సంకీర్తన
కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. అలాగే కీర్తనను లయబద్ధంగా అలపిస్తూ పాడడాన్ని సంకీర్తన అంటారు.
వైకుంఠంలో, దేవలోకంలో తాను ప్రశాంతంగా ఉండననీ, ఎక్కడ అతని భక్తులు తన్మయత్వంతో గానం చేస్తుంటారో అక్కడ తిష్ఠవేసుకును ఉంటాననీ, కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు, ద్వాపర యుగంలో వ్రతాలు, పూజలు, కలియుగంలో సంకీర్తనలు మోక్షదాయకమని శ్రీహరి స్వయంగా నారదునితో చెప్పినట్లు విష్ణుపురణంలో ఉన్నది.
రకాలు
మార్చుసంకీర్తన నాలుగు విధాలుగా ఆలపించేవారు వాగ్గేయకారులు. లీలా, గుణ, భావ, నామ సంకీర్తనలు. భావ, రాగ తాళ సమన్వయంతో, ఆర్తితో ప్రార్థించే భక్తి తరంగాలు సంకీర్తనలు.
సంకీర్తనా రీతులు భిన్నంగా ఉంటాయి. నామ, భజన, నగర సంకీర్తనా భజన, అఖండ నామ సప్తాహ భజన, కోలాట భజన... పేర్లు ఎన్ని ఉన్నా చేసేసి నామస్మరణం. [1]
త్యాగరాజు సంకీర్తనలు
మార్చుసంకీర్తనా ప్రపంచంలో రాజులకెల్ల రారాజుగా త్యాగరాజు పేరు పొందాడు. తనకు దూరం చేసిన శ్రీరామ విగ్రహాలు తమంతట తామే తిరిగి స్వధామానికి చేర్చే ప్రక్రియగా సంకీర్తన గావించాడు. కొలువై ఉన్నాడే కోదండపాణి, జగదానంద కారకా వంటి కీర్తనలు కొన్ని వేల రాగాలలో, తాళాలలో ఒదిగిపోయి జన హృదయాలలో ఎదిగాయి. పంచ రత్న కీర్తనలు, దివ్య నామ సంకీర్తనలు వేలాదిగా ఏర్చి కూర్చారు నాదబ్రహ్మ.
రామదాసు సంకీర్తనలు
మార్చుభక్త రామదాసు శ్రీరామ గానాన్ని జానపదులకు, నిరక్షరాస్యులకు సైతం అర్థమయ్యేట్లు అందించాడు. దాదాని 400 కీర్తనలు శ్రీరామునిపై రచించి గానం చేసాడు. చరణములే నమ్మితి అనే సంపూర్ణ శరణాగతి తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు అనే అభయం.. వందలాది భక్తి సంకీర్తనలతో సమస్త జనులను అలరించాడు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "సామూహిక కీర్తనం సంకీర్తనం". EENADU. Retrieved 2024-10-06.