గుంటూరు జిల్లా రేపల్లె మండలం కారుమూరు లో భజన కోలాటాల క్లారినెట్ ఎక్స్పర్ట్ గా పేరుగాంచిన షేక్ మీరాసాహెబ్ 29.11.2008 న పరమపదించారు. ఏ.వీ.సుబ్బారావు మొదలు డీ.వీ.సుబ్బారావు మనుమని వరకు రంగస్థలకళాకారులందరికీ తలలో నాలుకలా వ్యవహరించి క్లారినెట్ వాయించిన ఒక రత్నం రాలిపోయిందని పలువురు కళాకారులు బాధపడ్డారు. ఈయన తల్లి దండ్రులు షేక్ సుబ్బులు, గోవాడ మస్తాను. తిరుపతి, రవీంద్రభారతి, ఇంకా పలు ప్రాంతాలలో ఈయన కోలాటం చెక్కభజనలలో క్లారినేట్ వాయించి అవార్డులు పొందారు.కోలాటం చెక్కభజనలలో ఈయన క్లారినేట్ విన్యాసానికి ప్రేక్షకులు కూడా మైమరచి నాట్యం చేస్తారట.