ష్ గప్ చుప్ అనేది మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి నవలల్లో ఒక ప్రసిద్ధ నవల. దీనిని జంధ్యాల దర్శకత్వంలో సినిమాగా నిర్మించారు. ఈ చిత్రములో ప్రముఖ తారలైన భానుప్రియ, రాళ్ళపల్లి లాంటి వారు నటించారు.

ష్ గప్ చుప్ నవల ముఖ చిత్రము

బ్యాంకులో పని చేసే రవళి అనే అమ్మాయికి బ్యాంకు డబ్బులో ఒక లక్ష ఆమె తండ్రి వలన తక్కువౌతుంది. దానిని ఆమె ఎవరికీ తెలియకుండా బ్యాంకుకు ఎలా చేర్చగలిగినదనే దానిని రచయిత కొంత సస్పెన్స్ జోడించి చెప్పాడు.