, ISBN 81-7450-227-0
- Rosser, Yvette. Curriculum as Destiny: Forging National Identity in India, Pakistan, and Bangladesh (2003) University of Texas at Austin. PDF link
- Shourie, Arun. Eminent Historians: Their Technology, Their Line, Their Fraud New Delhi, 1998.
- Hunter Education Commission Report (1884) - Fascinating report detailing the history of education in India (from the coloniser's perspective of course)
నోట్స్సవరించు
- ↑ Foreign Univ Bill ’06 gets GoM okay 30 Nov, 2006
- ↑ THES, "The World's Top 200 Universities", The Times Higher Education Supplement, 6 October 2006. http://www.thes.co.uk/ (Subscription is necessary to get access to much of THES content)
- ↑ 3.0 3.1 Central Universities
- ↑ Higher Education