ష‌హ‌మ‌త్ జా హైదరాబాదు నిజాం వారసుడు. హైదరాబాద్ రాజ్య చివరి (7వ) నిజాం ఉస్మాన్ అలీ ఖాన్, అసఫ్ జా VII మనవడు, మొజాం జా కుమారుడు. షాజీ అనే క‌లం పేరుతో ఉర్దూలో కవిత్వం కూడా రాశాడు.[1]

ష‌హ‌మ‌త్ జా
జననం1950
మరణం2023, జూలై 30
Burial placeమస్జిద్-ఎ-జూడి, కోఠి, హైదరాబాద్
తల్లిదండ్రులు

జీవిత విశేషాలు

మార్చు

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు మోజం ఝా రెండవ భార్య అన్వరీ బేగంకు 1950లో షహమత్ జా జన్మించాడు.[2] షహమత్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో విద్యనభ్యసించాడు. ఉర్థూలో మంచి కవిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ష‌హ‌మ‌త్ జా ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. సంతానం లేదు. ఇద్ద‌రు భార్య‌లు జా నుంచి విడిపోయారు.[3]

చివరి జీవితం, మరణం

మార్చు

ష‌హ‌మ‌త్ జా రెడ్‌హిల్స్‌లోని తన ఇంటిని విక్రయించి, బంజారాహిల్స్‌లోని తన సోదరి ఇంట్లో నివాసం ఉన్నాడు. అనారోగ్యంతో 2023, జూలై 30న మరణించిన ష‌హ‌మ‌త్ జా అంత్య‌క్రియ‌లు జూలై 31న తన తాత ఉస్మాన్ అలీ ఖాన్ సమాధి సమీపంలో హైదరాబాద్ కోఠిలోని మస్జిద్-ఎ-జూడిలో జరిగాయి.[4]

మూలాలు

మార్చు
  1. telugu, NT News (2023-07-31). "Hyderabad | మీర్ ఉస్మాన్ అలీఖాన్ మ‌నుమ‌డు ష‌హ‌మ‌త్ ఝా క‌న్నుమూత‌". www.ntnews.com. Archived from the original on 2023-08-01. Retrieved 2023-08-31.
  2. krishna (2023-07-31). "చివరి నిజాం మనుమడు కన్నుమూత". Mana Telangana. Archived from the original on 2023-08-31. Retrieved 2023-08-31.
  3. Telugu, TV9 (2023-07-31). "Hyderabad : చివరి నిజాం రాజు మనవడు అనారోగ్యంతో మృతి.. అతని పేరు, ఆస్తుల వివరాలు..!". TV9 Telugu. Archived from the original on 2023-08-31. Retrieved 2023-08-31.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "7వ నిజాం మనవడు మృతికి నివాళి". EENADU. 2023-08-01. Archived from the original on 2023-08-01. Retrieved 2023-08-31.