షోరియా
షోరియా (లాటిన్ Shorea) పుష్పించే మొక్కలలో డిప్టెరోకార్పేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. షోరియా, డిప్టెరోకార్పేసి కుటుంబంలోని మొక్కల జాతి.ఈ మొక్కలు కలపకు ఎంతో విలువైనవి. సాల్ (షోరియా రోబస్టా) . భారత ఉపఖండంలోని రెండవ అతి ముఖ్యమైన కలప చెట్టు (టేకు తరువాత). కలప రెండు ప్రధాన రకాలు, తెలుపు, ఎరుపు మెరంటి [1]. షోరియా చెట్ల పెంపకం మన దేశం అడవులలో సుమారు 13.3% . ఈ మొక్కలను హిమాలయా పర్వతాలలో , అస్సాం, త్రిపుర, మేఘాలయ , మధ్య ప్రదేశ్ , హిమాచల్ ప్రదేశ్ , పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో మనం చూడగలం.
షోరియా | |
---|---|
Shorea roxburghii | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Genus: | షోరియా
|
చరిత్ర
మార్చుషోరియా చెట్టు 40 మీ (131 అడుగులు) నుండి 30 మీ (98 అడుగులు) వరకు వేగంగా పెరుగుతుంది. మొక్క స్వీయ-సారవంతమైనది కాదు.ఇసుక, మధ్యస్థ ,భారీ (బంకమట్టి) నేలలు, ఎండిపోయిన మట్టి లొ , ( తెమతొ ఉన్న) నేలలు పెరుదలకు అనుకూలము.ఇది నీడలో పెరగదు. ఇది 2,000 మీటర్ల ఎత్తులో పగటి ఉష్ణోగ్రతలు 28 - 34 ° c పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఇది బాగా పెరుగుతుంది, 7 - 47 ° c ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. 1,500 - 3,500 మిమీ పరిధిలో సగటు వార్షిక వర్ష పాతం , 1,000 - 7.300 మిమీ వర్ష పాతం వరకు తట్టుకుంటుంది. . చిన్న చెట్లు త్వరగా పెరుగుతాయి, చాలా చిన్న వయస్సులోనే పొడవైన కాండ తో పెరుగుతాయి ,6 సంవత్సరాల తరువాత 6 మీటర్ల ఎత్తుకు చేరుకుంటాయి . పండ్లు , విత్తనాల పెరుగుదల 15 సంవత్సరాల లలో మొదలవుతుంది, చెట్టు అడవి మంటలను చాలా వరకు తట్టుకుంటుంది [2]
ఉపయోగాలు
మార్చుషోరియా మొక్కలను ఆయుర్వేదం లో ఆస్తమా, అల్సర్, దగ్గు, ఇతరత్రా మందుల తయారీలో వాడుతున్నారు.[3] అడవుల లో షోరియా చెట్లు వృక్ష సంపద సంరక్షణలో ఎంతో ఉపయోగ పడుతూ పర్యావరణ పరిరక్షణ కు తోడ్పతున్నాయి[4] . షోరియా చెట్టు కలప భారీది, బలమైనది, చాలా మన్నికైనది . షోరియా చెక్క గట్టిగా ఉండటం వలన , ఇళ్ళలో అధిక ఒత్తిడికి లోబడి నిర్మాణాలను నిర్మించడానికి బాగా సరిపోతుంది, ఇది హైడ్రాలిక్ ఇంజనీరింగ్, ఓడలు ,రైల్వే కార్లు, స్తంభాలు, రైల్వే పట్టాలకు , కిటికీ ఫ్రేములు, సాధారణ ఇంటీరియర్ పనులకు , గృహ, వ్యవసాయ పనిముట్లు చేయడానికి, రెమ్మలను వాడతారు. షోరియా కలప అటవీ ప్రాంత ప్రజలకు వంట చెరకుగా వాడతారు [5]
మూలాలు
మార్చు- ↑ "Shorea | plant genus". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-07-29.
- ↑ "Shorea robusta Sal Tree PFAF Plant Database". pfaf.org. Retrieved 2020-09-29.
- ↑ Anupama (2016-07-07). "Sal tree (Shorea robusta) Information and Uses". bimbima (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-07-29. Retrieved 2020-07-29.
- ↑ Pandey, S.K.; Shukla, R.P. (2003-11-01). "Plant diversity in managed sal (Shorea robusta Gaertn.) forests of Gorakhpur, India: species composition, regeneration and conservation". Biodiversity & Conservation (in ఇంగ్లీష్). 12 (11): 2295–2319. doi:10.1023/A:1024589230554. ISSN 1572-9710.
- ↑ "Shorea robusta - Useful Tropical Plants". tropical.theferns.info. Archived from the original on 2020-09-29. Retrieved 2020-09-29.